దుమ్మురేపుతున్న షావోమి ఫోన్లు | Xiaomi Sold More Than 1 Million Smartphones in 2 Days During Flipkart, Amazon Sales  | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న షావోమి స్మార్ట్‌ఫోన్లు

Published Sat, Sep 23 2017 11:04 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

 Xiaomi Sold More Than 1 Million Smartphones in 2 Days During Flipkart, Amazon Sales  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈ పండుగ సీజన్‌ను చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి భారీగా అందిపుచ్చుకుంటోంది. ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియాలు నిర్వహిస్తున్న మెగా సేల్‌ ఈవెంట్స్‌లో షావోమి స్మార్ట్‌ఫోన్లు దుమ్మురేపుతున్నాయి. రెండు రోజుల్లో 10 లక్షల షావోమి స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయాయి. భారీ డిస్కౌంట్‌ ఆఫర్లతో ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఈ సేల్‌ ఈవెంట్లను నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల గణాంకాల ప్రకారం, సగటున ప్రతి నిమిషానికి 300కు పైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడపోయినట్టు షావోమి తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్‌లో విక్రయాలు భారీ ఎత్తున్న పెరిగినట్టు కంపెనీ చెప్పింది. షావోమి ఇండియాకు ఇది కీలక మైలురాయిగా కంపెనీ అభివర్ణించింది. 

రెడ్‌మి నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నట్టు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మి నోట్‌4 పేరులోకి వచ్చిన కంపెనీ చెప్పింది. అమెజాన్‌ ఇండియాలో కూడా అమ్ముడుపోతున్న తొమ్మిది స్మార్ట్‌ఫోన్లలో ఎనిమిది షావోమికి చెందినవే ఉన్నాయని తెలిసింది. మొబైల్‌ కేటగిరీలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లలో షావోమి నెంబర్‌ వన్‌ బ్రాండుగా నిలుస్తోంది. ఇంత అద్భుతమైన మద్దతు అందిస్తున్నందుకు ఎంఐ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు షావోమి ఇండియా ఆన్‌లైన్‌ సేల్స్‌ హెడ్‌ రఘు రెడ్డి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement