pre-order
-
షియామి ఫ్యాన్స్‌కు శుభవార్త: నో మోర్ వెయిటింగ్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియామి తన స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు శుభవార్త అందించింది. ఫ్లాష్ సేల్‌లో తప్ప మిగతా సమయాల్లో లభించని స్మార్ట్ఫోన్లను ఇకపై ప్రి బుకింగ్‌కు అందుబాటులో ఉంచింది. శుక్రవారం మధ్నాహ్నం 12 గంటల నుంచి వీటి ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4, రెడ్ మి 4 ఏ స్మార్ట్ఫోన్లు ప్రీ ఆర్డర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే రికార్డ్ అమ్మకాలను నమోదు చేస్తూ.. అవుట్ ఆఫ్ స్టాక్ గా ని లుస్తున్న షియామి తాజా డివైస్‌లను అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు అనుమతిస్తుంది. అయితే క్యాష్ అన్ డెలివరీ సదుపాయం మాత్రం అందుబాటులో లేదని కంపెనీ ప్రకటించింది. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ వాలెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఒకసారి రెండు ఉత్పత్తులను కొనుగోలుకు మాత్రం అవకాశం. అయితే ప్రొడక్ట్స్ బట్టి ప్రీ-ఆర్డర్ చేసే యూనిట్ల సంఖ్య మారుతుందని షియామి తెలిపింది. అలాగే ప్రతి ఫోన్లో ఐఆర్‌సెన్సర్, ఎంఐ రిమోట్ ఆప్ లభిస్తుందని చెప్పింది. ఇండియాలో వీటి ధరలు ఇలా ఉన్నాయి. రెడ్ మి నోట్ 4 ధర రూ. 9,999 రెడ్ మి 4 ధర రూ. 6,999 రెడ్ మి 4 ఏ రూ. 5,999 -
కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే..
ఐప్యాడ్ ఏయిర్ 2ను రిప్లేస్ చేస్తూ ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐప్యాడ్ (2017) ఇప్పుడు భారత్ లోనూ దొరుకుతోంది. మార్చి చివర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మోడల్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ ఈ-కామర్స్ దిగ్గజ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా స్వీకరిస్తోంది. శుక్రవారం నుంచి ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. ఆపిల్ ముందస్తు నిర్ణయించిన ధర రూ.28,900కే ఈ 32జీబీ వై-ఫై మోడల్ ను ప్రీ-ఆర్డర్ల ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. 32జీబీ వై-ఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ను కంపెనీ ఇంకా లిస్టు చేయలేదు. వై-ఫై ప్లస్ మోడల్ ధర రూ.39,900గా ఉంది. 3.1 మిలియన్ కు పైగా పిక్సెల్స్ తో 9.7 అంగుళాల రెటీనా డిస్ప్లేను ఈ ఐప్యాడ్ కలిగి ఉంది. థిన్ అల్యూమినియం యూనిబాడీ, ఆపిల్ ఏ9 చిప్, వై-ఫైపై 10 గంటలు పాటు పనిచేయగల బ్యాటరీ సామర్థ్యం, 8ఎంపీ రియర్ కెమెరా, 1.2 ఎంపీ ఫ్రంట్ ఫేస్ టైమ్ కెమెరా దీని ప్రత్యేకతలు. దీనికోసం స్పెషల్ గా 1.3 మిలియన్ పైగా యాప్స్ ను కంపెనీ డిజైన్ చేసింది. ఈ ఐప్యాడ్ ప్రపంచంలో అత్యంత పాపులర్ టాబ్లెట్ అని, మూవీలు, టీవీ చూసుకునేందుకు వీలుగా పెద్ద స్క్రీన్ సైజుతో దీన్ని తీసుకొచ్చామని వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిలర్ చెప్పారు. -
ఆఫ్ లైన్లోనూ రెడ్మి నోట్4
విక్రయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి నోట్4 ఇక నుంచి ప్రీ ఆర్డర్ సర్వీసులతో ఆఫ్ లైన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఉత్తర ప్రాంతాల్లోనూ, దక్షిణాదిన లార్జ్ ఫార్మాట్ రిటైలర్స్(ఎల్ఈఆర్) వద్ద ఈ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. మార్చి 14 నుంచి మార్చి 17 మధ్యలో ఎల్ఈఆర్ల వద్ద రెడ్ మి నోట్4 స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్ లభ్యం కానున్నాయని, ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 16 నుంచి మార్చి 21 మధ్యలో ప్రీఆర్డర్ సర్వీసు అందుబాటులో ఉంచుతామని కంపెనీ పేర్కొంది. మార్చి 18న ఎల్ఈఆర్స్ లలో దీన్ని అమ్ముతామని తెలిపింది. ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ లలోని ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 21 నుంచి రెడ్ మి నోట్4 అమ్మకం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఆన్ లైన్ లో కూడా యూజర్లు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. రెడ్ మి నోట్ 4 విడుదలైన 45 రోజుల్లోనే 1మిలియన్ యూనిట్ల విక్రయాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కంపెనీ ఎంపికచేసిన రోజుల్లోనే ఆన్ లైన్ లో అమ్మకానికి వస్తోంది. ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ప్రీ-ఆర్డర్లను ఆఫ్ లైన్ ద్వారాను కంపెనీ తీసుకొస్తోంది.