ఇండియాలో చాలా ఫాస్ట్గా అమ్ముడుపోతున్న ఫోన్ ఇదే!
ఇండియాలో చాలా ఫాస్ట్గా అమ్ముడుపోతున్న ఫోన్ ఇదే!
Published Wed, Mar 15 2017 9:23 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదుచేస్తున్న రెడ్ మి నోట్4 సరికొత్త ఘనతను సాధించింది. భారత్ లో చాలా త్వరగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ గా రెడ్మి నోట్ 4 నిలుస్తుందని షియోమి వెల్లడించింది. 2016లో 1 బిలియన్ రెవెన్యూలను తాకిన షియోమి, ఈ సందర్భంగా రెడ్మి నోట్4 సంచలన విక్రయాలను సృష్టిస్తుందని పేర్కొంది. విక్రయానికి వచ్చిన తొలి 45 రోజుల్లోనే 1 మిలియన్ యూనిట్ల రెడ్మి నోట్4 ఫోన్లు అమ్ముడుపోయినట్టు మంగళవారం వెల్లడించింది. జనవరి 23న ఈ ఫోన్ తొలి విక్రయానికి వచ్చింది. ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఫోన్ అమ్ముడుపోతుందని, తొలిరోజు సేల్ లో పది నిమిషాల్లోనే 2,50,000 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారని కంపెనీ రివీల్ చేసింది. ఎలాంటి ప్రి-రిజిస్ట్రేషన్లు లేకుండా ఫ్లిప్ కార్ట్, మి.కామ్ ద్వారా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తోంది. ఎంపికచేసిన రోజుల్లో మాత్రమే ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది.
విక్రయానికి వచ్చిన కొద్ది సేపట్లోనే వినియోగదారులు భారీ ఎత్తున దీన్ని కొనుగోలు చేస్తున్నారు. నేడు(బుధవారం) మళ్లీ ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజు షియోమికి ప్రత్యర్థిగా ఉన్న లెనోవో మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. మూడు మెమరీ యూనిట్లలో రెడ్మి నోట్4ను షియోమి లాంచ్ చేసింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
Advertisement