ఫ్లిప్‌కార్ట్.. జడేజా.. ఓ సరదా గొడవ | Ravindra Jadeja does not like note 4 to be released on that date | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్.. జడేజా.. ఓ సరదా గొడవ

Published Tue, Jan 17 2017 10:46 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌కార్ట్.. జడేజా.. ఓ సరదా గొడవ - Sakshi

ఫ్లిప్‌కార్ట్.. జడేజా.. ఓ సరదా గొడవ

చవక ధరలకే స్మార్ట్ ఫోన్లు అందించే షియోమి సంస్థ తన ఆల్ రౌండర్ ఫోన్ రెడ్‌మీ నోట్ 4ను ఈనెల 19న విడుదల చేస్తోంది. కానీ, టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మాత్రం అది నచ్చలేదు. అందుకే ట్విట్టర్‌లో సరదాగా ఓ చిన్నపాటి గొడవేసుకున్నాడు. కేవలం తమ సైట్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకాలు సాగబోతున్న షియోమి రెడ్‌మి నోట్ 4 గురించి ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ టీజింగ్‌గా ఒక ట్వీట్ చేసింది. ''భారత కొత్త ఆల్‌రౌండర్ జనవరి 19న మమ్మల్ని విజిట్ చేస్తున్నారు. ఎవరో ఏంటో తెలుసా?'' అని అందులో పేర్కొంది. వెంటనే 'సర్' రవీంద్ర జడేజా దానికి రెస్పాండ్ అయ్యాడు. ఆ ప్రకటన చేయడానికి ముందు తనను సంప్రదించాలి కదా, ఎందుకు చేయలేదు అని అడిగాడు. ఆ కార్యక్రమాన్ని జనవరి 20వ తేదీకివాయిదా వేయాలని కోరాడు. తనకు 19వ తేదీన ఒక మ్యాచ్ ఉంది కాబట్టి అలా చేయాలన్నాడు. దానిపై ఇక నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఒకరి తర్వాత ఒకరుగా దానిమీద ట్వీట్లు వెల్లువెత్తించారు. దాంతో ఫ్లిప్‌కార్ట్ ఆశించిన స్పందన వచ్చినట్లయింది. 
 
షియోమి రెడ్‌మి నోట్ 3 మార్కెట్లో క్లిక్ కావడంతో.. దాదాపు దాని ధరలోనే మరికొంత అప్‌గ్రేడెడ్ వెర్షన్, మరింత ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో నోట్ 4ను తీసుకొస్తోంది. (పూర్తి వివరాలకు చదవండి: నోట్ 3 ధరకే రెడ్‌మి నోట్ 4?) 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement