ఐఏఎఫ్ హెచ్చరికలపై స్పందించిన షియోమీ!
న్యూఢిల్లీ: షియోమీ కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న ఫోన్‌లను తమ అధికారులు, కుటుంబీకులు వాడొద్దంటూ గతవారం భారతీయ వాయు సేన(ఐఏఎఫ్) హెచ్చరికలపై ఆ కంపెనీ స్పందించింది. వినియోగదారుల డేటాను భద్రతలేదంటూ చేసిన ప్రకటనపై భారత వైమానిక దళ అధికారులతో షియోమీ కంపెనీ ప్రతినిధులు చర్చించనున్నారు.
'ఈ సమస్యకు పరిష్కారం చూపడానికి ప్రయత్నిస్తున్నాం. ఐఏఎఫ్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం మాకు అందలేదు. మీడియాలో వచ్చే కథనాలు మా దృష్టికి వచ్చాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఐఏఎఫ్ అధికారులను కలుస్తాం' షియోమీ ఉపాధ్యక్షుడు హుగో బర్రా తెలిపారు.
గత సంవత్సరం రెడ్ మీ 1ఎస్ ఫోన్ ద్వారా సర్వీస్ ప్రోవైడర్ పేరు, ఫోన్ ఐఎమ్ఈఐ నంబర్లను ఏవిధంగా చేరవేస్తుందనే అంశాన్ని ఫిన్ లాండ్ కు చెందిన ఎఫ్ సెక్యూర్ కంపెనీ ఓ డెమోను నిర్వహించింది. షియోమీ ఫోన్‌లలోని డేటా అంతా చైనాలోని సర్వర్లకు చేరుతోందని.. దీనివల్ల సెక్యూరిటీ రిస్కులు పొంచిఉన్నాయని ఐఏఎఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.