
సాక్షి, ముంబై: యాపిల్ లవర్స్‌కు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లోయాపిల్ ఐప్యాడ్‌పై భారీ ఆఫర్ లభిస్తోంది. దాదాపు రూ. 42 వేల విలువైన యాపిల్ ఐప్యాడ్ కేవలం రూ. 8,900కే లభిస్తుంది. త్వరలో జరగనున్న గ్లోబల్ ఈవెంట్‌లో కొత్త యాపిల్ ఐప్యాడ్‌ను లాంచ్ చేస్తుందన్న అంచనాల మధ్య ఈ ఆఫర్ ప్రముఖంగా నిలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది.రూ. 41,900 వద్ద లిస్ట్ యాపిల్ లేటెస్ట్ యాపిల్ ఐప్యాడ్ (10వ తరం)పై దాదాపు 36వేల రూపాయలకు పైగా డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. అంటే కేవలం రూ. 8,900కే కొనుగోలుదారులు దక్కించుకోవచ్చు. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు)
హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ. 3000 తక్షణ క్యాష్‌బ్యాక్.. దీంతో ధర రూ.38,900కి తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారారూ. 30,000 వరకు తగ్గింపు. అంటే అన్ని బ్యాంక్ ఆఫర్లు , డిస్కౌంట్ల తర్వాత, తాజా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 8,900కి లభిస్తుంది.జూన్ 5 నుండి 9 వరకు యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2023) జరగనుంది.
మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ న్యూస్ అప్‌డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్