రూ.999కే రెడ్‌మి నోట్ 4
రూ.999కే రెడ్‌మి నోట్ 4
Published Wed, Aug 2 2017 11:06 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
షావోమి బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా పేరొందిన రెడ్‌మి నోట్ 4 నేడు (బుధవారం) ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. ''బిగ్ రెడ్‌మి నోట్ 4 సేల్'' కింద ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధర 999 రూపాయలకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సేల్ ప్రారంభమవుతోంది. ఈ సేల్, ఫ్లాష్ సేల్‌లకు భిన్నమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ డీల్స్, ఈఎంఐ సౌకర్యాలను, బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు షావోమి ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ 2పై 500 రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంఐ.కామ్‌లోనూ నేడు రెడ్‌మి నోట్4 అమ్మకానికి వస్తోంది.
బిగ్ రెడ్‌మి నోట్ 4 సేల్‌లో భాగంగా అన్ని వేరియంట్లపైనా.. రూ.249 బైబ్యాక్ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేసిన 6-8 నెలల్లో ఎక్స్చేంజ్ చేస్తే 40 శాతం వాల్యును తిరిగి వెనక్కి ఇచ్చేయనుంది. అంతేకాక పాత స్మార్ట్‌ఫోన్లతో ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొంటే అతి తక్కువ ధరకు రూ.999కే కస్టమర్లకు అందించనుంది. అంటే దాదాపు రూ.12వేల మేర ధర తగ్గుతోంది. ప్రతి రెడ్‌మి నోట్ 4 కొనుగోలుపై అదనంగా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2కు 500 రూపాయల డిస్కౌంట్‌ను లభించనుంది. కాగ, ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ తన సైటులో ఆండ్రాయిడ్ 7.0 నోగట్ అప్‌డేట్‌తో కూడిన రెడ్‌మి నోట్ 4ను లిస్టు చేసింది.
ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు...
2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్... ధర రూ.9999
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్..... ధర రూ.10,999
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్..... ధర రూ.12,999
డ్యూయల్ సిమ్(మైక్రో+నానో)
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
13ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
4జీబీ వాయిస్‌ఓవర్ ఎల్టీఈ
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement