first sale
-
ఐఫోన్14 మోడల్స్: గుడ్‌న్యూస్, భారీ ఆఫర్ ఎక్కడంటే?
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బీ న్యూ మొబైల్స్ కస్టమర్ల కోసం ఐఫోన్ 14 సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఎండీ వై బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, యాపిల్ సంస్థ ప్రతినిధులు మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఇది చదవండి: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కొనుగోలుపై 25శాతం కచ్చితమైన బైబ్యాక్ ఆఫర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా కొనుగోలుపై రూ.5 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు.‘‘తెలుగు రాష్ట్రాల్లోని 150 అవుట్లెట్లలో ఈ మోడళ్లు లభ్యమవుతాయి. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని సంస్థ సీఎండీ వై.బాలాజీ తెలిపారు. (Instagram: కొత్త టూల్ వచ్చేసింది..చూశారా మీరు?) -
నోకియా 5.4 సేల్ షురూ : బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియాకు చెందిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ బుధవారం షురూ కానుంది. హెచ్ఎండి గ్లోబల్ కొత్త బడ్జెట్ ఆఫర్‌గా ఇటీవల ఆవిష్కరించిన నోకియా 5.4 తొలి సేల్ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మొదలు కానుంది. నోకియా 5.4 బేస్ వేరియంట్‌కు రూ .13,999 గా ఉంటుంది. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీ, క్వాడ్ కెమెరాతోపాటు ముఖ్యంగా క్లీన్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ వన్ ఆధారితంగా దీన్ని తీసుకొచ్చింది. నోకియా 5.4 ధర, ఆఫర్లు నోకియా 5.4 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. పోలార్ నైట్, డస్క్ కలర్స్‌లో లభ్యం. ఫ్లిప్‌కార్ట్ , నోకియా ఆన్లైన్ స్టోర్‌లో ప్రారంభమవుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ద్వారా చేసిన కొనుగోళ్లపై 5 శాతం తగ్గింపు లభ్యం. జియో కస్టమర్లకు ఏకంగా రూ .4,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జిపై రూ .2,000 తక్షణ క్యాష్‌బ్యాక్, ఇతర భాగస్వాముల నుండి రూ .2,000 విలువైన వోచర్లు ఉన్నాయి. ఈ ఆఫర్ కొత్త, పాత జియో చందాదారులకు కూడా వర్తిస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ .13,999 6 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ .15,499 నోకియా 5.4 ఫీచర్లు 6.39 అంగుళాల డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 48 + 2+ 5 + 2 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రియల్ మి 6 ఫస్ట్ సేల్
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల విడుదల చేసిన రియల్‌మి6 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను రేపటి(మార్చి11, బుధవారం)నుంచి ప్రారంభించనుంది. రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో తొలి సేల్కు అందుబాటులో వుంచినట్టు సంస్థ ప్రకటించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్.కామ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ .750 తగ్గింపు పొందవచ్చని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు: 4జీబీ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ .12,999, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999 8 జీబీ+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ .15,999 రియల్ మి 6 ఫీచర్లు 6.5-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ హెలియో జీ 90 టీ సాక్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 64 +8+2+ ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4300 ఎంఏహెచ్ బ్యాటరీ 30వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ Time for a Pro worthy upgrade with #realme6! Get the 64MP #ProCameraProDisplay smartphone in the first sale starting tomorrow at 12 PM on @Flipkart & https://t.co/HrgDJTZcxv. Get flat INR 750 off on ICICI Credit Cards & Credit EMI Transactions on Flipkart.https://t.co/ePGTGUwKKu pic.twitter.com/iw0lNUVb7h — realme (@realmemobiles) March 10, 2020 -
నేటి నుంచే వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ సేల్
వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ నేటి నుంచి తొలిసారి విక్రయానికి వచ్చింది ఈ నెల ప్రారంభంలోనే ఈ కొత్త వేరియంట్ రూ.39,999కు లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్‌తో కలిపి, మొత్తం నాలుగు వేరియంట్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌తో పాటు కంపెనీ అవెంజర్స్ స్పెషల్ ఎడిషన్ వన్‌ప్లస్ 6ను లాంచ్ చేసింది. ఆ స్పెషల్ ఎడిషన్ కొన్ని విక్రయాల అనంతరం నిలిపివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయానికి వచ్చింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ స్టోర్‌లో ఇది రూ.34,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ 6 రెడ్ విక్రయంతో పాటు అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 2.8 గిగాహెడ్జ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీనోస్ఓఎస్ 5.1 6.28 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆల్-గ్లాస్ డిజైన్, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ 7.7 ఎంఎం పలుచనైది, 177 గ్రాముల బరువుంది 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఆప్టికల్ కోటింగ్, ఆరు గ్లాస్ ప్యానల్స్‌తో ఇది రూపొందింది. టాప్ గ్లాస్ ప్యానల్‌కు యాంటీ-రిఫ్లిక్టివ్ లేయర్ ఉంది. రెడ్‌తో మెటాలిక్ రెడ్ షిమ్మర్‌ను ఇది కలిగి ఉంది మిర్రర్ మాదిరి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిల్వర్ కెమెరా లెన్స్ వన్‌ప్లస్ కంపెనీ చరిత్రలోనే అత్యధిక వేగంగా అమ్ముడుపోతున్న డివైజ్‌గా వన్‌ప్లస్ 6 పేరొందింది. ఈ డివైజ్ లాంచ్ అయిన 22 రోజుల్లోనే 10 లక్షల అమ్మకాలను నమోదు చేసింది. -
హిస్టరీ రిపీట్: 2.5 లక్షలకుపైగా ఫోన్లు అమ్మకం
షియోమి ఫోన్ల విషయంలో మరోసారి హిస్టరీ రిపీట్ అయింది. ఇటీవల లాంచ్ అయిన రెడ్ మి 4 స్మార్ట్ ఫోన్ తొలి ఫ్లాష్ సేల్ కు భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే ఈ స్మార్ట్ ఫోన్ హాట్ కేకులా అమ్ముడుపోయింది. ఎనిమిది నిమిషాల్లో రెండున్నర లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడుపోయినట్టు షియోమి ప్రకటించింది. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్ లలో విక్రయానికి వచ్చింది. యూజర్ల నుంచి రెడ్ మి 4 కోసం 2.3 మిలియన్లకు పైగా 'నోటిఫై మి' అనే అలర్ట్ లు వచ్చినట్టు అమెజాన్ ఇండియా కూడా వెల్లడించింది. నిమిషానికి 10 మిలియన్లకు పైగా హిట్స్ కూడా వచ్చినట్టు అమెజాన్ తెలిపింది. కస్టమర్ల ఈ అనూహ్య స్పందనకు తాము ఆశ్చర్యానికి గురయ్యామని పేర్కొంది. అమెజాన్.ఇన్ లో టాప్ సెల్లింగ్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్లు ఉంటాయని, నేటి సేల్ తో కస్టమర్లకు మరిన్ని బెస్ట్ ప్రొడక్ట్ లు అందించడానికి, ఎంపికచేసుకోవడానికి తమ ఫోకస్ ను మరింత విస్తరించాలని తెలిసిందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ కేటగిరీ మేనేజ్ మెంట్ నూర్ పటేల్ తెలిపారు. అయితే నేడు వచ్చిన ఈ అనూహ్య స్పందనతో అమెజాన్ ఇండియా వెబ్ సైట్ కొద్దిసేపటి వరకు క్రాష్ కూడా అయింది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ గతవారం లాంచైంది. ప్రస్తుతం 2జీబీ/16జీబీ స్టోరేజ్, 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియంట్లు అమ్మకానికి వచ్చాయి. ఈ ఫోన్ ప్రారంభ ధర 6999 రూపాయలు. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రీమియం ఎక్స్ పీరియన్స్ అందించే లక్ష్యంతో రెడ్ మి 4ను తీసుకొచ్చామని, తమ ఎంఐ ఫ్యాన్స్ నుంచి వచ్చిన ప్రేమ చాలా అద్భుతంగా ఉందని షియోమి ఇండియా ఆన్ లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి తెలిపారు. మూడు స్టోరేజ్ వేరియంట్లతో పాటు 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు. Howzat!! It's a hat-trick! Redmi Note 4 followed by Redmi 4A and now Redmi 4. Can't thank all you #MiFans enough for so much love! <3 pic.twitter.com/b8N3iFT4zy — Redmi India (@RedmiIndia) May 23, 2017 -
ఇండియాలో చాలా ఫాస్ట్‌గా అమ్ముడుపోతున్న ఫోన్ ఇదే!
రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదుచేస్తున్న రెడ్ మి నోట్4 సరికొత్త ఘనతను సాధించింది. భారత్ లో చాలా త్వరగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ గా రెడ్మి నోట్ 4 నిలుస్తుందని షియోమి వెల్లడించింది. 2016లో 1 బిలియన్ రెవెన్యూలను తాకిన షియోమి, ఈ సందర్భంగా రెడ్మి నోట్4 సంచలన విక్రయాలను సృష్టిస్తుందని పేర్కొంది. విక్రయానికి వచ్చిన తొలి 45 రోజుల్లోనే 1 మిలియన్ యూనిట్ల రెడ్మి నోట్4 ఫోన్లు అమ్ముడుపోయినట్టు మంగళవారం వెల్లడించింది. జనవరి 23న ఈ ఫోన్ తొలి విక్రయానికి వచ్చింది. ప్రతి నాలుగు సెకన్లకు ఒక ఫోన్ అమ్ముడుపోతుందని, తొలిరోజు సేల్ లో పది నిమిషాల్లోనే 2,50,000 యూనిట్లను వినియోగదారులు కొనుగోలు చేశారని కంపెనీ రివీల్ చేసింది. ఎలాంటి ప్రి-రిజిస్ట్రేషన్లు లేకుండా ఫ్లిప్ కార్ట్, మి.కామ్ ద్వారా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను విక్రయిస్తోంది. ఎంపికచేసిన రోజుల్లో మాత్రమే ఈ ఫోన్ విక్రయానికి వస్తోంది. విక్రయానికి వచ్చిన కొద్ది సేపట్లోనే వినియోగదారులు భారీ ఎత్తున దీన్ని కొనుగోలు చేస్తున్నారు. నేడు(బుధవారం) మళ్లీ ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో విక్రయానికి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజు షియోమికి ప్రత్యర్థిగా ఉన్న లెనోవో మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. మూడు మెమరీ యూనిట్లలో రెడ్మి నోట్4ను షియోమి లాంచ్ చేసింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.