షియామి ఫ్యాన్స్‌కు శుభవార్త: నో మోర్‌ వెయిటింగ్‌ | Xiaomi Redmi 4, Redmi 4A, Redmi Note 4, up for pre-order; now no more waiting for flash sales | Sakshi
Sakshi News home page

షియామి ఫ్యాన్స్‌కు శుభవార్త: నో మోర్‌ వెయిటింగ్‌

Published Fri, Jun 9 2017 7:27 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

షియామి ఫ్యాన్స్‌కు శుభవార్త: నో మోర్‌ వెయిటింగ్‌

షియామి ఫ్యాన్స్‌కు శుభవార్త: నో మోర్‌ వెయిటింగ్‌

న్యూఢిల్లీ: చైనా మొబైల్‌ మేకర్‌ షియామి  తన స్మార్ట్‌ఫోన్‌ లవర్స్‌కు శుభవార్త అందించింది.  ఫ్లాష్‌ సేల్‌లో తప్ప మిగతా సమయాల్లో  లభించని  స్మార్ట్‌ఫోన్లను  ఇకపై ప్రి బుకింగ్‌కు అందుబాటులో ఉంచింది.  శుక్రవారం మధ్నాహ్నం 12 గంటల నుంచి వీటి ప్రీ ఆర్డర్‌ చేసుకునే  అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా రెడ్‌ మి నోట్‌ 4,  రెడ్‌ మి 4, రెడ్‌ మి 4 ఏ  స్మార్ట్‌ఫోన్లు ప్రీ ఆర్డర్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

నిమిషాల వ్యవధిలోనే రికార్డ్‌ అమ్మకాలను నమోదు  చేస్తూ.. అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ గా ని లుస్తున్న షియామి తాజా డివైస్‌లను అధికారిక వెబ్‌సైట్లో కొనుగోలుకు అనుమతిస్తుంది. అయితే క్యాష్‌ అన్‌ డెలివరీ సదుపాయం మాత్రం అందుబాటులో లేదని కంపెనీ ప్రకటించింది.  క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్‌ వాలెట్స్‌ ద్వారా  కొనుగోలు చేయవచ్చు. ఒకసారి రెండు ఉత్పత్తులను కొనుగోలుకు మాత్రం అవకాశం. అయితే   ప్రొడక్ట్స్‌ బట్టి ప్రీ-ఆర్డర్ చేసే యూనిట్ల సంఖ్య మారుతుందని షియామి తెలిపింది. అలాగే ప్రతి ఫోన్‌లో ఐఆర్‌సెన్సర్‌, ఎంఐ రిమోట్‌ ఆప్‌  లభిస్తుందని చెప్పింది.
 

ఇండియాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి. 
రెడ్‌ మి నోట్‌ 4 ధర  రూ.  9,999
రెడ్‌ మి 4 ధర రూ. 6,999
రెడ్‌ మి 4 ఏ రూ. 5,999

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement