నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ అంటే వినియోగదారులకు అదో క్రేజ్. ఈ స్మార్ట్‌ఫోన్లకు చైనీస్ దిగ్గజం షావోమి స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పోటాపోటీగా వస్తోంది. అటు షావోమి స్మార్ట్‌ఫోన్లు సెకన్ల వ్యవధిలో అవుటాఫ్ స్టాక్ అవుతుండగా.. ఇటు నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లు కూడా అదే రేంజ్‌లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా నోకియా 6.1 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్ సేల్‌కు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వచ్చిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ డివైజ్ అవుటాఫ్ స్టాక్ అయింది.
నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్, 12:02 కల్లా అవుటాఫ్ స్టాక్ బోర్డును పెట్టేసింది. అంటే ఆ మేర డిమాండ్‌తో నోకియా 6.1 ప్లస్‌ను వినియోగదారులు సొంత చేసుకున్నారు. అయితే ఈ సేల్‌లో ఎన్ని యూనిట్లను విక్రయానికి ఉంచారో తెలియదు. నోకియా 6.1 ప్లస్‌కు ఇది మూడో సేల్. తొలి సేల్ ఆగస్టు 30న నిర్వహించారు. అప్పుడే వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు మాంచి డిమాండ్ వచ్చింది. తొలి సేల్‌కు వచ్చిన మూడు వారాల్లోనే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు వస్తున్న రేటింగ్స్, రివ్యూలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే 10,680 రేటింగ్స్, 2,329 రివ్యూలు ఫ్లిప్‌కార్ట్‌లో రికార్డయ్యాయి. తర్వాత సేల్ సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.
నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు...
5.8 అంగుళాల నాచ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్
గ్లాస్ శాండ్‌విచ్ డిజైన్ విత్ 2.5డీ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
డ్యూయల్ సిమ్(నానో)
వెనుక వైపు రెండు కెమెరాలు(ఒకటి 16 మెగాపిక్సెల్, రెండోది 5 మెగాపిక్సెల్ సెన్సార్)
ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా
4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
400 జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశం
ముందు 93 శాతం గ్లాస్ సర్‌ఫేస్‌తో అల్యూమినియం బాడీ
3060 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ.15,999
Comments
Please login to add a commentAdd a comment