రెడ్‌ మి నోట్‌ 4 లవర్స్‌కు శుభవార్త | Xiaomi Redmi Note 4 to go on sale on Flipkart today | Sakshi
Sakshi News home page

రెడ్‌ మి నోట్‌ 4 లవర్స్‌కు శుభవార్త

Published Wed, May 10 2017 12:52 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

రెడ్‌ మి నోట్‌ 4 లవర్స్‌కు శుభవార్త - Sakshi

రెడ్‌ మి నోట్‌ 4 లవర్స్‌కు శుభవార్త

చైనా మొబైల్‌ దిగ్గజం  షియామి రెడ్‌ సిరీస్‌ ఫోన్‌ లవర్స్‌కు శుభవార్త.   మేకిన్‌ ఇండియా పథకంలో  భాగంగా  ఇటీవల   విడుదల చేసిన రెడ్‌మి నోట్‌ 4  ఫ్లాష్‌ సేల్‌ మనోసారి ప్రారంభించింది.  నిమిషాల్లో లక్షల ఫోన్ల అమ్మకాలతో సునామీ సృష్టించి,  అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ గా  నిలిచిన క్రేజీ  స్మార్ట్‌ఫోన్‌   అమ్మకాలు  తిరిగి నేడు (బుధవారం)  ప్రారంభంకానున్నాయి.  ఎమ్ఐ.కామ్‌, ఆన్‌లైన్‌  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12గంటలనుంచి  ప్రత్యేకంగా లభ్యంకానుంది.   దీని ప్రారంభ ధర రూ .9,999గా ఉంది.  ఫోన్ వేరియంట్ల ఆధారంగా ధర మారుతుంది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

షియోమి రెడ్ మి నోట్ 4 ఫీచర్లు
2.5డి కర్వ్‌డ్ గ్లాస్‌తో 5.5  ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.0 నోగట్  ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 8 ఇంటర్‌ఫేస్
1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్
డెకాకోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్
2జీబీ/3జీబీ /4జీబీర్యామ్, 32జీబీ/32జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ
128జీబీ  ఎక్స్పాండబుల్   మెమొరీ
13 మెగాపిక్సెల్ కెమెరా
 5 ఎంపీ  ఫ్రంట్  కెమెరా
ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రార్డ్ సెన్సార్
4100 ఎంఏహెచ్ బ్యాటరీ

కాగా  ఈ మూడు వేరియంట్ల ధరలు ఈ  విధంగా ఉన్నాయి.
2జీబీ+ 32జీబీ వేరియంట్‌ధర  రూ. 9999
3జీబీ + 32జీబీ వేరియంట్‌ధర రూ. 10,999
4జీబీ + 64జీబీ వేరియంట్‌ ధరరూ. 12,999
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement