మళ్లీ పేలిన రెడ్‌మీ నోట్‌ 4 | Xiaomi Redmi Note 4 Catches Fire Again | Sakshi
Sakshi News home page

రెడ్‌మీ నోట్‌ 4 మళ్లీ పేలిపోయింది

Published Fri, Aug 25 2017 10:48 AM | Last Updated on Tue, Sep 12 2017 1:00 AM

Xiaomi Redmi Note 4 Catches Fire Again

అచ్యుతాపురం (యలమంచిలి) : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో రెడ్‌మీ నోట్‌-4 కాలిన ఘటన మరవకముందే విశాఖ జిల్లాలోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. చార్జింగ్‌ పెట్టిన రెడ్‌మి నోట్‌-4 మొబైల్‌ పేలిపోయింది. జిల్లాలోని రామన్నపాలెంలో నిన్న (గురువారం) ఈ సంఘటన జరిగింది.

గ్రామానికి చెందిన గంధం ధర్మిరెడ్డి సాయి తన రెడ్‌మి నోట్‌-4 సెల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి, చార్జింగ్‌తో ఉన్న ఫోన్‌తో కాసేపు మాట్లాడి బయటకు వెళ్లాడు. అయిదు నిమిషాల తర్వాత పెద్ద శబ్దం రావడంతో వచ్చి చూడగా సెల్‌ఫోన్‌ నుంచి పొగలు వచ్చాయి. ధర్మిరెడ్డి సాయి ఈ ఫోన్‌ను రెండు నెలల క్రితమే కొనుగోలు చేశాడు.

సంబంధిత వార్తలు :
కాలిపోయిన 'నోట్‌-4'.. యువకుడికి గాయాలు!
అందుకే ‘నోట్‌-4’ కాలింది: షావోమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement