2 రోజుల్లోనే ఆ ఫోన్ కు 3లక్షల రిజిస్ట్రేషన్లు | OnePlus 5 registrations cross 3,00,000 in two days | Sakshi
Sakshi News home page

2 రోజుల్లోనే ఆ ఫోన్ కు 3లక్షల రిజిస్ట్రేషన్లు

Published Sat, Jun 17 2017 5:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

OnePlus 5 registrations cross 3,00,000 in two days



వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్... ఎన్నో రోజుల నుంచి ఇటు స్మార్ట్ ఫోన్ లవర్స్ ను, అటు టెక్ వర్గాలను ఊరిస్తోంది. ఇక ఎట్టకేలకు ఆ ఫోన్ ను జూన్ 20న లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ సిద్ధమైంది. లాంచింగ్ కు ముందే ఈ కంపెనీ చైనాలో ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది.అయితే కంపెనీ అంచనావేసిన  ఊహించిన దానికంటే భారీ  ఎత్తున్న ఈ ఫోన్ కు రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగుతోంది. చైనీస్ రిటైలర్ జింగ్డాంగ్.కామ్ లో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్లను కంపెనీ స్వీకరిస్తోంది. ఈ రిటైలర్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన 48 గంటల వ్యవధిలోనే మూడు లక్షల రిజిస్ట్రేషన్లు ఈ ఫోన్ క్రాష్ చేసిందని తెలిసింది. అంతేకాక ఈ సంఖ్య మరింత దూసుకుపోతుందని కంపెనీ చెప్పింది.
 
పేరెంట్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఆర్11 డిజైన్ మాదిరిగానే వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఉండబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు నిరాశపరిచినప్పటికీ,  ఈ ఫోన్ క్రేజ్ మాత్రం భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన రూమర్ల ప్రకారం వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్  స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్ తో 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుందని టాక్. 128జీబీ స్టోరేజ్ ను ఈ ఫోన్ లో కంపెనీ ఆఫర్ చేస్తుందట. కంపెనీ టీజ్ చేసిన ఈ హ్యాండ్ సెట్ టీజర్ ప్రకారం ఈ ఫోన్ కు డ్యూయల్ రియర్ కెమెరా ఉండబోతుందని ధృవీకరణ అయింది. యూఎఫ్ఎస్ స్టోరేజ్ కూడా ఉండబోతుందని కంపెనీ అధికారికంగా చెప్పేసింది. గ్లోబల్ గా ఈ ఫోన్ జూన్ 20న లాంచ్ కాబోతుండగా... ఇండియాతో పాటు పలు ఆసియన్ మార్కెట్లలో జూన్ 22న లాంచ్ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement