ఫ్లిప్కార్ట్లో ఆ ఫోన్కు భలే గిరాకి
ఫ్లిప్కార్ట్లో ఆ ఫోన్కు భలే గిరాకి
Published Mon, Jan 23 2017 3:36 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
రెడ్ మి నోట్ 3తో మొబైల్ ప్రియులను అమితంగా ఆకట్టుకున్న షియోమి, కొత్త సంవత్సరంలో రెడ్ మి నోట్ 4తో వినియోగదారుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ను నేటి(సోమవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో, మి.కామ్లో షియోమి అందుబాటులో ఉంచింది. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్పై దీన్ని ప్రవేశపెట్టిన ఒక్కటే ఒక్క నిమిషంలో ఈ ఫోన్కు భలే గిరాకి వచ్చిందట. ఒక్క నిమిషంలోనే నోట్ 4 స్టాక్ అంతా అయిపోయిందట. మూడు వేరియంట్లలో దీన్ని షియోమి ప్రవేశపెట్టింది. రూ.9,999కు 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, రూ.10,999కు 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, రూ.12,999కు 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నేటి నుంచి గోల్డ్, డార్క్ గ్రే రంగుల ఫోన్లే అందుబాటులో ఉండనున్నాయి. మేట్ బ్లాక్ కలర్ వేరియంట్ కొన్ని వారాల తర్వాత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది.
షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు....
2.5డి కర్వ్‌డ్ గ్లాస్‌తో 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
2గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ కెమెరా
85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
128జీబీ వరకు విస్తరణ మెమరీ
ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రార్డ్ సెన్సార్
ఆండ్రాయిడ్ మార్ష్మాలో, మిఐయూఐ 8.0
ఆండ్రాయిడ్ నోగట్ 7.0 టెస్టింగ్
4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్‌బీ, బ్లూటూత్, జీపీఎస్
కింది వైపు డ్యూయల్ స్పీకర్స్
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
175 గ్రాముల బరువు
కాగా.. చైనాలో ఈ ఫోన్ ను గత ఆగస్టులోనే విడుదల చేసింది. రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ గోల్డ్, బ్లాక్ సిల్వర్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. 20శాతం బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచినట్టు ప్రకటించింది.
Advertisement
Advertisement