Redmi 1S
-
భారత్‌లో ‘షావోమి’ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం ఏడేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘షావోమి (ఎక్స్ఏఓఎంఐ)’ ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక భారతీయ మార్కెట్లో అతివేగంగా దూసుకెళుతోంది. భారత మార్కెట్లో ఈ కంపెనీ స్మార్ట్ఫోన్ల అమ్మకాల షేర్ గతేడాది ఆరు శాతం నుంచి ఏకంగా 22 శాతానికి దూసుకుపోయిందని హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘కౌంటర్ పాయింట్ రీసర్చ్’ వెల్లడించింది. భారత్‌లో విజయవంతమైన ఐదు స్మార్ట్ఫోన్లలో మూడు ఫోన్లు ఈ కంపెనీ ఉత్పత్తులే అవడం విశేషం. భారత్ మార్కెట్లోకి 1995లో అడుగుపెట్టిన దక్షిణ కొరియా మొబైల్ ఫోన్ల సంస్థ శామ్సంగ్తో సమానంగా షావోమి తన మార్కెట్‌ను విస్తరించుకుంది. 2014లో దేశంలోకి అడుగుపెట్టిన షావోమి కంపెనీ గత రెండేళ్ల కాలంలో భారత ఉప ఖండంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ డేటా సంస్థ తెలియజేసింది. రానున్న మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలంలో మరో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైంది. ధరకు తగ్గ నాణ్యతను పాటించడమే కాకుండా కేవలం ఈ–వాణిజ్యం ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారానే విక్రయించడం, ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవడం ద్వారా షావోమీ భారతీయ మార్కెట్లో కొత్త చరిత్రను సష్టించింది. ఫ్లాష్ సేల్స్ ద్వారా కొన్ని సెకడ్లలోనే తన ఉత్పత్తులన్నింటిని విక్రయించడం భారత్‌లో ఇప్పటి వరకు ఈ ఒక్క కంపెనీకే చెల్లిందని చెప్పవచ్చు. ఈ కంపెనీ 2014, సెప్టెంబర్‌లో రెడ్మి 1ఎస్ మోడల్ తీసుకొచ్చినప్పుడు 40 వేల స్మార్ట్ఫోన్లు 4.2 సెకండ్లలో అమ్ముడుపోయాయి. కేవలం ఆన్లైన్ మార్కెట్‌నే నమ్ముకున్న ఈ సంస్థ ఇప్పుడు భారత్‌లో 30 శాతం స్మార్ట్ఫోన్ల మార్కెట్‌ను ఆక్రమించింది. మిగతా కంపెనీలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాల ద్వారా కూడా వినియోగదారులను ఇంతగా ఆకర్షించలేకపోతున్నాయి. ఇక ఆఫ్‌లైన్‌లో కూడా తమ అమ్మకాలను కొనసాగించేందుకు షావోమి ‘మి హోమ్’ పేరిట సొంత షాపులను ఏర్పాటు చేస్తోంది. ఆ అవకాశంలేని చోట క్రోమా, యూనివర్సల్, పూర్విక, సంగీత రిటైల్ చైన్లతో ఒప్పందం పెట్టుకుంటోంది. భారత్‌లో షావోమి రెడ్మి నోట్ 42, షావోమి రెడ్మి నోట్ 43, షావోమి రెడ్మి 4ఏ4 మోడళ్లు సూపర్‌గా హిట్టయ్యాయి. -
ఐఏఎఫ్ హెచ్చరికలపై స్పందించిన షియోమీ!
న్యూఢిల్లీ: షియోమీ కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్లను తమ అధికారులు, కుటుంబీకులు వాడొద్దంటూ గతవారం భారతీయ వాయు సేన(ఐఏఎఫ్) హెచ్చరికలపై ఆ కంపెనీ స్పందించింది. వినియోగదారుల డేటాను భద్రతలేదంటూ చేసిన ప్రకటనపై భారత వైమానిక దళ అధికారులతో షియోమీ కంపెనీ ప్రతినిధులు చర్చించనున్నారు. 'ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తున్నాం. ఐఏఎఫ్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం మాకు అందలేదు. మీడియాలో వచ్చే కథనాలు మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఏఎఫ్ అధికారులను కలుస్తాం' షియోమీ ఉపాధ్యక్షుడు హుగో బర్రా తెలిపారు. గత సంవత్సరం రెడ్ మీ 1ఎస్ ఫోన్ ద్వారా సర్వీస్ ప్రోవైడర్ పేరు, ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్లను ఏవిధంగా చేరవేస్తుందనే అంశాన్ని ఫిన్ లాండ్ కు చెందిన ఎఫ్ సెక్యూర్ కంపెనీ ఓ డెమోను నిర్వహించింది. షియోమీ ఫోన్లలోని డేటా అంతా చైనాలోని సర్వర్లకు చేరుతోందని.. దీనివల్ల సెక్యూరిటీ రిస్కులు పొంచిఉన్నాయని ఐఏఎఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
4.2 సెకన్లలో లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి!
మొబైల్ అమ్మకాల్లో మరోసారి మంగళవారం ఫ్లిప్ కార్ట్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. షియోమీ కంపెనీ రెడ్ మీ 1ఎస్ మొబైల్ ఫోన్ కేవలం 4.2 సెకన్లలోనే లక్ష ఫోన్లు అమ్ముడైనట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వినియోగదారులకు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మకాల్ని ప్రారంభించింది. 2 గంటలకు ప్రారంభమైన అమ్మకాలు 4.5 సెకన్ల తర్వాత 'నో స్టాక్' అంటూ ప్రకటన డిస్ ప్లే అయింది. నేటి అమ్మకాల్లో కేవలం 4.2 సెకన్లలోనే లక్ష ఫోన్లు అమ్ముడయ్యాయి. రెడ్ మీ 1ఎస్ కోనుగొలుకు ఆసక్తి చూపిస్తున్న వినియోగదారులకు ధన్యవాదాలు అంటూ షియోమీ కంపెనీ భారత ప్రతినిధి మను జైన్ ట్విట్ చేశారు. రెడ్ మీ 1ఎస్ ఫోన్ ప్రత్యేకతలు: 720పీ రెజల్యూషన్ తో 4.7 ఇంచుల స్క్రీన్ 1జీబీ ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ 8జీబీ ఇంటర్నల్ స్టోరెజ్, మెక్రో ఎస్ డీ కార్డు సపోర్ట్ డ్యూయల్ సిమ్, అండ్రాయిడ్ -
భారత్‌లో షియోమి రెండో ఫోన్
న్యూఢిల్లీ: చైనా యాపిల్‌గా ప్రసిద్ధి చెందిన షియోమి కంపెనీ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్, రెడ్మి 1ఎస్‌ను భారత్‌లోకి తెస్తోంది. రూ.5,999 ధర ఉండే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్(ఒకటి 3జీ, ఇంకొకటి 2జీ)ను వచ్చే నెల 2న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆన్లైన్లో విక్రయాలకు అందుబాటులో ఉంచనున్నది. ఈ ఫోన్ కొనుగోళ్లకు ముందస్తు రిజిస్ట్రేషన్లు మంగళవారం సాయంత్రం నుంచే ప్రారంభమయ్యాయని షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా పేర్కొన్నారు. ఈ ఫోన్లో 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, 1.6 గిగాహెర్ట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.6 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు. షియోమి ఫ్లాగ్షిప్ మోడల్, ఎంఐ3ని ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మంచి అమ్మకాలు సాధించిన ఉత్సాహాంతో రెడ్మి 1ఎస్‌ను షియోమి భారత్‌లోకి తెస్తోంది. రూ.13,999 ధర ఉన్న ఎంఐ3 స్మార్ట్ఫోన్లు ఇప్పటివరకూ 90 వేలు అమ్ముడయ్యాయి. ఒక్కో విడతకు 10,000-20,000 వరకూ ఆరు విడతల్లో ఈ ఫోన్లను కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆఫర్ చేసింది. ప్రతిసారి ఐదు సెకన్లలోనే ఫోన్లన్నీ అమ్ముడయ్యాయని కంపెనీ పేర్కొంది.