Mi Note 2
-
రెడ్ మి 4 కమింగ్ సూన్!
ముంబై: స్మార్ట్ ఫోన్లతో ప్రపంచ వ్యాప్తంగా ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షియోమి మరింత వేగంగా దూసుకుపోతోంది. తాజాగా రెడ్ మి సిరీస్ లో భాగంగా ' రెడ్ మి 4' స్మార్ట్ ఫోన్ నులాంచ్ చేసేందుకు రడీ అవుతోంది. ఈ ఏడాది జనవరి లో లాంచ్ రెడ్ మి 3 కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ గా రెడ్ మి 4 విడుదలకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. చైనీస్ సర్టిఫికేషన్ సైట్ తెనా లో లీక్ అయిన వివరాలు ప్రకారం రెడ్ మి 4 ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 1.4 ఆక్టా కోర్ ప్రాపెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్ పాండబుల్ 13 ఎంపీరియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ముందు కెమెరా 4100 బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.7వేలు గా నిర్ణయించినట్టు అంచనా. అయితే దీనిపై షియామి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
భారత్‌లో షియోమి అనూహ్య నిర్ణయం!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల కంపెనీ షియోమి బుధవారం అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. తన టాప్ ఫ్లాగ్షిప్ మోడళ్లయిన ఎంఐ నోట్-2, ప్యూచరిస్టిక్ ఎం మాక్స్ ఫోన్లను భారత్‌లో విడుదల చేయబోమని స్పష్టం చేసింది. అదేవిధంగా నెలకిందట విడుదలైన ఎంఐ 5ఎస్‌ను కూడా భారత్‌లో అమ్మబోమని స్పష్టం చేసింది. హైఎండ్ టెక్నాలజీ, టాప్ ఫీచర్లతో కూడిన ఎంఐ నోట్-2ను, ప్యూచరిస్టిక్ ఎంఐ మాక్స్ మోడళ్లను షియోమి బుధవారం చైనాలో విడుదల చేసింది. అయితే, ఎక్కువమొత్తంలో ధర ఉండే తన ఫ్లాగ్షిప్ మోడళ్లకు భారత్‌లో మార్కెట్ చాలా స్పల్పంగా ఉంది. దీనికితోడు భారత్‌లో ఏడాదికి ఒకటే హైఎండ్ ఫోన్‌ను విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ కొత్త మోడళ్లను ఇక్కడ అమ్మడం లేదని కంపెనీ తాజాగా స్పష్టత ఇచ్చింది. షియోమి తాజా నిర్ణయం ఆ కంపెనీ ఫోన్లు ఇష్టపడే భారతీయులకు నిరాశ కలిగించేదే. అయితే, హైఎండ్ టెక్నాలజీతో వచ్చిన ఎంఐ-5 ఫోన్‌కు భారత్‌లో పెద్దగా ఆదరణ లభించలేదు. అంతేకాకుండా షియోమి భారత్ కన్నా తన ప్రధాన మార్కెట్ అయిన చైనాపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. ఇతర విదేశీ మార్కెట్ల మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. రెండేళ్లుగా భారత్ మార్కెట్లో ఉన్నా ఫ్లాగ్షిప్ మోడళ్లకు తమకు పెద్దగా మార్కెట్ లేదని, అంతేకాకుండా ఏడాదికి ఒక హైఎండ్ ఫోన్‌ను మాత్రమే విడుదల చేయాలన్న నిర్ణయం కారణంగా తమ కొత్త ఫోన్లను భారత్‌కు పంపడం లేదని షియోమి చైనా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా వెల్లడించారు. 5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే.. 23 ఎంపీ బ్యాక్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఎంఐ నోట్-2 ధర చైనా మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 27,700 నుంచి రూ. 29,700 మధ్య ఉండే అవకాశముంది. -
ఎంఐ నోట్ 2 ఫీచర్లు అదుర్స్!
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఎంఐ నోట్ 2 పేరుతో సరికొత్త ఫోన్ ను షియోమీ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ ను ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. రెండు వంపుల(డ్యూయల్ కర్వడ్) ప్రత్యేకత కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను అక్టోబర్ 25న మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్టు షియోమీ వెల్లడించింది. అయితే ఈఫోన్ కు సంబంధించిన ఫీచర్లు అధికారికంగా వెల్లడికానప్పటికీ కొన్ని వివరాలు బయటకు లీకయ్యాయి. అనధికారికంగా వెల్లడైన ఫీచర్లు ఫోన్ ప్రియులను ఆటక్టునేలా ఉన్నాయి. అల్ట్రా థిన్ డిప్లేతో కూడిన ఎంఐ నోట్ 2 ఫోన్ ను 4 జీబీ, 6 జీబీ వేరియంట్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఎంఐ నోట్ 2 ఫోన్ ఫీచర్లు 5.7 అంగుళాల 3డీ టచ్ డిస్ ప్లే 23 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 318 కెమెరా 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 4 జీబీ ర్యామ్/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 6 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆండ్రాయిడ్ 6 మార్ష్ మాలో ఓఎస్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్ డ్యుయల్ సిమ్ సపోర్ట్ 4 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 27,700 6 జీబీ ఫోన్ ధర సుమారు రూ. 29,700 -
రెడ్మి 4, మి నోట్ 2 ఫోటోల లీకేజీ హల్చల్
ఇంకా ఒక నెలలోనే కస్టమర్ల ముందుకు గ్రాండ్ ఈవెంట్‌గా రావాలనుకున్న షియోమి రెడ్మి 4, మి నోట్ 2లు లీక్‌ల బారినపడ్డాయి. రెండు స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ లీకేజీ ఫోటోల్లో ఈ రెండు స్మార్ట్ఫోన్లు మెటల్ యూనిబాడీస్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇతర కీలక స్పెషిఫికేషన్లు హల్చల్ చేస్తున్నాయి. రెడ్మి 4 లీకేజీ వివరాలు.. రౌండ్ అంచులతో మెటల్ యూనిబాడీని రెడ్మి 4 కలిగి ఉందని..పైనా, కింద యాంటీనా బ్యాండ్స్ ఉన్నట్టు లీకేజీ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. వెనుకవైపు కెమెరా టాప్ సెంటర్లో ఉండి, దానిపక్కనే కుడివైపున ఫ్లాష్ ఉంది. కెమెరా లెన్స్ కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. కెపాసిటివ్ నావిగేషన్ బటన్స్ ఫ్రంట్న కింద వైపు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎమ్ఐయూఐ 8, ఐదు అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో రెడ్మి 4 ఫోన్ వినియోగదారుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ముందస్తు లీక్‌లు మాత్రం ఈ వేరియంట్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అని వెల్లడించాయి. 4100 బ్యాటరీ సామర్థ్యంతో 7వేల రూపాయలకు ఇది లాంచ్ కాబోతుందని అంచనా. ఆగస్టు 25న చైనాలో మెగా ఈవెంట్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేయాలని షియోమి భావిస్తోంది. మి నోట్ 2 స్మార్ట్‌ఫోన్ లీకేజ్‌లు.... రెడ్మి 4 స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించిన రెండో వారంలోనే అంటే సెప్టెంబర్ 2న మి నోట్ 2ను షియోమి ఆవిష్కరించనున్నట్టు వెల్లడవుతోంది. మి నోట్ 2కు సంబంధించి కొన్ని లీక్‌లు మాత్రమే ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. వెనుకాల డ్యుయల్ కెమెరా, గెలాక్సీ నోట్ 7 మాదిరిగా కర్వ్డ్ డిస్ప్లే, ముందు బాగాన ఫింగర్‌ప్రింట్ స్కానర్, రెండు స్పీకర్ గ్రిల్స్ ఉన్నట్టు లీక్‌లో తెలుస్తోంది. ముందస్తు లీకేజీల బట్టి ఈ ఫోన్ రెండు మెమెరీ వేరియంట్లు 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ అలరించనుందట. దీని ధర కూడా రూ.25 వేలు, రూ.28 వేలుగా ఉంటుందని అంచనా. మెటల్ బాడీ, ఫింగర్‌ప్రింట్ స్కానర్, అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 821 ఎస్ఓసీ, 3600ఎంఏహెచ్ బ్యాటరీ లీకేజీలోని మి నోట్ 2 ప్రత్యేకతలు.