4.2 సెకన్లలో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి! | one lakh Xiaomi RedMi 1S mobiles sold out in 4.2 seconds | Sakshi
Sakshi News home page

4.2 సెకన్లలో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి!

Published Tue, Oct 14 2014 5:46 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

4.2 సెకన్లలో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి! - Sakshi

4.2 సెకన్లలో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి!

మొబైల్ అమ్మకాల్లో మరోసారి మంగళవారం  ఫ్లిప్ కార్ట్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.  షియోమీ కంపెనీ రెడ్ మీ 1ఎస్ మొబైల్ ఫోన్ కేవలం 4.2 సెకన్లలోనే లక్ష ఫోన్లు అమ్ముడైనట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మకాల్ని ప్రారంభించింది. 2 గంటలకు ప్రారంభమైన అమ్మకాలు 4.5 సెకన్ల తర్వాత 'నో స్టాక్' అంటూ ప్రకటన డిస్ ప్లే అయింది. 
 
నేటి అమ్మకాల్లో కేవలం 4.2 సెకన్లలోనే లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి. రెడ్ మీ 1ఎస్ కోనుగొలుకు ఆసక్తి చూపిస్తున్న వినియోగదారులకు ధన్యవాదాలు అంటూ షియోమీ కంపెనీ భారత ప్రతినిధి మను జైన్ ట్విట్ చేశారు. 
 
రెడ్ మీ 1ఎస్ ఫోన్ ప్రత్యేకతలు:
720పీ రెజల్యూషన్ తో  4.7 ఇంచుల స్క్రీన్
1జీబీ ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్
8జీబీ ఇంటర్నల్ స్టోరెజ్, మెక్రో ఎస్ డీ కార్డు సపోర్ట్
డ్యూయల్ సిమ్, అండ్రాయిడ్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement