Nokia 5.4 Sale In India: నోకియా 5.4 సేల్‌ షురూ : బంపర్‌ ఆఫర్లు | Nokia 5.4 Features Price In India - Sakshi
Sakshi News home page

నోకియా 5.4 సేల్‌ షురూ : బంపర్‌ ఆఫర్లు

Published Wed, Feb 17 2021 11:59 AM | Last Updated on Wed, Feb 17 2021 2:28 PM

Nokia 5.4 goes on first sale today on Flipkart, check offers - Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ  మొబైల్‌ తయారీదారు నోకియాకు చెందిన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ తొలి సేల్‌ బుధవారం  షురూ కానుంది.  హెచ్‌ఎండి గ్లోబల్ కొత్త బడ్జెట్ ఆఫర్‌గా ఇటీవల ఆవిష్కరించిన నోకియా 5.4 తొలి సేల్  ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం  ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో‌ మొదలు కానుంది. నోకియా 5.4 బేస్ వేరియంట్‌కు రూ .13,999 గా ఉంటుంది.  భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ,  క్వాడ్‌ కెమెరాతోపాటు ముఖ్యంగా క్లీన్ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ వన్  ఆధారితంగా దీన్ని తీసుకొచ్చింది. 

నోకియా 5.4 ధర, ఆఫర్లు

  • నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లలో వస్తుంది. పోలార్ నైట్, డస్క్ కలర్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ ,  నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ద్వారా  చేసిన కొనుగోళ్లపై  5 శాతం తగ్గింపు లభ్యం.
  • జియో కస్టమర్లకు  ఏకంగా రూ .4,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి.  రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జిపై రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్, ఇతర భాగస్వాముల నుండి రూ .2,000 విలువైన వోచర్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్ కొత్త, పాత జియో చందాదారులకు కూడా వర్తిస్తుంది.

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌  ధర రూ .13,999
6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ .15,499

నోకియా 5.4 ఫీచర్లు
6.39 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
48 + 2+ 5 + 2 ఎంపీ రియర్‌ కెమెరా
4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్‌
4000 ఎంఏహెచ్ బ్యాటరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement