ఆఫ్ లైన్లోనూ రెడ్మి నోట్4
ఆఫ్ లైన్లోనూ రెడ్మి నోట్4
Published Fri, Mar 17 2017 2:00 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
విక్రయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి నోట్4 ఇక నుంచి ప్రీ ఆర్డర్ సర్వీసులతో ఆఫ్ లైన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఉత్తర ప్రాంతాల్లోనూ, దక్షిణాదిన లార్జ్ ఫార్మాట్ రిటైలర్స్(ఎల్ఈఆర్) వద్ద ఈ స్మార్ట్ ఫోన్ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. మార్చి 14 నుంచి మార్చి 17 మధ్యలో ఎల్ఈఆర్ల వద్ద రెడ్ మి నోట్4 స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్ లభ్యం కానున్నాయని, ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 16 నుంచి మార్చి 21 మధ్యలో ప్రీఆర్డర్ సర్వీసు అందుబాటులో ఉంచుతామని కంపెనీ పేర్కొంది.
మార్చి 18న ఎల్ఈఆర్స్ లలో దీన్ని అమ్ముతామని తెలిపింది. ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ లలోని ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 21 నుంచి రెడ్ మి నోట్4 అమ్మకం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఆన్ లైన్ లో కూడా యూజర్లు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. రెడ్ మి నోట్ 4 విడుదలైన 45 రోజుల్లోనే 1మిలియన్ యూనిట్ల విక్రయాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కంపెనీ ఎంపికచేసిన రోజుల్లోనే ఆన్ లైన్ లో అమ్మకానికి వస్తోంది. ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ప్రీ-ఆర్డర్లను ఆఫ్ లైన్ ద్వారాను కంపెనీ తీసుకొస్తోంది.
Advertisement
Advertisement