షియోమి అతిపెద్ద స్మార్ట్ ఫోన్ నేడే లాంచ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తన కొత్త స్మార్ట్ ఫోన్ "మి మ్యాక్స్"ను నేడు భారత మార్కెట్లోకి విడుదలచేయనుంది. అదేవిధంగా ఎమ్ఐయూఐ 8 ను గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. న్యూఢిల్లీ ఈవెంట్ గా ఈ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుంది. షియోమి మి మ్యాక్స్ ను ఈ ఏడాది మేలోనే చైనాలో ఆవిష్కరించింది. 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ 342పీపీఐ డిస్ ప్లే కల్గిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ అన్ని ఫోన్లలో కల్లా అతి పెద్ద స్మార్ట్ ఫోన్. మొత్తం మెటల్ బాడీతో, డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో మి మ్యాక్స్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.
మి మ్యాక్స్ ను మూడు వేరియంట్లలో చైనాలో ఆవిష్కరించారు.
1. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్.. ధర: దాదాపు రూ.15,000
3. జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1.8 జీహెచ్ జడ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ .. ధర: దాదాపు రూ.17,000
3. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్... ధర: దాదాపు రూ.20,500
అయితే గతంలో మాదిరిగా కేవలం ఒక్క వేరియంట్ నే కంపెనీ భారత్ మార్కెట్లోకి తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
షియోమి మి మ్యాక్స్ ఫీచర్లు...
6.44 అంగుళాల డిస్ ప్లే
హెక్సా కోర్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్ రెసుల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
4850 ఎంఏహెచ్
డ్యూయల్ సిమ్, 4జీ ఎల్ టీఈ సపోర్టు
203 గ్రాముల బరువు