సాక్షి, న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ కొత్త నూతన ఐప్యాడ్ మోడల్‌ను ఇపుడు భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పెన్సిల్ సపోర్ట్‌తో గత నెలలో విడుదల చేసిన ఐప్యాడ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇపుడు ప్రీ ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. రూ.28వేల ప్రారంభ ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది. అలాగే యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వద్ద కూడా ఐప్యాడ్ (2018)ను కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ తీసుకొచ్చిన కొత్త ఐప్యాడ్ ఫీచర్ల విషయానికి వస్తే.. 9.7 ఇంచ్ డిస్‌ప్లేతో రెండు వేరియంట్లలో ఇది లభిస్తోంది. 32జీబీ వేరియంట్ 28వేల రూపాయలకు, 128 జీబీ వేరియంట్ రూ.37500లకు అందుబాటులో ఉంది.2048 × 1536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, యాపిల్ పెన్సిల్ సపోర్ట్, ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఓలియోఫోబిక్ కోటింగ్, యాపిల్ ఎ10 ఫ్యుషన్ చిప్‌సెట్, ప్రాసెసర్,32/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఓఎస్ 11, 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 1.2ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 10 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి.ఇక ఆఫర్ల విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.16వేల ఎక్సేంజ్ ఆఫర కూడా ఉంది. యాక్సిస్‌బ్యాంక్ బిజినెస్ కార్డు ద్వారా (సుమారు 200 రూపాయలుదాకా)5శాతం డిస్కౌంట్.
Comments
Please login to add a commentAdd a comment