వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు | OnePlus 1000 Days Sale: OnePlus 5, OnePlus 3T Available With Discounts, Cashbacks, Offers | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు

Published Tue, Sep 5 2017 12:21 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై  భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు - Sakshi

వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు

సాక్షి ముంబై: వన్‌ ప్లస్‌ మూడు రోజుల అమ్మకాలకు తెర తీసింది. ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెట్టి  వెయ్యిరోజులు పూర్తయిన  ఉత్సవాల్లో భాగంగా 1000 డే సేల్‌ను ప్రారంభించింది. ఈ రోజునుంచి (సెప్టెంబర్‌  5-7వ తేదీ)  గురువారం వరకు కొనసాగనున్న ఈ  స్పెషల్‌ సేల్‌లో  ప్రత్యేకంగా అమెజాన్‌  ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందిస్తోంది.  ముఖ్యంగా వన్‌ప్లస్‌ 3టీ, వన్‌ ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను  ప్రకటించింది.  

వన్‌ప్లస్‌ 3టీ
వన్‌ప్లస్‌ 3టీ భారీ  తగింపును ఆఫర్‌ చేస్తోంది. రూ. రూ. 4వేల  తగ్గింపుతో  64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కెపాసిటీ వెర్షన్‌ను రూ. 25,999, లకే అందిస్తోంది.  అంతేకాదు యాక్సిస్‌    బ్యాంక్ వినియోగదారులకు మరో  ఆఫర్‌ కూడా ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు  ద్వారా చేసే కొనుగోళ్లపై మరో రూ. 2వేల  క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.  అలాగే రూ.2వేల  ఎక్సేంజ్‌ ఆఫర్‌.  12 నెలల జీరో చార్జ్‌ ఇఎంఐ ఆఫర్‌ కూడా.
 
వన్‌ప్లస్‌ 5 ఆఫర్లు
వన్‌ప్లస్‌ 5  కొనుగోలుపై 100 మంది  లక్కీ కస్టమర్లకు  దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా  గిఫ్ట్‌ ఓచర్‌.  క్లియర్‌ టిప్‌ నుంచి లభిస్తున్న దీని దీని విలువ రూ.25వేల దాకా. (పూర్తి నిబంధనలు షరతులు  అధికారిక వెబ్‌సైట్‌లో) దీంతోపాటు  వోడాఫోన్ ప్లే మూడు నెలల ఉచిత చందాతో పాటు వోడాఫోన్ వినియోగదారులకు 75జీబీ ఉచిత డేటా.  కిండ్లే  నుంచి 500 ప్రమోషన్ క్రెడిట్, లో   రూ. 250  ప్రైమ్‌ వీడియో  అమెజాన్ పే బ్యాలెన్స్‌ ,  ఉచిత 12 నెలల  డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ లభ్యం.  అలాగే రూ.2వేల  ఎక్సేంజ్‌ ఆఫర్

గమనిక: ఈ ఆఫర్లు అమెజాన్‌ లో మాత్రమే లభ్యం. మరిన్ని వివరాలకు కంపెనీ ఆన్‌లైన్‌ స్టోర్లను, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement