Xiaomi Redmi Note 4
-
రెడ్మి నోట్ 4 ధర తగ్గింది..
షావోమికి చెందిన హాట్‌కేకులా అమ్ముడుపోతున్న రెడ్మి నోట్ 4 ధర శాశ్వతంగా తగ్గింది. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను వెయ్యి రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రెడ్ నోట్4 ధర భారత్‌లో రూ.9999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ విషయాన్ని షావోమి ఇండియా అదినేత మను కుమార్ జైన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. '' భారత్‌లో నెంబర్ 1 అమ్మకపు స్మార్ట్‌ఫోన్‌గా ఉన్న రెడ్మి నోట్ 4 ధరను శాశ్వతంగా తగ్గిస్తున్నట్టు మేము ప్రకటిస్తున్నాం'' అని జైన్ ట్వీట్ చేశారు. రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ధర తగ్గింపు అనంతరం 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలు కాగ, 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డు స్టోరేజ్ ధర 11,999 రూపాయలు. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లోనూ ఈ ధర తగ్గింపు ఉండనుంది. ఈ ధర తగ్గింపుతో మోటో జీ5, నోకియా 5, శాంసంగ్ గెలాక్సీ జే7 మోడల్స్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు.. ఈ ధర తగ్గింపుకు అదనంగా, పాత మోడల్స్‌ను ఎక్స్చేంజ్ చేసి దీన్ని కొనుగోలు చేస్తే రూ.11,000 తగ్గింపు లభించనుంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఇది అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్మి నోట్ 4 స్పెషిఫికేషన్లు.. 5.5 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే 2.5 కర్వ్డ్ గ్లాస్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, డార్క్ గ్రే, గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటు -
‘రెడ్ మి నోట్ 4’ కొత్త వేరియంట్
సాక్షి, న్యూడిల్లీ: షావోమి రెడ్మినోట్ 4 లోకొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. తన తాజా స్మార్ట్‌పోన్ నోట్ 4 బ్లూ వేరియంట్‌ను ఇండియన్ మార్కోట్లో ప్రారంభించింది. ఇది సోమవారం మధ్యాహ్నం 12నుంచి ఎం.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ హ్యాండ్ సెట్ 4జీబీ/ 64జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో మాత్రమే లభ్యం కానుంది. 'వేక్ లేక్' ప్రాజెక్టు భాగంగా ప్రారంభించినట్టు కంపెనీ ప్ర కటించింది దీని ధర రూ. 12,999లు. బెంగళూరులో తీవ్ర కాలుష్యానికి గురవుతున్నచెరువుల పునరుద్ధరణకు మద్దతుగా ఈ లేక్ బ్లూ వేరియంట్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ప్రకటించారు. గత దశాబ్దంలో బెంగళూరు ప్రజలు నీటి వనరుల కోసం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారనీ ఈ నేపథ్యంలో బెంగళూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని స్వచ్ భారత్ అభియాన్ ప్రాజెక్టుకు మద్దతుగా దీన్ని లాంచ్ చేసినట్టు చెప్పారు. రెడ్ మి నోట్ 4 లేక్ బ్లూ వేరియంట్ 5.5-అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపిఎస్ డిస్ప్లే 1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్ , 2.5 డి కర్వ్డ్ గాస్ల్ స్నాప్‌డ్రాగన్ 625 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మైక్రో ఎస్డీ కార్డ్ తో ఎక్స్‌పాండబుల్ మెమొరీ 13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4100ఎంఏహెచ్ బ్యాటరీ 'Lake blue' edition of India's #1 selling smartphone goes on sale at noon on https://t.co/cwYEXdVQIo, @Flipkart, Mi Home & offline partners! pic.twitter.com/s9OQ29W3DL — Redmi India (@RedmiIndia) September 4, 2017 -
మళ్లీ పేలిన రెడ్మీ నోట్ 4
అచ్యుతాపురం (యలమంచిలి) : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రెడ్మీ నోట్-4 కాలిన ఘటన మరవకముందే విశాఖ జిల్లాలోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చార్జింగ్ పెట్టిన రెడ్మి నోట్-4 మొబైల్ పేలిపోయింది. జిల్లాలోని రామన్నపాలెంలో నిన్న (గురువారం) ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన గంధం ధర్మిరెడ్డి సాయి తన రెడ్మి నోట్-4 సెల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టి, చార్జింగ్‌తో ఉన్న ఫోన్‌తో కాసేపు మాట్లాడి బయటకు వెళ్లాడు. అయిదు నిమిషాల తర్వాత పెద్ద శబ్దం రావడంతో వచ్చి చూడగా సెల్‌ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ధర్మిరెడ్డి సాయి ఈ ఫోన్‌ను రెండు నెలల క్రితమే కొనుగోలు చేశాడు. సంబంధిత వార్తలు : కాలిపోయిన 'నోట్-4'.. యువకుడికి గాయాలు! అందుకే ‘నోట్-4’ కాలింది: షావోమి -
రూ.999కే రెడ్మి నోట్ 4
షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా పేరొందిన రెడ్మి నోట్ 4 నేడు (బుధవారం) ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. ''బిగ్ రెడ్మి నోట్ 4 సేల్'' కింద ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధర 999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతోంది. ఈ సేల్, ఫ్లాష్ సేల్లకు భిన్నమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ డీల్స్, ఈఎంఐ సౌకర్యాలను, బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు షావోమి ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ 2పై 500 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ.కామ్‌లోనూ నేడు రెడ్మి నోట్4 అమ్మకానికి వస్తోంది. బిగ్ రెడ్మి నోట్ 4 సేల్‌లో భాగంగా అన్ని వేరియంట్లపైనా.. రూ.249 బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేసిన 6-8 నెలల్లో ఎక్స్చేంజ్ చేస్తే 40 శాతం వాల్యును తిరిగి వెనక్కి ఇచ్చేయనుంది. అంతేకాక పాత స్మార్ట్ఫోన్లతో ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొంటే అతి తక్కువ ధరకు రూ.999కే కస్టమర్లకు అందించనుంది. అంటే దాదాపు రూ.12వేల మేర ధర తగ్గుతోంది. ప్రతి రెడ్మి నోట్ 4 కొనుగోలుపై అదనంగా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2కు 500 రూపాయల డిస్కౌంట్‌ను లభించనుంది. కాగ, ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ తన సైటులో ఆండ్రాయిడ్ 7.0 నోగట్ అప్డేట్తో కూడిన రెడ్మి నోట్ 4ను లిస్టు చేసింది. ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు... 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్... ధర రూ.9999 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్..... ధర రూ.10,999 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్..... ధర రూ.12,999 డ్యూయల్ సిమ్(మైక్రో+నానో) 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 4జీబీ వాయిస్ఓవర్ ఎల్టీఈ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోట్7 మాదిరిగా.. రెడ్మి నోట్4 బ్లాస్ట్
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల పేలుడు ఘటనలు ఇంకా పూర్తిగా మరవనలేదు. తాజాగా మరో ఫేమస్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ కూడా పేలిపోయింది. బెంగళూరులోని ఓ షాపులో షావోమి రెడ్మి నోట్4కు పేలుడు ప్రమాదం సంభవించింది. కస్టమర్‌కు చెందిన రెడ్మి నోట్ 4 ఫోన్లో షాప్కీపర్ సిమ్‌ను ఇన్సర్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఒక్కసారిగా ఈ పేలుడు ప్రమాదం సంభవించడంతో ఫోనంతా కాలిపోయింది. అయితే రెడ్మి నోట్ 4 పేలిన సమయంలో ఆ ఫోన్ ఛార్జింగ్‌లో కానీ లేదా మరే ఇతర యాక్ససరీస్‌ను కానీ దానికి కనెక్ట్ చేయలేదు. రిటైలర్ దాన్ని హ్యాండిల్ చేస్తున్న క్రమంలోనే మంటల సంభవించాయి. చాలా కేసుల్లో హ్యాండ్‌సెట్‌కు ఛార్జింగ్ పెట్టి ఉన్న సమయంలో బ్యాటరీ ఓవర్‌హీట్ అయి, పేలుడు ఘటనలు జరిగేవి. కానీ ఇలా పేలుడు ఘటన జరగడం చాలా అరుదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన షావోమి కంపెనీ.. తమకు వినియోగదారుడి భద్రతే అత్యంత ముఖ్యమని, ఈ విషయంపై వినియోగదారుడిని సంప్రదించి విచారణ చేపడతామని చెప్పింది. ఆ ఫోన్‌కు బదులు మరో షావోమి రెడ్మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్‌కి అందించింది. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదని షావోమి తెలిపింది. ఒకవేళ ఫోన్‌ను మాట్లాడుతున్న క్రమంలో పేలుడు సంభవిస్తే, తీవ్రమైన గాయాలే అయ్యేవని, ఇది చాలా అదృష్టమని తెలిపింది. అంతకముందు గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలతో శాంసంగ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఫోన్ తరుచు పేలుడు ఘటనలకు ప్రభావితం కావడంతో, శాంసంగ్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఓ వైపు కంపెనీ రెవెన్యూలు, మరోవైపు కంపెనీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు ఘటనలు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగులుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో షావోమి ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. -
ఒక్క రూపాయికే రెడ్మి నోట్4... షియోమి ఆఫర్ అదుర్స్
రెడ్మి ఫోన్ల సంచలన విక్రయాలతో రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వినియోగదారులకు సర్ ప్రైజింగ్ ఆఫర్లను ప్రకటించింది. ఒక్క రూపాయికే రెడ్ మి నోట్ 4 కొనుగోలు చేసుకునేలా రూ.1 ఫ్లాష్ సేల్ ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 6న నిర్వహించబోతున్న 'ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్' లో భాగంగా తమ యాప్ ద్వారా కొనుగోలు చేసే ఉత్పత్తులను ఒక్క రూపాయికే అందించనున్నట్టు షియోమి ప్రకటించింది. యాప్ తో ముడిపడి ఉన్న ఈ ఫెస్టివల్ కు షియోమి ఉత్పత్తులపై ఆఫర్లు పొందాలంటే కచ్చితంగా తమ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని, రిజిస్ట్రర్ చేసుకోవాల్సిందేనని ప్రకటించింది. ఎంఐ.కామ్ సైట్పైనా ఈ ఫెస్టివల్ ను కంపెనీ నిర్వహిస్తోంది. అయితే యాప్ ద్వారా మాత్రమే ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ విక్రయం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, కేవలం 20 రెడ్మి నోట్4 స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఒక్క రూపాయికి ఎంఐ స్టోర్ యాప్ లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకూ ఒక్క రూపాయి ఫ్లాష్ సేల్ ను చేపడుతోంది. ఈ సేల్ లో మాత్రం ఎంఐ బ్యాండ్ 2 లు రూపాయికి అందుబాటులో ఉంటాయి. అవి కూడా 40 యూనిట్లేనని తెలిపింది. అదేసమయంలో 10000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంకులను 50 మేర విక్రయించనున్నట్టు ప్రకటించింది. వన్-డే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్మి 4ఏ, రెడ్మి నోట్ 4 ఫోన్లను విక్రయానికి అందుబాటులో ఉంచనుంది. ఇతర స్మార్ట్ ఫోన్లు రెడ్మి 3 ఎస్ ప్రైమ్, ఎంఐ 5, ఎంఐ మ్యాక్స్ ప్రైమ్ లపై కూడా ఆఫర్లు ప్రకటించింది. షియోమి ఇతర ఉత్పత్తులు ఎయిర్ ఫ్యూరిఫైయర్, ఇయర్ ఫోన్లు, ఎంఐ బ్యాండ్ వంటి అన్ని ఉత్పత్తులపైనా 500 రూపాయిల వరకు తగ్గింపును కంపెనీ ఇవ్వనుంది. గురువారం నిర్వహించబోయే ఈ సేల్ కు బుధవారం వరకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. 10 గంటల నుంచి సేల్ ప్రారంభించి, స్టాక్ అయిపోయే వరకు ఈ సేల్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. -
ఆఫ్ లైన్లోనూ రెడ్మి నోట్4
విక్రయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న షియోమి రెడ్ మి నోట్4 ఇక నుంచి ప్రీ ఆర్డర్ సర్వీసులతో ఆఫ్ లైన్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఉత్తర ప్రాంతాల్లోనూ, దక్షిణాదిన లార్జ్ ఫార్మాట్ రిటైలర్స్(ఎల్ఈఆర్) వద్ద ఈ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. మార్చి 14 నుంచి మార్చి 17 మధ్యలో ఎల్ఈఆర్ల వద్ద రెడ్ మి నోట్4 స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్ లభ్యం కానున్నాయని, ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 16 నుంచి మార్చి 21 మధ్యలో ప్రీఆర్డర్ సర్వీసు అందుబాటులో ఉంచుతామని కంపెనీ పేర్కొంది. మార్చి 18న ఎల్ఈఆర్స్ లలో దీన్ని అమ్ముతామని తెలిపింది. ఢిల్లీ, జైపూర్, చంఢీఘర్ లలోని ఆఫ్ లైన్ స్టోర్లలో మార్చి 21 నుంచి రెడ్ మి నోట్4 అమ్మకం ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఆన్ లైన్ లో కూడా యూజర్లు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. రెడ్ మి నోట్ 4 విడుదలైన 45 రోజుల్లోనే 1మిలియన్ యూనిట్ల విక్రయాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కంపెనీ ఎంపికచేసిన రోజుల్లోనే ఆన్ లైన్ లో అమ్మకానికి వస్తోంది. ఫ్లిప్ కార్ట్, మి.కామ్ లలో దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం దీని ప్రీ-ఆర్డర్లను ఆఫ్ లైన్ ద్వారాను కంపెనీ తీసుకొస్తోంది. -
రెడ్ మి నోట్ 4 హాట్ సేల్..!
న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియోమి మరోసారి రికార్డ్ అమ్మకాలను సాధించింది. ఎంఐ స్టోర్ తో పాటు ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో జనవరి 23, సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన రెడ్ మీనోట్ 4 హాట్ సేల్ ను క్రియేట్ చేసింది. అమ్మకాలు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే రెండున్నర లక్షల యూనిట్లను విక్రయించినట్టు షియామి ఒక ప్రత్యేక ప్రకటనలో మంగళవారం ప్రకటించింది. దాదాపు 10 నిమిషాల్లో 2.5 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్లను అమ్మినట్టు తెలిపింది. ఆన్ లైన్ విక్రయ చరిత్రలోనే భారీ అమ్మకాల కొత్త రికార్డు నెలకొల్పింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందంటూ రెడ్ మీ నోట్ 4 అమ్మకాలపై స్పందించిన ఫ్లిప్ కార్ట్ హెడ్ అజయ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఫేవరెట్ మొబైల్స్ కొనుగోలులో వినియోగదారుల నమ్మకాన్ని ఫ్లిప్ కార్ట్ మరోసారి నిరూపించుకుందని తెలిపారు. అటు ఎంఐ అభిమానులు, వినియోగదారుల ఆదరణ పట్ల షియోమి ఆన్ లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కాగా మోస్ట్ ఎవైటెడ్ స్మార్ట్ ఫోన్ ను షియోమి జనవరి 19 న మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే అమ్మకాలనుమాత్రం జనవరి 23 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఆ ఫోన్‌కు భలే గిరాకి
రెడ్ మి నోట్ 3తో మొబైల్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న షియోమి, కొత్త సంవత్సరంలో రెడ్ మి నోట్ 4తో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ను నేటి(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో, మి.కామ్‌లో షియోమి అందుబాటులో ఉంచింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ప్రవేశపెట్టిన ఒక్కటే ఒక్క నిమిషంలో ఈ ఫోన్‌కు భలే గిరాకి వచ్చిందట. ఒక్క నిమిషంలోనే నోట్ 4 స్టాక్ అంతా అయిపోయిందట. మూడు వేరియంట్లలో దీన్ని షియోమి ప్రవేశపెట్టింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నేటి నుంచి గోల్డ్, డార్క్ గ్రే రంగుల ఫోన్లే అందుబాటులో ఉండనున్నాయి. మేట్ బ్లాక్ కలర్ వేరియంట్ కొన్ని వారాల తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు.... 2.5డి కర్వ్డ్ గ్లాస్‌తో 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ కెమెరా 85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 128జీబీ వరకు విస్తరణ మెమరీ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్ఫ్రార్డ్ సెన్సార్ ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో, మిఐయూఐ 8.0 ఆండ్రాయిడ్ నోగట్ 7.0 టెస్టింగ్ 4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎస్ కింది వైపు డ్యూయల్ స్పీకర్స్ 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 175 గ్రాముల బరువు కాగా.. చైనాలో ఈ ఫోన్ ను గత ఆగస్టులోనే విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ గోల్డ్, బ్లాక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 20శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది. -
కొత్త ఫీచర్లతో షావొమీ 'రెడ్మి నోట్ 4'
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావొమీ మరో స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. 'రెడ్మి నోట్ 4' పేరుతో కొత్త ఫోన్ ను చైనా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు 2జీబీ, 3జీబీ ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తాయి. 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ మోడల్ ధర దాదాపు రూ.9 వేలు. 64 జీబీ మోడల్ ధర సుమారు. 12 వేలు. ఆగస్టు 26 నుంచి కంపెనీ ఆన్లైన్ స్టోర్లు, ఎంఐ డాట్ కామ్ లో వీటిని కొనుక్కోవచ్చు. ప్రస్తుతం ఇవి చైనాలో మాత్రమే లభ్యమవుతాయి. యూఎస్బీ టైప్ సీ-మోడల్ ను సపోర్ట్ చేయడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫీచర్ కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్ తమదేనని షావొమీ పేర్కొంది. రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని కలిగిన రెడ్మి నోట్ 4 హైబ్రీడ్ సిమ్ స్లాట్ ను సపోర్ట్ చేస్తుంది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్స్ లో లభిస్తుంది. ఫీచర్లు 2.1 జీహెచ్ జడ్ ప్రాసెసర్ 5.5 ఫుల్ హెచ్డీ స్క్రీన్ 2.5 కర్వర్డ్ గ్లాస్ డిస్ ప్లే 5 మెగా ఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫింగర్‌ప్రింట్ స్కానర్ 4100 ఏంఏహెచ్ బ్యాటరీ 4జీ వోల్టీ సపోర్ట్ ఫోన్ బరువు 175 గ్రాములు