షావోమి రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్ తేదీ వివరాలు అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 7న ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకురాబోతున్నట్టు తెలిపింది. 18:9 యాస్పెప్ట్ రేషియో డిస్‌ప్లేలతో ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మి 5కి చైనీస్ టెలికమ్యూనికేషన్స్ సర్టిఫికేషన్ అథారిటీ టీనా నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. దీనికి సంబంధించి కొన్ని స్పెషిఫికేషన్లను కూడా బహిర్గతం చేసింది.
రెడ్‌మి 5కు 5.7 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే, యాస్పెక్ట్ రేషియో 18:9, స్మార్ట్‌ఫోన్‌కు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, వెనుకవైపు కెమెరా 12ఎంపీ సెన్సార్, ముందు వైపు 5 ఎంపీ కెమెరా, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0 ఫీచర్లుంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ అంచనా ధర రూ.13,700గా వెల్లడవుతోంది. రెడ్‌మి నోట్ 4 కంటే కాస్త ఎక్కువనే.
అదేవిధంగా కాస్త పెద్దదిగా రెడ్‌మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్, రెడ్‌మి 5 కంటే పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. రెడ్‌మి 5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే, ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, వెనుకవైపు రెండు కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయని రిపోర్టులు చెబుతున్నాయి. కాగ, షావోమి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశ్ కా స్మార్ట్‌ఫోన్ నేడు విడుదల కాబోతుంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి ఇది అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయమని షావోమి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment