రెడ్‌మీ 4 సేల్‌ ఒక గంట మాత్రమే.. | Xiaomi Redmi 4 to go on sale for only 1 hour on Amazon India at 12 pm today | Sakshi
Sakshi News home page

రెడ్‌మీ 4 సేల్‌ ఒక గంట మాత్రమే..

Published Tue, May 30 2017 11:33 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

రెడ్‌మీ 4 సేల్‌ ఒక గంట మాత్రమే..

రెడ్‌మీ 4 సేల్‌ ఒక గంట మాత్రమే..

న్యూడిల్లీ:  చైనా మొబైల్‌   దిగ్గజం షియామి తన క్రేజీ మొబైల్‌ అమ్మకాలను మరోసారి ప్రారంభించింది. మంగళవారం  కేవలం ఒకగంట పాటు రెడ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. మధ్యాహ్నం 12గం. ఎంఐ.కామ్‌, ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుందని షియామి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ కలర్స్‌లో,  2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌,  3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌,  4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, మూడు వేరియంట్లలో,  రూ .6,999 , రూ.8999,  రూ. 10,999 ధరల్లో   లభ్యంకానుంది.   మధ్నాహ్నం 12:00 గంటల నుండి 1:00 గంటల మధ్య కేవలం   ఒక గంట మాత్రమే అందుబాటులో ఉండనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement