వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ల పండుగ
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ల పండుగ
Published Sat, Sep 2 2017 10:01 AM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM
వన్‌ప్లస్ భారత్‌లో 1000 రోజుల పండుగను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఈ సెలబ్రేషన్‌లో భాగంగా తన స్మార్ట్‌ఫోన్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు, వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు కంపెనీ చెప్పింది. మంగళవారం అంటే సెప్టెంబర్ 5 నుంచి తన ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ 1000 డేస్ సేల్‌ను మూడు రోజుల పాటు నిర్వహిస్తుంది.. వన్‌ప్లస్ 3టీ 64జీబీ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరలో 25,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చి, దీనిపై తాత్కాలికంగా 4000 రూపాయల ధర తగ్గింపును ప్రకటించింది. దాంతో పాటు యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు 2000 రూపాయల క్యాష్‌బ్యాక్, పాత ఫోన్లతో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మరో 2000 రూపాయల తగ్గింపు లభించనున్నాయి.
ఇదే మాదిరి క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్ వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌కు కూడా వర్తించనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా రెండు స్మార్ట్‌ఫోన్లపై జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ 12 నెలల వరకు ఉండనుంది. 100 లక్కీ కస్టమర్లు క్లియర్‌ట్రిప్ నుంచి దేశీయ విమాన ఓచర్లు అందుకోవచ్చు. 2014 డిసెంబర్‌లో వన్‌ప్లస్ తన ప్రయాణాన్ని భారత్‌లో ప్రారంభించింది. 21,999 రూపాయలకు తన తొలి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ వన్‌ను లాంచ్ చేసింది. ఆ సమయంలో ఇన్వెంటరీ ఖర్చులు తక్కువగా ఉండటంతో, వన్‌ప్లస్ ఆహ్వనిత మోడల్ ద్వారానే స్మార్ట్‌ఫోన్లను విక్రయించేంది. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఈ సిస్టమ్ కనుమరుగైపోయి, అమెజాన్, తన ఆన్‌లైన్ స్టోర్, ఎక్స్‌క్లూజివ్ సోర్ల ద్వారా ఓపెన్ సేల్ నిర్వహిస్తోంది.
Advertisement
Advertisement