అమెజాన్ ప్రైమ్ డే సేల్: ఆఫర్ల పండుగ
అమెజాన్ ప్రైమ్ డే సేల్: ఆఫర్ల పండుగ
Published Mon, Jul 10 2017 8:11 PM | Last Updated on Fri, May 25 2018 7:14 PM
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగకు తెరలేపింది. తన తొలి ప్రైమ్ డే సేల్‌ను ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి భారత్‌లో ప్రారంభించింది. 12 ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ నేడు ఈ స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లను, ఆఫర్లను, డీల్స్ను అమెజాన్ ప్రకటించింది. 30 గంటల పాటు ఈ సేల్ జరుగబోతుంది. అంటే రేపు అర్థరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. అయితే ఇది ఎక్స్క్లూజివ్‌గా రూ.499తో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్‌మెంబర్లకు మాత్రమే. ఈ సేల్లో ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు దేశం దేశంలోనే భిన్నంగా ఉండనున్నాయి. భారత్‌తో పాటు నేడు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్‌లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ డీల్స్..
స్మార్ట్‌ఫోన్లను తీసుకున్నట్లు అయితే, షియోమి లవర్స్ ఫేమస్ ఫోన్ రెడ్‌మి 4ను ఓపెన్ సేల్ కింద నేటి సాయంత్రం 5 గంటల నుంచే అందుబాటులో ఉంచింది. అది ఎక్స్క్లూజివ్‌గా తన ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. అంతేకాక వన్ ప్లస్ తాజాగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపైన 2000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.. ఈ ఆఫర్ కేవలం డివైజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నవారికే. ఇప్పటికే వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలుచేసిన వారికి 19వేల రూపాయల తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఇక ఈ స్పెషల్ సేల్ సందర్బంగా మరో రెండు వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు కార్డు యూజర్లకు మరో రూ.2000 తగ్గింపును అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. మోటోఫోన్లపై రూ.1000 తగ్గింపును, హానర్ 6ఎక్స్ స్మార్ట్ఫోన్పై 3000 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. కిచెన్, హోమ్ అప్లయెన్స్‌పై 45 శాతం తగ్గింపును ఇస్తోంది.
అమెజాన్ ఫైర్‌టీవీ స్టిక్ ధరను 1000 రూపాయల వరకు తగ్గించింది. అంతేకాక 499 రూపాయల క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నట్టు అమెజాన్ చెప్పింది. ఫిట్‌బిట్ ఫిట్‌నెస్ ట్రాకర్లపై 40 శాతం తగ్గింపు, వస్త్రాలపై 70 శాతం తగ్గింపు, స్విగ్గీ ఫుడ్ డెలవరీపై రూ.150 తగ్గింపు, బుక్‌మైషోలో మూవీ టిక్కెట్లను కొనుగోలుచేసిన వారికి రూ.200 వరకు తగ్గింపు వంటి పలు డీల్స్‌ను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొనేవారికి 15 శాతం క్యాష్బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నారు. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉంటాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.30 కొత్త బ్రాండ్‌లను కూడా ఈ సేల్‌లో లాంచ్‌చేసింది.
Advertisement