OnePlus 3T
-
వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
సాక్షి ముంబై: వన్ ప్లస్ మూడు రోజుల అమ్మకాలకు తెర తీసింది. ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెట్టి వెయ్యిరోజులు పూర్తయిన ఉత్సవాల్లో భాగంగా 1000 డే సేల్‌ను ప్రారంభించింది. ఈ రోజునుంచి (సెప్టెంబర్ 5-7వ తేదీ) గురువారం వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ 3టీ, వన్ ప్లస్ 5 స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. వన్‌ప్లస్ 3టీ వన్‌ప్లస్ 3టీ భారీ తగింపును ఆఫర్ చేస్తోంది. రూ. రూ. 4వేల తగ్గింపుతో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ వెర్షన్‌ను రూ. 25,999, లకే అందిస్తోంది. అంతేకాదు యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు మరో ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై మరో రూ. 2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్. 12 నెలల జీరో చార్జ్ ఇఎంఐ ఆఫర్ కూడా. వన్‌ప్లస్ 5 ఆఫర్లు వన్‌ప్లస్ 5 కొనుగోలుపై 100 మంది లక్కీ కస్టమర్లకు దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా గిఫ్ట్ ఓచర్. క్లియర్ టిప్ నుంచి లభిస్తున్న దీని దీని విలువ రూ.25వేల దాకా. (పూర్తి నిబంధనలు షరతులు అధికారిక వెబ్సైట్లో) దీంతోపాటు వోడాఫోన్ ప్లే మూడు నెలల ఉచిత చందాతో పాటు వోడాఫోన్ వినియోగదారులకు 75జీబీ ఉచిత డేటా. కిండ్లే నుంచి 500 ప్రమోషన్ క్రెడిట్, లో రూ. 250 ప్రైమ్ వీడియో అమెజాన్ పే బ్యాలెన్స్ , ఉచిత 12 నెలల డ్యామేజ్ ఇన్సూరెన్స్ లభ్యం. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్ గమనిక: ఈ ఆఫర్లు అమెజాన్ లో మాత్రమే లభ్యం. మరిన్ని వివరాలకు కంపెనీ ఆన్లైన్ స్టోర్లను, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. -
వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్ల పండుగ
వన్‌ప్లస్ భారత్‌లో 1000 రోజుల పండుగను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఈ సెలబ్రేషన్లో భాగంగా తన స్మార్ట్ఫోన్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు, వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు కంపెనీ చెప్పింది. మంగళవారం అంటే సెప్టెంబర్ 5 నుంచి తన ఆన్లైన్ స్టోర్‌లో ఈ 1000 డేస్ సేల్‌ను మూడు రోజుల పాటు నిర్వహిస్తుంది.. వన్‌ప్లస్ 3టీ 64జీబీ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరలో 25,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చి, దీనిపై తాత్కాలికంగా 4000 రూపాయల ధర తగ్గింపును ప్రకటించింది. దాంతో పాటు యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు 2000 రూపాయల క్యాష్‌బ్యాక్, పాత ఫోన్లతో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మరో 2000 రూపాయల తగ్గింపు లభించనున్నాయి. ఇదే మాదిరి క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్ వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌కు కూడా వర్తించనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా రెండు స్మార్ట్ఫోన్లపై జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ 12 నెలల వరకు ఉండనుంది. 100 లక్కీ కస్టమర్లు క్లియర్‌ట్రిప్ నుంచి దేశీయ విమాన ఓచర్లు అందుకోవచ్చు. 2014 డిసెంబర్లో వన్‌ప్లస్ తన ప్రయాణాన్ని భారత్‌లో ప్రారంభించింది. 21,999 రూపాయలకు తన తొలి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ వన్ను లాంచ్ చేసింది. ఆ సమయంలో ఇన్వెంటరీ ఖర్చులు తక్కువగా ఉండటంతో, వన్‌ప్లస్ ఆహ్వనిత మోడల్ ద్వారానే స్మార్ట్ఫోన్లను విక్రయించేంది. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఈ సిస్టమ్ కనుమరుగైపోయి, అమెజాన్, తన ఆన్లైన్ స్టోర్, ఎక్స్‌క్లూజివ్ సోర్ల ద్వారా ఓపెన్ సేల్ నిర్వహిస్తోంది. -
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్‌ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్‌పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. -
వన్ ప్లస్ 3టీపై క్యాష్ బ్యాక్ ఆఫర్
మార్కెట్లో విశేష ఆదరణ కలిగిన వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్లు ఇక మార్కెట్లో లభ్యం కావడం కష్టమే. ఉత్పత్తిని ఆపివేసిన కంపెనీ స్టాక్ అయిపోయేంతవరకే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఉత్పత్తి ఆపివేయాలని నిర్ణయించిన ఈ ఫోన్ పై కంపెనీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే, రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే వన్ ప్లస్ ఇండియా స్టోర్ లో కొనుగోలు చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్ కు సంబంధించిన 64జీబీ వెర్షన్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని ధర 29,999 రూపాయలు. వన్ ప్లస్ 3 స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడెట్ వెర్షన్ గా వన్ ప్లస్ 3టీ 2016 జూలైలో మార్కెట్లోకి లాంచ్ అయింది. అదేవిధంగా ఈ ఫోన్ అచ్చం వన్ ప్లస్ 3లాగానే ఉంటుంది. ముందస్తు ఫోన్ తో పోలిస్తే కొత్త ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, మెరుగుపరిచిన ఫ్రంట్ కెమెరా దీనిలో ఉన్నాయి. ఉత్పత్తిని ఆపివేస్తున్నప్పటికీ వన్ ప్లస్ 3టీ ఫోనుకు మరింత సాప్ట్ వేర్ అప్ డేట్లను కంటిన్యూగా తీసుకురానున్నట్టూ కంపెనీ చెప్పింది. వన్ ప్లస్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 5ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. -
ఈ ఫోన్ కు ఇక రాంరాం.. తయారీ నిలిపివేత
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ తన నూతన స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 5ను ఈ సమ్మర్ లోనే తీసుకురాబోతుంది. ఈ విషయంపై కంపెనీ ఇప్పటికే స్పష్టతనిచ్చేసింది. ఈ ఫోన్ పై క్లారిటీ ఇచ్చిన వన్ ప్లస్, మరో బ్యాడ్ న్యూస్ కూడా తన బ్లాగ్ లో పేర్కొంది. మార్కెట్లో విశేష ఆదరణ కలిగిన వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని ఆపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది చివరి వరకే వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ భారత్ లో అమ్మకానికి ఉంటుందని కంపెనీ తెలిపింది. 64జీబీ, 128జీబీ వేరియంట్లలో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది. మార్కెట్లో ఉన్న వన్ ప్లస్3, వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్లకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ల సపోర్టును తీసుకొస్తుంటామని కంపెనీ చెప్పింది. కానీ ఎప్పడివరకూ ఈ సపోర్టు తీసుకొస్తుందో పేర్కొనలేదు. బ్లాగ్ పోస్టులో కంపెనీ పేర్కొన్న వివరాలు..''స్టాక్ అయిపోయే లోపలే వన్ ప్లస్ 3టీ కొనుగోలు చేయడండి. కంపెనీ వేర్ హౌజ్ లో ఇంకా కొన్ని యూనిట్లు మాత్రమే మిగిలిఉన్నాయి. ఇక ఈ ఫోన్లను తయారు చేయదలుచుకోలేదు '' అని స్పష్టంగా పేర్కొంది. వన్ ప్లస్ 3టీ ఎక్కువగా విజయవంతమైన స్మార్ట్ ఫోన్లలో ఒకటి. ప్రపంచంలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో కూడా దీనికి మంచి ర్యాంక్ ఉంది. 128జీబీ స్టోరేజ్ కలిగిన వన్ ప్లస్ 3టీ గన్ మెటల్ కలర్ ఆప్షన్ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఇప్పటికే లిస్టు చేయడం ఆపివేసింది. అమెజాన్ ఇండియాలో వన్ ప్లస్ 3 ఫోన్ 1000 రూపాయల ధర తగ్గింపుతో రూ.26,999 వద్ద అందుబాటులో ఉంది. 64జీబీ వెర్షన్ లో కేవలం సాఫ్ట్ గోల్డ్ వెర్షన్ స్టాక్ మాత్రమే ఉంది. వన్ ప్లస్ 3టీ స్మార్ట్ ఫోన్ కూడా 64జీబీ వెర్షన్ లో గన్ మెటల్ గ్రే, సాఫ్ట్ గోల్డ్ వెర్షన్లలోనే అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ కలర్ ఆప్షన్ ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్. -
'వన్ ప్లస్ 3టీ మిడ్నైట్ బ్లాక్' సేల్ నేటినుంచే
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ నూతనంగా లాంచ్ చేసిన వన్ ప్లస్ 3టీ మిడ్నైట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ శుక్రవారం నుంచి భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. కేవలం 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ లోనే అందుబాటులో ఉండే దీని ధర రూ.34,999. అయితే ఎన్ని డివైజ్‌లను విక్రయానికి ఉంచుతుందో కంపెనీ ప్రకటించలేదు. వన్ ప్లస్ ఇండియా స్టోర్, అమెజాన్, వన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ బెంగళూరులో ఇది మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ఫోన్ ను విక్రయించడం ప్రారంభించింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ఫోన్ అచ్చం వన్ ప్లస్ 3టీ బ్లాక్ కొలెట్టే ఎడిషన్ మాదిరే ఉండనుంది. యూనిక్ కలర్లకు మారుపేరుగా నిలుస్తున్న వన్ ప్లస్.. ఈ ఫోన్‌ను ప్రస్తుతం ఓ ప్రత్యేక రంగులో మార్కెట్లోకి తీసుకొచ్చింది. 128జీబీ ఇంటర్నెట్ స్టోరేజ్ మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ ఫోన్ కు ఒకేలా ఉంటాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821, 6జీబీ ర్యామ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ డ్యాష్ ఛార్జ్ దీని ప్రత్యేకతలు. అంతేకాక వన్ ప్లస్ 3కి స్వల్ప మార్పులతో ఈ ఫోన్ ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వన్ ప్లస్ 3 కంటే వేగవంతమైన ఎస్ఓసీ, స్టోరేజ్ పెంపు, ఫ్రంట్ కెమెరాకు మెరుగులు, పెద్ద బ్యాటరీ వంటివి దీనిలో మార్పులు. -
స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్!
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 2017లో 'గ్రేట్ ఇండియన్ సేల్' లో స్మార్ట్ ఫోన్లపై స్వీటెస్ట్ డీల్స్ ను ప్రకటించింది. జనవరి 20 శుక్రవారం అర్థరాత్రి నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగనున్న సేల్ లో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, పీసీలు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్, బుక్స్, టోయ్స్, యాక్ససరీస్ లపై కంపెనీ డిస్కౌంట్లు అందిస్తోంది. ముఖ్యంగా మోటో జీ ప్లస్, లెనోవా జెడ్2 ప్లస్, ఆపిల్ ఐఫోన్ -5, కిండ్లే పేపర్ వైట్ తదితరాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. మోటో జీ4 ప్లస్ (16 జీబీ) మోటో జీ4 ప్లస్ (16 జీబీ)పై రూ. 2 వేలు తగ్గింపు ధరతో రూ.11,499లకే అందించనుంది. (అసలు ధర రూ.13,499) పాత ఫోన్ తో ఎక్సేంజ్ చేసుకుంటే రూ. 8,550 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంది. లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ) లెనోవా జెడ్2 ప్లస్ (64 జీబీ) ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే అందించిన 2 వేల తగ్గింపుతో రూ.17,499కు లభ్యం. అలాగే రూ. 8,550 దాకా ఎక్సేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐ ఫోన్ 5 ఎస్ (64 జీబీ) యాపిల్ ఐ ఫోన్ 5 ఎస్ (64 జీబీ) రూ.15,999 లకే అందిస్తోంది. అసలు ధర సుమారు రూ.25,000. క్రెడిట్ కార్డు దారులకు ఈఎంఐ ప్రారంభ ధర రూ.1,428గా ఉంది. వన్ ప్లస్ 3 టీ (64 జీబీ) వన్ ప్లస్ 3 టీ (64 జీబీ) రూ. 29,999 లకు అందుబాటులో ఉంది. అసలు ధరపై రూ.2వేల తగ్గింపుతోపాటు రూ.10,550 దాకా ఎక్సేంజ్ డిస్కౌంట్. సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీ మరో స్వీటెస్ట్ డీల్ కూడా అమెజాన్ అందిస్తోంది. సాన్యో 43 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ టీవీపై రూ.8,500ల భారీ తగ్గింపు ఆఫర్ కల్పించింది. అసలు ధర రూ.33,990 కాగా అమెజాన్ ఈ ఆఫర్ ద్వారా రూ.23,490 లకే అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 18,000 వరకూ ఎక్సేంజ్ డిస్కౌంట్ సౌలభ్యం కూడా ఉంది. ఇవేకాదు.. ఇతర కెమెరాలు, గేమింగ్ కన్సోల్, పేపర్ వైట్స్ పై ఆసక్తికర డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్ సైట్ ను గమనించాల్సిందే..