Nokia 6.1 Plus
-
రెండు నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్
న్యూఢిల్లీ : నోకియా బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ అంటే వినియోగదారులకు అదో క్రేజ్. ఈ స్మార్ట్ఫోన్లకు చైనీస్ దిగ్గజం షావోమి స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పోటాపోటీగా వస్తోంది. అటు షావోమి స్మార్ట్ఫోన్లు సెకన్ల వ్యవధిలో అవుటాఫ్ స్టాక్ అవుతుండగా.. ఇటు నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు కూడా అదే రేంజ్లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా నోకియా 6.1 ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్ సేల్కు వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వచ్చిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఈ డివైజ్ అవుటాఫ్ స్టాక్ అయింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్, 12:02 కల్లా అవుటాఫ్ స్టాక్ బోర్డును పెట్టేసింది. అంటే ఆ మేర డిమాండ్‌తో నోకియా 6.1 ప్లస్‌ను వినియోగదారులు సొంత చేసుకున్నారు. అయితే ఈ సేల్‌లో ఎన్ని యూనిట్లను విక్రయానికి ఉంచారో తెలియదు. నోకియా 6.1 ప్లస్‌కు ఇది మూడో సేల్. తొలి సేల్ ఆగస్టు 30న నిర్వహించారు. అప్పుడే వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు మాంచి డిమాండ్ వచ్చింది. తొలి సేల్కు వచ్చిన మూడు వారాల్లోనే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు వస్తున్న రేటింగ్స్, రివ్యూలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే 10,680 రేటింగ్స్, 2,329 రివ్యూలు ఫ్లిప్‌కార్ట్‌లో రికార్డయ్యాయి. తర్వాత సేల్ సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు... 5.8 అంగుళాల నాచ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ గ్లాస్ శాండ్విచ్ డిజైన్ విత్ 2.5డీ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ డ్యూయల్ సిమ్(నానో) వెనుక వైపు రెండు కెమెరాలు(ఒకటి 16 మెగాపిక్సెల్, రెండోది 5 మెగాపిక్సెల్ సెన్సార్) ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 400 జీబీ వరకు విస్తరణ మెమరీకి అవకాశం ముందు 93 శాతం గ్లాస్ సర్ఫేస్తో అల్యూమినియం బాడీ 3060 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ.15,999 -
నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ లాంచ్
నోకియా బ్రాండ్‌కున్న క్రేజే వేరు. స్మార్ట్ఫోన్ల ఆగమనంతో నోకియా బ్రాండ్ మధ్యలో కొన్నేళ్లు తన వైభవం కోల్పోయినప్పటికీ.. తాను కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టి, కస్టమర్లను మళ్లీ తన సొంతం చేసుకుంది. నోకియా అంటేనే ప్రజల బ్రాండ్‌గా ముద్ర వేసుకుంది. మంగళవారం నోకియా రెండు తన గేమ్ చేంజర్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అవి ఒకటి నోకియా 6.1 ప్లస్, మరొకటి నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్లు. ఈ రెండు స్మార్ట్ఫోన్లను నేడు భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. టాప్-నాచ్ డిస్ప్లే, ఐఫోన్ ఎక్స్ స్ఫూర్తితో వెనుకవైపు మొత్తం గ్లాస్, 5.8 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీప్లస్, 2.5డీ గొర్రిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. నాచ్ డిస్ప్లేతో వచ్చిన తొలి నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6.1 ప్లసే. నోకియా 5.1 ప్లస్, నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ఫోన్లు రెండూ డ్యూయల్ కెమెరాలతో వచ్చాయి. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్లు రెండూ నోకియా ఎక్స్6, నోకియా ఎక్స్5 స్మార్ట్ఫోన్లకు రీబ్రాండెడ్ వెర్షన్లు. నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ 16 ఎంపీ, 5 ఎంపీ లతో వెనుకవైపు రెండు కెమెరాలు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ధర : 15,999 రూపాయలు నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బాడీ, డ్యూయల్ లెన్స్ కెమెరా నాచ్ డిస్ప్లే 5.9 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మీడియాటెక్ పీ60 చిప్సెట్ 3జీబీ లేదా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 3060 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 13 ఎంపీ, 5 ఎంపీ లెన్స్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా నోకియా 5.1 ప్లస్ ధర : సెప్టెంబర్‌లో రివీల్ చేయనున్నారు.