సాక్షి, న్యూఢిల్లీ : కేవలం ఏడేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘షావోమి (ఎక్స్‌ఏఓఎంఐ)’ ప్రపంచ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక భారతీయ మార్కెట్‌లో అతివేగంగా దూసుకెళుతోంది. భారత మార్కెట్‌లో ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల షేర్ గతేడాది ఆరు శాతం నుంచి ఏకంగా 22 శాతానికి దూసుకుపోయిందని హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘కౌంటర్ పాయింట్ రీసర్చ్’ వెల్లడించింది. భారత్‌లో విజయవంతమైన ఐదు స్మార్ట్‌ఫోన్లలో మూడు ఫోన్లు ఈ కంపెనీ ఉత్పత్తులే అవడం విశేషం.
భారత్ మార్కెట్‌లోకి 1995లో అడుగుపెట్టిన దక్షిణ కొరియా మొబైల్ ఫోన్ల సంస్థ శామ్‌సంగ్‌తో సమానంగా షావోమి తన మార్కెట్‌ను విస్తరించుకుంది. 2014లో దేశంలోకి అడుగుపెట్టిన షావోమి కంపెనీ గత రెండేళ్ల కాలంలో భారత ఉప ఖండంలో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని బ్లూమ్‌బెర్గ్ డేటా సంస్థ తెలియజేసింది. రానున్న మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలంలో మరో 50 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెట్టడానికి సిద్ధమైంది. ధరకు తగ్గ నాణ్యతను పాటించడమే కాకుండా కేవలం ఈ–వాణిజ్యం ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారానే విక్రయించడం, ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవడం ద్వారా షావోమీ భారతీయ మార్కెట్‌లో కొత్త చరిత్రను సష్టించింది.
ఫ్లాష్ సేల్స్ ద్వారా కొన్ని సెకడ్లలోనే తన ఉత్పత్తులన్నింటిని విక్రయించడం భారత్‌లో ఇప్పటి వరకు ఈ ఒక్క కంపెనీకే చెల్లిందని చెప్పవచ్చు. ఈ కంపెనీ 2014, సెప్టెంబర్‌లో రెడ్‌మి 1ఎస్ మోడల్ తీసుకొచ్చినప్పుడు 40 వేల స్మార్ట్‌ఫోన్లు 4.2 సెకండ్లలో అమ్ముడుపోయాయి. కేవలం ఆన్‌లైన్ మార్కెట్‌నే నమ్ముకున్న ఈ సంస్థ ఇప్పుడు భారత్‌లో 30 శాతం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ను ఆక్రమించింది. మిగతా కంపెనీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అమ్మకాల ద్వారా కూడా వినియోగదారులను ఇంతగా ఆకర్షించలేకపోతున్నాయి. ఇక ఆఫ్‌లైన్‌లో కూడా తమ అమ్మకాలను కొనసాగించేందుకు షావోమి ‘మి హోమ్’ పేరిట సొంత షాపులను ఏర్పాటు చేస్తోంది. ఆ అవకాశంలేని చోట క్రోమా, యూనివర్సల్, పూర్విక, సంగీత రిటైల్ చైన్లతో ఒప్పందం పెట్టుకుంటోంది. భారత్‌లో షావోమి రెడ్‌మి నోట్ 42, షావోమి రెడ్‌మి నోట్ 43, షావోమి రెడ్‌మి 4ఏ4 మోడళ్లు సూపర్‌గా హిట్టయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment