రెడ్ మి నోట్ 4 హాట్ సేల్..! | 2.5 lakh units of Xiaomi Redmi Note 4 sold in 10 minutes: Xiaomi | Sakshi
Sakshi News home page

రెడ్ మి నోట్ 4 హాట్ సేల్..!

Published Tue, Jan 24 2017 2:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM

రెడ్ మి నోట్ 4 హాట్ సేల్..!

రెడ్ మి నోట్ 4 హాట్ సేల్..!

న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షియోమి  మరోసారి రికార్డ్ అమ్మకాలను సాధించింది.  ఎంఐ స్టోర్  తో పాటు ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో జనవరి 23, సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చిన రెడ్ మీనోట్ 4 హాట్ సేల్ ను క్రియేట్ చేసింది.  అమ్మకాలు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే  రెండున్నర లక్షల యూనిట్లను విక్రయించినట్టు షియామి  ఒక  ప్రత్యేక ప్రకటనలో మంగళవారం  ప్రకటించింది. దాదాపు 10 నిమిషాల్లో 2.5 లక్షలకు పైగా స్మార్ట్ ఫోన్లను అమ్మినట్టు తెలిపింది. ఆన్ లైన్  విక్రయ చరిత్రలోనే భారీ అమ్మకాల కొత్త రికార్డు నెలకొల్పింది.

అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందంటూ రెడ్ మీ నోట్ 4  అమ్మకాలపై స్పందించిన ఫ్లిప్ కార్ట్ హెడ్ అజయ్ యాదవ్  వ్యాఖ్యానించారు.  ఫేవరెట్ మొబైల్స్ కొనుగోలులో వినియోగదారుల  నమ్మకాన్ని ఫ్లిప్ కార్ట్ మరోసారి నిరూపించుకుందని తెలిపారు.   అటు ఎంఐ అభిమానులు,  వినియోగదారుల ఆదరణ పట్ల షియోమి ఆన్ లైన్  సేల్స్ హెడ్  రఘు రెడ్డి  సంతోషం  వ్యక్తం  చేశారు. కాగా మోస్ట్ ఎవైటెడ్ స్మార్ట్ ఫోన్ ను షియోమి  జనవరి 19 న  మార్కెట్ లో లాంచ్ చేసింది.  అయితే  అమ్మకాలనుమాత్రం   జనవరి 23 న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement