భారత్‌లో షియోమి అనూహ్య నిర్ణయం!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ షియోమి బుధవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. తన టాప్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లయిన ఎంఐ నోట్-2, ప్యూచరిస్టిక్ ఎం మాక్స్ ఫోన్లను భారత్‌లో విడుదల చేయబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా నెలకిందట విడుదలైన ఎంఐ 5ఎస్‌ను కూడా భారత్‌లో అమ్మబోమని స్పష్టం చేసింది.
హైఎండ్ టెక్నాలజీ, టాప్ ఫీచర్లతో కూడిన ఎంఐ నోట్-2ను, ప్యూచరిస్టిక్ ఎంఐ మాక్స్ మోడళ్లను షియోమి బుధవారం చైనాలో విడుదల చేసింది. అయితే, ఎక్కువమొత్తంలో ధర ఉండే తన ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు భారత్‌లో మార్కెట్ చాలా స్పల్పంగా ఉంది. దీనికితోడు భారత్‌లో ఏడాదికి ఒకటే హైఎండ్ ఫోన్‌ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కొత్త మోడళ్లను ఇక్కడ అమ్మడం లేదని కంపెనీ తాజాగా స్పష్టత ఇచ్చింది. షియోమి తాజా నిర్ణయం ఆ కంపెనీ ఫోన్లు ఇష్టపడే భారతీయులకు నిరాశ కలిగించేదే. అయితే, హైఎండ్ టెక్నాలజీతో వచ్చిన ఎంఐ-5 ఫోన్‌కు భారత్‌లో పెద్దగా ఆదరణ లభించలేదు. అంతేకాకుండా షియోమి భారత్ కన్నా తన ప్రధాన మార్కెట్ అయిన చైనాపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది.
ఇతర విదేశీ మార్కెట్ల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. రెండేళ్లుగా భారత్ మార్కెట్‌లో ఉన్నా ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు తమకు పెద్దగా మార్కెట్ లేదని, అంతేకాకుండా ఏడాదికి ఒక హైఎండ్ ఫోన్‌ను మాత్రమే విడుదల చేయాలన్న నిర్ణయం కారణంగా తమ కొత్త ఫోన్లను భారత్‌కు పంపడం లేదని షియోమి చైనా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా వెల్లడించారు. 5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే.. 23 ఎంపీ బ్యాక్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఎంఐ నోట్-2 ధర చైనా మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 27,700 నుంచి రూ. 29,700 మధ్య ఉండే అవకాశముంది.