ఎంఐ నోట్ 2 ఫీచర్లు అదుర్స్! | Xiaomi Mi Note 2 with dual-curved display to launch on October 25 | Sakshi
Sakshi News home page

ఎంఐ నోట్ 2 ఫీచర్లు అదుర్స్!

Published Mon, Oct 24 2016 10:44 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

ఎంఐ నోట్ 2 ఫీచర్లు అదుర్స్!

ఎంఐ నోట్ 2 ఫీచర్లు అదుర్స్!

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఎంఐ నోట్ 2 పేరుతో సరికొత్త ఫోన్ ను షియోమీ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ ను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రెండు వంపుల(డ్యూయల్ కర్వడ్) ప్రత్యేకత కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 25న మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు షియోమీ వెల్లడించింది. అయితే ఈఫోన్ కు సంబంధించిన ఫీచర్లు అధికారికంగా వెల్లడికానప్పటికీ కొన్ని వివరాలు బయటకు లీకయ్యాయి. అనధికారికంగా వెల్లడైన ఫీచర్లు ఫోన్ ప్రియులను ఆటక్టునేలా ఉన్నాయి. అల్ట్రా థిన్ డిప్లేతో కూడిన ఎంఐ నోట్ 2 ఫోన్ ను 4 జీబీ, 6 జీబీ వేరియంట్ విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఎంఐ నోట్ 2 ఫోన్ ఫీచర్లు
5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే
23 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 318 కెమెరా
12 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
4 జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
6 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
ఆండ్రాయిడ్ 6 మార్ష్ మాలో ఓఎస్
స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్
డ్యుయల్ సిమ్ సపోర్ట్
4 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 27,700
6 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 29,700

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement