కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే..
కొత్త ఐప్యాడ్ ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్, ధరెంతంటే..
Published Sat, Apr 8 2017 4:31 PM | Last Updated on Mon, Aug 20 2018 3:07 PM
ఐప్యాడ్ ఏయిర్ 2ను రిప్లేస్ చేస్తూ ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐప్యాడ్ (2017) ఇప్పుడు భారత్ లోనూ దొరుకుతోంది. మార్చి చివర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ మోడల్ ప్రీ-ఆర్డర్లను కంపెనీ ఈ-కామర్స్ దిగ్గజ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా స్వీకరిస్తోంది. శుక్రవారం నుంచి ప్రీ-ఆర్డర్లకు అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. ఆపిల్ ముందస్తు నిర్ణయించిన ధర రూ.28,900కే ఈ 32జీబీ వై-ఫై మోడల్ ను ప్రీ-ఆర్డర్ల ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. 32జీబీ వై-ఫై ప్లస్ సెల్యులార్ మోడల్ ను కంపెనీ ఇంకా లిస్టు చేయలేదు. వై-ఫై ప్లస్ మోడల్ ధర రూ.39,900గా ఉంది.
3.1 మిలియన్ కు పైగా పిక్సెల్స్ తో 9.7 అంగుళాల రెటీనా డిస్ప్లేను ఈ ఐప్యాడ్ కలిగి ఉంది. థిన్ అల్యూమినియం యూనిబాడీ, ఆపిల్ ఏ9 చిప్, వై-ఫైపై 10 గంటలు పాటు పనిచేయగల బ్యాటరీ సామర్థ్యం, 8ఎంపీ రియర్ కెమెరా, 1.2 ఎంపీ ఫ్రంట్ ఫేస్ టైమ్ కెమెరా దీని ప్రత్యేకతలు. దీనికోసం స్పెషల్ గా 1.3 మిలియన్ పైగా యాప్స్ ను కంపెనీ డిజైన్ చేసింది. ఈ ఐప్యాడ్ ప్రపంచంలో అత్యంత పాపులర్ టాబ్లెట్ అని, మూవీలు, టీవీ చూసుకునేందుకు వీలుగా పెద్ద స్క్రీన్ సైజుతో దీన్ని తీసుకొచ్చామని వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిలర్ చెప్పారు.
Advertisement
Advertisement