సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం ప్రమాద ఘటనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నష్ట పరిహారం అందించడంలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం చెందింది. ఇద్దరు క్షతగాత్రులకు నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్ట్ తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్ కూడా పరిహారం అందలేదు. ప్రస్తుతం ఆయన ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరో ఘటనలో పరవాడ సినర్జీస్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇండస్ ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతుండగా.. జార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీర మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీ్‌హెచ్ మార్చూరీకి తరలించారు.
కాగా, ‘అచ్యుతాపురం–పరవాడ’ సెజ్‌లో వరుస ప్రమాదాలు కార్మికులు, వారి కుటుంబాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో 22 మంది మృతిచెందారు. రెండు రోజుల కిందట అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో 17 మంది మరణించిన దుర్ఘటన మరువక ముందే... పరవాడ సెజ్‌లో మరో ప్రమాదం చోటుచేసుకుంది.
పరవాడ సమీపంలోని జేఎన్ ఫార్మాసిటీలో సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్–3 యూనిట్‌లో గురువారం అర్ధరాత్రి రియాక్టరు నుంచి రసాయనాలు వెలువడి పొగతో కూడిన మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు, విజయనగరం జిల్లాకు చెందిన ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన విశాఖపట్నంలోని ఇండస్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment