‘రెడ్ మి నోట్ 4’ కొత్త వేరియంట్
సాక్షి, న్యూడిల్లీ: షావోమి రెడ్‌మినోట్ 4 లోకొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. తన తాజా స్మార్ట్‌పోన్ నోట్ 4 బ్లూ వేరియంట్‌ను ఇండియన్ మార్కోట్లో ప్రారంభించింది. ఇది సోమవారం మధ్యాహ్నం 12నుంచి ఎం.కామ్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ హ్యాండ్ సెట్ 4జీబీ/ 64జీబీ స్టోరేజ్ కాన్‌ఫిగరేషన్ లో మాత్రమే లభ్యం కానుంది. 'వేక్ లేక్' ప్రాజెక్టు భాగంగా ప్రారంభించినట్టు కంపెనీ ప్ర కటించింది దీని ధర రూ. 12,999లు.
బెంగళూరులో తీవ్ర కాలుష్యానికి గురవుతున్నచెరువుల పునరుద్ధరణకు మద్దతుగా ఈ లేక్ బ్లూ వేరియంట్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ప్రకటించారు. గత దశాబ్దంలో బెంగళూరు ప్రజలు నీటి వనరుల కోసం తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారనీ ఈ నేపథ్యంలో బెంగళూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని స్వచ్ భారత్ అభియాన్ ప్రాజెక్టుకు మద్దతుగా దీన్ని లాంచ్ చేసినట్టు చెప్పారు.
రెడ్ మి నోట్ 4 లేక్ బ్లూ వేరియంట్
5.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపిఎస్ డిస్‌ప్లే
1080x1920 పిక్సల్స్ రిజల్యూషన్ , 2.5 డి కర్వ్‌డ్ గాస్ల్
స్నాప్‌డ్రాగన్ 625
4జీబీ ర్యామ్,
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
మైక్రో ఎస్‌డీ కార్డ్ తో ఎక్స్‌పాండబుల్ మెమొరీ
13-మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
4100ఎంఏహెచ్ బ్యాటరీ
'Lake blue' edition of India's #1 selling smartphone goes on sale at noon on https://t.co/cwYEXdVQIo, @Flipkart, Mi Home & offline partners! pic.twitter.com/s9OQ29W3DL
— Redmi India (@RedmiIndia) September 4, 2017