న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి మరో సరికొత్త మొబైల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అతి తక్కువ ధరలో దీని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ రూ. 5,999లుగా నిర్ణయించింది. రెడ్ 4 ఏ పేరుతో ప్రత్యేక ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డార్క్ గ్రే , గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ కలర్స్ అందుబాటులోకి తెచ్చింది. డ్యుయల్ సిమ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ లాంటి ఇతర అన్ని ప్రధాన ఫీచర్లన్నీ ఇందులో పొందుపరచింది. మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
రెడ్ మీ 4 ఏ లాంచ్ ఫీచర్లు
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
720x1280 పిక్సెల్ రిజల్యూషన్,
6.0 ఆండ్రాయిడ్ మార్షమల్లౌ, క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 చిప్ సెట్
2 జీబీ ర్యామ్,
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ,
13ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా,
3,120 ఎంఏహెచ్ బ్యాటరీ
రెడ్ మీ 4 ఏ లాంచ్..ధర వింటే
Published Mon, Mar 20 2017 2:37 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
Advertisement
Advertisement