
ఆదిలాబాద్ / ఖానాపూర్: మండల కేంద్రంలోని శివాజినగర్‌లో సోమవారం సెల్‌ఫోన్ పేలిన ఘటనలో ప్రమాదం తప్పింది. కాలనీకి చెందిన మణి తన రెడ్ మీ నోట్ ఫోర్ ఫోన్ జేబులో వేడి అవుతోందని పక్కన పెడుతుండగా ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యువకుడు దూరంగా వెళ్లిపోగానే ఫోన్ పేలిపోయింది.
రూ.10 వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్ పేలడంతో బాధితుడు కంపెనీ యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో పలుచోట్ల ఫోన్‌లు పేలాయనే విషయాన్ని వాట్సప్‌లో, పత్రికల్లో చూసిన వినియోగదారులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.