రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్ | Xiaomi Redmi 4, Mi Note 2 Leaked in Images Ahead of Launch | Sakshi
Sakshi News home page

రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్

Published Wed, Aug 17 2016 1:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్

రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్

ఇంకా ఒక నెలలోనే కస్టమర్ల ముందుకు గ్రాండ్ ఈవెంట్గా రావాలనుకున్న షియోమి రెడ్మి 4, మి నోట్ 2లు లీక్ల బారినపడ్డాయి. రెండు స్మార్ట్ఫోన్ ఇమేజ్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ఫోటోల్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు మెటల్ యూనిబాడీస్, ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇతర కీలక స్పెషిఫికేషన్లు హల్చల్ చేస్తున్నాయి.

రెడ్మి 4 లీకేజీ వివరాలు..

రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని రెడ్మి 4 కలిగి ఉందని..పైనా, కింద యాంటీనా బ్యాండ్స్ ఉన్నట్టు లీకేజీ ఇమేజ్లు చూపిస్తున్నాయి.  వెనుకవైపు కెమెరా టాప్ సెంటర్లో ఉండి, దానిపక్కనే కుడివైపున ఫ్లాష్ ఉంది. కెమెరా లెన్స్ కింద ఫింగర్ప్రింట్ సెన్సార్ను కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కెపాసిటివ్ నావిగేషన్ బటన్స్ ఫ్రంట్న కింద వైపు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎమ్ఐయూఐ 8,  ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్తో రెడ్మి 4 ఫోన్ వినియోగదారుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ముందస్తు లీక్లు మాత్రం ఈ వేరియంట్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ అని వెల్లడించాయి. 4100 బ్యాటరీ సామర్థ్యంతో 7వేల రూపాయలకు ఇది లాంచ్ కాబోతుందని అంచనా. ఆగస్టు 25న చైనాలో మెగా ఈవెంట్గా ఈ ఫోన్ను లాంచ్ చేయాలని షియోమి భావిస్తోంది.

మి నోట్ 2 స్మార్ట్ఫోన్ లీకేజ్లు....

రెడ్మి 4  స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించిన రెండో వారంలోనే అంటే సెప్టెంబర్ 2న మి నోట్ 2ను షియోమి ఆవిష్కరించనున్నట్టు వెల్లడవుతోంది. మి నోట్ 2కు సంబంధించి కొన్ని లీక్లు మాత్రమే ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. వెనుకాల డ్యుయల్ కెమెరా, గెలాక్సీ నోట్ 7 మాదిరిగా కర్వ్డ్ డిస్ప్లే, ముందు బాగాన ఫింగర్ప్రింట్ స్కానర్,  రెండు స్పీకర్ గ్రిల్స్ ఉన్నట్టు లీక్లో తెలుస్తోంది. ముందస్తు లీకేజీల బట్టి ఈ ఫోన్ రెండు మెమెరీ వేరియంట్లు 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ అలరించనుందట. దీని ధర కూడా రూ.25 వేలు, రూ.28 వేలుగా ఉంటుందని అంచనా. మెటల్ బాడీ, ఫింగర్ప్రింట్ స్కానర్, అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 821 ఎస్ఓసీ, 3600ఎంఏహెచ్ బ్యాటరీ లీకేజీలోని మి నోట్ 2 ప్రత్యేకతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement