OnePlus 5
-
వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
సాక్షి ముంబై: వన్ ప్లస్ మూడు రోజుల అమ్మకాలకు తెర తీసింది. ఇండియాలో కార్యకలాపాలు మొదలు పెట్టి వెయ్యిరోజులు పూర్తయిన ఉత్సవాల్లో భాగంగా 1000 డే సేల్‌ను ప్రారంభించింది. ఈ రోజునుంచి (సెప్టెంబర్ 5-7వ తేదీ) గురువారం వరకు కొనసాగనున్న ఈ స్పెషల్ సేల్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా ప్రత్యేక డిస్కౌంట్లను , ఇతర ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్ 3టీ, వన్ ప్లస్ 5 స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. వన్‌ప్లస్ 3టీ వన్‌ప్లస్ 3టీ భారీ తగింపును ఆఫర్ చేస్తోంది. రూ. రూ. 4వేల తగ్గింపుతో 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ వెర్షన్‌ను రూ. 25,999, లకే అందిస్తోంది. అంతేకాదు యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు మరో ఆఫర్ కూడా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై మరో రూ. 2వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్. 12 నెలల జీరో చార్జ్ ఇఎంఐ ఆఫర్ కూడా. వన్‌ప్లస్ 5 ఆఫర్లు వన్‌ప్లస్ 5 కొనుగోలుపై 100 మంది లక్కీ కస్టమర్లకు దేశీయ విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా గిఫ్ట్ ఓచర్. క్లియర్ టిప్ నుంచి లభిస్తున్న దీని దీని విలువ రూ.25వేల దాకా. (పూర్తి నిబంధనలు షరతులు అధికారిక వెబ్సైట్లో) దీంతోపాటు వోడాఫోన్ ప్లే మూడు నెలల ఉచిత చందాతో పాటు వోడాఫోన్ వినియోగదారులకు 75జీబీ ఉచిత డేటా. కిండ్లే నుంచి 500 ప్రమోషన్ క్రెడిట్, లో రూ. 250 ప్రైమ్ వీడియో అమెజాన్ పే బ్యాలెన్స్ , ఉచిత 12 నెలల డ్యామేజ్ ఇన్సూరెన్స్ లభ్యం. అలాగే రూ.2వేల ఎక్సేంజ్ ఆఫర్ గమనిక: ఈ ఆఫర్లు అమెజాన్ లో మాత్రమే లభ్యం. మరిన్ని వివరాలకు కంపెనీ ఆన్లైన్ స్టోర్లను, అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. -
వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లపై ఆఫర్ల పండుగ
వన్‌ప్లస్ భారత్‌లో 1000 రోజుల పండుగను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఈ సెలబ్రేషన్లో భాగంగా తన స్మార్ట్ఫోన్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు, వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు కంపెనీ చెప్పింది. మంగళవారం అంటే సెప్టెంబర్ 5 నుంచి తన ఆన్లైన్ స్టోర్‌లో ఈ 1000 డేస్ సేల్‌ను మూడు రోజుల పాటు నిర్వహిస్తుంది.. వన్‌ప్లస్ 3టీ 64జీబీ స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరలో 25,999 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చి, దీనిపై తాత్కాలికంగా 4000 రూపాయల ధర తగ్గింపును ప్రకటించింది. దాంతో పాటు యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుదారులకు 2000 రూపాయల క్యాష్‌బ్యాక్, పాత ఫోన్లతో దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మరో 2000 రూపాయల తగ్గింపు లభించనున్నాయి. ఇదే మాదిరి క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్ ఆఫర్ వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌కు కూడా వర్తించనున్నాయి. ఈ సేల్‌లో భాగంగా రెండు స్మార్ట్ఫోన్లపై జీరో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ 12 నెలల వరకు ఉండనుంది. 100 లక్కీ కస్టమర్లు క్లియర్‌ట్రిప్ నుంచి దేశీయ విమాన ఓచర్లు అందుకోవచ్చు. 2014 డిసెంబర్లో వన్‌ప్లస్ తన ప్రయాణాన్ని భారత్‌లో ప్రారంభించింది. 21,999 రూపాయలకు తన తొలి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ వన్ను లాంచ్ చేసింది. ఆ సమయంలో ఇన్వెంటరీ ఖర్చులు తక్కువగా ఉండటంతో, వన్‌ప్లస్ ఆహ్వనిత మోడల్ ద్వారానే స్మార్ట్ఫోన్లను విక్రయించేంది. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ ఈ సిస్టమ్ కనుమరుగైపోయి, అమెజాన్, తన ఆన్లైన్ స్టోర్, ఎక్స్‌క్లూజివ్ సోర్ల ద్వారా ఓపెన్ సేల్ నిర్వహిస్తోంది. -
అమెజాన్ ప్రైమ్ డే సేల్: ఆఫర్ల పండుగ
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఆఫర్ల పండుగకు తెరలేపింది. తన తొలి ప్రైమ్ డే సేల్‌ను ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి భారత్‌లో ప్రారంభించింది. 12 ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ నేడు ఈ స్పెషల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఇతర వస్తువులపై డిస్కౌంట్లను, ఆఫర్లను, డీల్స్‌ను అమెజాన్ ప్రకటించింది. 30 గంటల పాటు ఈ సేల్ జరుగబోతుంది. అంటే రేపు అర్థరాత్రి వరకు ఈ సేల్ కొనసాగనుంది. అయితే ఇది ఎక్స్‌క్లూజివ్‌గా రూ.499తో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్మెంబర్లకు మాత్రమే. ఈ సేల్‌లో ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు దేశం దేశంలోనే భిన్నంగా ఉండనున్నాయి. భారత్‌తో పాటు నేడు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్‌లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్‌లో కూడా ఎక్స్‌క్లూజివ్‌గా నిర్వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ డీల్స్.. స్మార్ట్ఫోన్లను తీసుకున్నట్లు అయితే, షియోమి లవర్స్ ఫేమస్ ఫోన్ రెడ్మి 4ను ఓపెన్ సేల్ కింద నేటి సాయంత్రం 5 గంటల నుంచే అందుబాటులో ఉంచింది. అది ఎక్స్‌క్లూజివ్‌గా తన ప్రైమ్ మెంబర్లకు మాత్రమే. అంతేకాక వన్ ప్లస్ తాజాగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపైన 2000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.. ఈ ఆఫర్ కేవలం డివైజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నవారికే. ఇప్పటికే వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొనుగోలుచేసిన వారికి 19వేల రూపాయల తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఇక ఈ స్పెషల్ సేల్ సందర్బంగా మరో రెండు వేల రూపాయల తగ్గింపును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డు యూజర్లకు మరో రూ.2000 తగ్గింపును అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. మోటోఫోన్లపై రూ.1000 తగ్గింపును, హానర్ 6ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌పై 3000 రూపాయల తగ్గింపును అమెజాన్ ఆఫర్ చేస్తోంది. కిచెన్, హోమ్ అప్లయెన్స్‌పై 45 శాతం తగ్గింపును ఇస్తోంది. అమెజాన్ ఫైర్‌టీవీ స్టిక్ ధరను 1000 రూపాయల వరకు తగ్గించింది. అంతేకాక 499 రూపాయల క్యాష్ బ్యాక్‌ను ఇస్తున్నట్టు అమెజాన్ చెప్పింది. ఫిట్‌బిట్ ఫిట్నెస్ ట్రాకర్లపై 40 శాతం తగ్గింపు, వస్త్రాలపై 70 శాతం తగ్గింపు, స్విగ్గీ ఫుడ్ డెలవరీపై రూ.150 తగ్గింపు, బుక్‌మైషోలో మూవీ టిక్కెట్లను కొనుగోలుచేసిన వారికి రూ.200 వరకు తగ్గింపు వంటి పలు డీల్స్‌ను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొనేవారికి 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నారు. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్‌లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉంటాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు.30 కొత్త బ్రాండ్లను కూడా ఈ సేల్‌లో లాంచ్చేసింది. -
అదిరిపోయే ఫీచర్లతో వన్ ప్లస్5 లాంచ్
ఎంతో కాలంగా వేచిచూసిన వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మంగళవారం గ్లోబల్ గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇప్పటివరకు ఎన్నో రూమర్లు మార్కెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే అంతా కొత్తదనంతో కూడిన డిజైన్, తాజా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లతో కంపెనీ ఈ ఫోన్ ను కస్టమర్లకు ముందుకు ప్రవేశపెట్టింది. కేవలం డిజైన్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లు మాత్రమేకాక, కెమెరా కూడా ఎంతో అద్భుతమైనదిగా అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 479 డాలర్లు, అంటే దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం 30,958.97రూపాయలు. గ్లోబల్ గా జూన్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని ఈ చైనీస్ కంపెనీ చెప్పింది. గ్లోబల్ గా మంగళవారం లాంచ్ అయిన ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లో జూన్ 22న ప్రవేశపెట్టబోతున్నారు. భారత్ లో దీన్ని ప్రారంభ ధర రూ.32,999గా ఉండబోతుందని తెలుస్తోంది. టాప్ ఎండ్ మోడల్ రూ.37,999గా నిర్ణయించనున్నారని తెలుస్తోంది. భారత్ లో మాత్రం లాంచ్ అయిన రోజు నుంచే తమ ప్లాట్ ఫామ్ పై విక్రయానికి రాబోతుందని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. ముంబైలో ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ బ్రాండు అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకున్న వన్ ప్లస్ ఫోన్లలో పలుచనైన ఫోన్ ఇదేనని, అంతేకాక అత్యంత పవర్ ఫుల్ ఫోన్ కూడా ఇదేనని లాంచింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. గ్లోబల్ గా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ ప్లే 1920x1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ 2.5డీ కార్నింగ్ గ్లాస్ 5 2.45గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ ఆప్షన్లు 128జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు(నాన్-ఎక్స్ పాండబుల్) ఆండ్రాయిడ్ 7.1.1 నుగట్ ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 16మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 20 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా(డ్యూయల్ రియర్ కెమెరాలు) సెల్ఫీ కోసం ముందు వైపు 16మెగాపిక్సెల్ కెమెరా 3,300ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్) డ్యాష్ ఛార్జర్(కేవలం 30నిమిషాల్లో 60శాతం ఛార్జింగ్) ఫుల్-మెటల్ యూనిబాడీ డిజైన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వన్ ప్లస్ 3టీ కంటే 20 శాతం పొడవైనది -
2 రోజుల్లోనే ఆ ఫోన్ కు 3లక్షల రిజిస్ట్రేషన్లు
వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్... ఎన్నో రోజుల నుంచి ఇటు స్మార్ట్ ఫోన్ లవర్స్ ను, అటు టెక్ వర్గాలను ఊరిస్తోంది. ఇక ఎట్టకేలకు ఆ ఫోన్ ను జూన్ 20న లాంచ్ చేసేందుకు వన్ ప్లస్ సిద్ధమైంది. లాంచింగ్ కు ముందే ఈ కంపెనీ చైనాలో ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది.అయితే కంపెనీ అంచనావేసిన ఊహించిన దానికంటే భారీ ఎత్తున్న ఈ ఫోన్ కు రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగుతోంది. చైనీస్ రిటైలర్ జింగ్‌డాంగ్.కామ్ లో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్లను కంపెనీ స్వీకరిస్తోంది. ఈ రిటైలర్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన 48 గంటల వ్యవధిలోనే మూడు లక్షల రిజిస్ట్రేషన్లు ఈ ఫోన్ క్రాష్ చేసిందని తెలిసింది. అంతేకాక ఈ సంఖ్య మరింత దూసుకుపోతుందని కంపెనీ చెప్పింది. పేరెంట్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఆర్11 డిజైన్ మాదిరిగానే వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఉండబోతుందంటూ ఇప్పటికే పలు రిపోర్టులు నిరాశపరిచినప్పటికీ, ఈ ఫోన్ క్రేజ్ మాత్రం భారీగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన రూమర్ల ప్రకారం వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్ తో 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుందని టాక్. 128జీబీ స్టోరేజ్ ను ఈ ఫోన్ లో కంపెనీ ఆఫర్ చేస్తుందట. కంపెనీ టీజ్ చేసిన ఈ హ్యాండ్ సెట్ టీజర్ ప్రకారం ఈ ఫోన్ కు డ్యూయల్ రియర్ కెమెరా ఉండబోతుందని ధృవీకరణ అయింది. యూఎఫ్ఎస్ స్టోరేజ్ కూడా ఉండబోతుందని కంపెనీ అధికారికంగా చెప్పేసింది. గ్లోబల్ గా ఈ ఫోన్ జూన్ 20న లాంచ్ కాబోతుండగా... ఇండియాతో పాటు పలు ఆసియన్ మార్కెట్లలో జూన్ 22న లాంచ్ చేస్తున్నారు. -
వన్‌ప్లస్ 5 లాంచింగ్: భలే ఆఫర్, ధర ఎంతంటే?
ముంబై: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్ ప్లస్ 5'ను జూన్ 22న విడుదల చేయనుంది. న్యూయార్క్‌లో జూన్ 20న లాంచ్ అవుతుండగా భారత్‌లో 22న విడుదల. హై-ఎండ్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలో అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్, సరికొత్తగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. దీని ధర 6జీబీ, 64జీబీ స్టోరేజ్ (బేస్ వేరియంట్) ధర రూ. 37,999గాను, 8జీబీ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వన్‌ప్లస్ ఫౌండర్, సీఈవో పీటే లా దీన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర ఆఫర్ ఉంది. జూన్ 22న ముంబైలో జరిగే లాంచింగ్ ఈవెంట్‌కు హాజరు కావాలనుకుంటే ఓ బంపర్ ఆఫర్ కూడా ఉంది. దీనికి జూన్ 12న వన్‌ప్లస్ అధికారిక సైట్ లో ఒక వెల్కం ప్యాక్‌ను కొనుగోలు చేయాలి. టీ షర్ట్ సహా కాంబో ఆఫర్ తో అందించే ఇన్వైట్ బాక్స్‌ను కస్టమర్లు రూ.999 లకు కొనుగోలు చేయాలి. ఇందులో దాదాపు పదివేల రూపాయల విలువ చేసే వస్తువులను ఉచితంగా అందిస్తోంది. 1. రూ.3990 విలువ చేసే బ్రాండ్-న్యూ స్పెషల్ బ్యాక్‌ప్యాక్ విలువ 2. యునిప్లోస్ సన్ గ్లాసెస్ , వీటి విలువ రూ. 6000 3. టీ -షర్టు ఈ బాక్స్‌ను వెంటనే కస్లమర్ల ఇంటికి వెంటనే రవాణా చేయబడుతుంది.దీన్ని స్వీకరించిన తర్వాత, కస్టమర్ల వన్ ప్లస్ ఖాతాకు రూ. 999 క్రెడిట్ అవుతుంది. ఈ కోడ్‌ను ప్లన్ ప్లస్ 5 కొనుగోలు సమయంలో వాడుకోవచ్చు. దీన్ని మూడు రోజుల్లోపు ఉపయోగించు కోవాలి. దీంతో పాటు మరొకరిని ఆహ్వానించేందుకు వీలుగా ఒక కోడ్ కూడా అందుతుంది. దీన్ని మన స్నేహితులకు షేర్ చేయవచ్చు. ఈకోడ్ ద్వారా డైరెక్ట్ గా ఫోన్ కొనుగోలు చేయవచ్చన్నమాట. మరోవైపు జూన్ 22వ తేదీన ఈ ఫోన్ భారత్‌లో విడుదల కానున్ను వన్ ప్లస్ 5 అదే రోజున ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ వేరియెంట్ విక్రయించనుంది. రెండు కెమెరాలు ఖాయం అని తెలసినప్పటికీ ఎంపీ ఎంత అనేది స్పష్టం కాలేదు. ట్విట్టర్ ఉంచిన ఇమేజ్ ప్రకారం బ్లాక్ కలర్ లో వస్తున్న వన్ ప్లస్ 5 లో రెండు రియర్ కెమెరాలను అమర్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిన్న టీజర్‌ను కూడా వన్‌ప్లస్ ట్విట్టర్లో విడుదల చేసింది. వన్ ప్లస్ 5 ఫీచర్లు స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, 128 జీబీ 3300 ఎంఏహెచ్‌బ్యాటరీ Coming Soon. #OnePlus5 https://t.co/XWfMtBbOFg pic.twitter.com/HULFUiW6EB — OnePlus (@oneplus) June 9, 2017 -
కన్ఫామ్ : వన్ ప్లస్ 5 లాంచ్ ఆ రోజే
హై-ఎండ్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలో అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా కంపెనీ వన్ ప్లస్, సరికొత్తగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే ఈ ఫ్లాగ్ షిప్ పై వచ్చిన రూమర్లతో విసుగెత్తిపోయిన కస్టమర్లకు కంపెనీ గుడ్ న్యూస్ అందించింది. తమ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీలను వన్ ప్లస్ అధికారికంగా విడుదల చేసింది. జూన్ 20న ఈ ఫోన్ విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. అదేవిధంగా భారత్ లో కూడా ముంబై ఈవెంట్ గా జూన్ 22న లాంచ్ చేస్తామని వన్ ప్లస్ పేర్కొంది. కంపెనీ వెబ్ సైట్ లో జూన్20న రాత్రి 9.30కు ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్న రోజే న్యూయార్క్ లో పాప్-అప్ ఈవెంట్ ను కంపెనీ నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పెయి, మార్కస్ బ్రౌన్లీ, స్పెషల్ గెస్ట్ లు పాల్గొననున్నారు. ఈ పాప్-అప్ ఈవెంట్లను పారిస్, ఆమ్ స్టర్డామ్, బెర్లిన్, కోపెన్హాగన్ లలో కూడా తర్వాత రోజు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. భారత్ లో లాంచ్ ఈవెంట్ ను వేరుగా జరుపనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక్కడ కూడా ఇండియా సైట్ లో లాంచ్ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. లీకేజీ వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ కు 23మెగాపిక్సెల్ రియర్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 7.1 నోగట్, 5.5 అంగుళాల డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ ఇన్ బిల్డ్ స్టోరేజ్ ఆప్షన్లలో ఇది వస్తుందని సమాచారం. వెనుక వైపు రెండు కెమెరాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది కానీ దీనిపై ఇంకా స్పష్టతలేదు. -
ఐఫోన్7 వరస్ట్ ఫీచర్‌ను అది కాఫీ కొట్టింది!
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్... త్వరలోనే ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్ ప్లస్ 5 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేయనుందట. 2017లో తీసుకురాబోతున్నారంటూ ఎక్కువగా అంచనావేసిన ఫోన్లలో ఈ వన్ ప్లస్5 ఒకటి. ఐఫోన్ లెవల్ క్వాలిటీలో దీన్ని లాంచ్ చేస్తారని టెక్ అభిమానులు అంచనావేస్తున్నారు. కొన్ని ఫీచర్లను సైతం ఆపిల్ నుంచి వన్ ప్లస్ కాఫీకొడుతుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భాగంగానే ఐఫోన్ 7లో లేని ఓ ఫీచర్ ను, వన్ ప్లస్5 కూడా తన స్మార్ట్ ఫోన్ లో అందించడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి. అదేమిటో తెలుసా? 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్. హెడ్ ఫోన్ జాక్ లేకుండానే ఐఫోన్7 మాదిరిగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి రానుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. అంటే ఇది కేవలం బ్లూటూత్ హెడ్ ఫోన్లపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాయి. హెడ్ ఫోన్ జాక్ అందించకపోతుండటంతో, ఐఫోన్ 7 మాదిరిగా, వన్ ప్లస్ కూడా తన స్మార్ట్ ఫోన్ లో మరేదైనా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తారా? అని టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వన్ ప్లస్ 5కు సంబంధించిన ఇమేజ్ లను చైనీస్ సోషల్ మీడియా సైట్ వైబో షేర్ చేసింది. లీక్ చేసిన ఈ ఫోటోలో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ లెన్స్ కెమెరా, విలక్షణమైన వన్ ప్లస్ లోగో కనిపిస్తోంది.. కానీ ఈ విషయంపై వన్ ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు హెడ్ ఫోన్ జాక్ ఇస్తుందా ? లేదా? అన్నది అప్పుడే క్లారిటీగా తెలుస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. ఐఫోన్ 7లో హెడ్ ఫోన్ జాక్స్ లేకపోవడం టెక్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
4 వారికి బ్యాడ్ అట..అందుకే 5 వస్తోంది
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు 'వన్ ప్లస్' తన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో 2017లో వన్ ప్లస్ 5ను త్వరలో విడుదల చేయనుంది. గతంలో వన్ ప్లస్ 3 వచ్చిన దృష్ట్యా దాని తరువాత వన్ ప్లస్ 4 వస్తుందని అందరూ భావించారు. కానీ, ప్రస్తుతం నెట్ లోహల్చల్ చేస్తున్న లీక్స్ ప్రకారం వన్ ప్లస్ సంస్థ యూజర్లందరికీ షాక్ ఇస్తూ త్వరలో వన్ ప్లస్ 5ను విడుదల చేయనుంది. వన్ ప్లస్ 3టీతో పోలిస్తే కొంచెం ఎక్కువ ధరలోనే దీన్ని లాంచ్ చేయనుంది. అయితే శాంసంగ్, యాపిల్, గూగుల్ తో సమానంగా దూసుకుపోతున్న వన్‌ప్లస్ శాంసంగ్ ఎస్8, ఆపిల్ 7 తో పోలిస్తే రీజనబుల్ ప్రైస్‌లోనే అందించనుందని తెలుస్తోంది. 8జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేయనుందని మరోరిపోర్టు నివేదించింది. అధికారికంగా లాంచ్ కాకముందే ఇంకెన్ని రూమర్లు,అంచనాలు చెలురేగుతాయో చూడాలి. చైనాలో 4 అంకెను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఆ అంకె వల్ల అంతా చెడు జరుగుతుందని వారు విశ్వసిస్తారట. ఈ నేపథ్యంలోనే చైనా మొబైల్‌దిగ్గజం వన్ ప్లస్ తన ఫోన్ సిరీస్‌లో వన్ ప్లస్ 4ను విడుదల చేయడం లేదని సమాచారం. ఈ ఫ్లాగ్షిప్ డివైస్ పై స్పెసిఫికేషన్స్ అంచనాలు ఇలా ఉన్నాయి. వన్ ప్లస్ 5 ఫీచర్లు 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్డీ డిస్ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీ, 8 జీబీ ర్యామ్ 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0 -
వన్ ప్లస్ సంచలనం: 8 జీబీ ర్యామ్‌తో మొబైల్
చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వన్ ప్లస్ తక్కువ ధరలో హైఎండ్ ఫోన్లను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ 3 ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో ఫోన్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా 8 జీబీ ర్యామ్‌తో వన్ ప్లస్ 5ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది. అదేంటి వన్ ప్లస్ 4ని విడుదల చేయకుండానే వన్‌ప్లస్ 5కి కంపెనీ వెళ్లింది ఏంటా? అనుకుంటున్నారా.. చైనాలో నాలుగు అంకెను దురదృష్టంగా భావిస్తారు. సో.. వన్ ప్లస్ 5ని మార్కెట్లోకి రానుంది. ఏప్రిల్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.30 వేల వరకూ ఉండొచ్చు. వన్‌ప్లస్ 5 ఫీచర్లు: ర్యామ్: 8 జీబీ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఆండ్రాయిడ్ 7.0(నౌగాట్) కెమెరా: 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సల్ వాటర్‌ప్రూఫ్ గోల్డ్, వైట్, బ్లాక్, సెరామిక్ రంగుల్లో మొబైల్ 5.5 ఇంచుల హెచ్డీ అమోఎల్ఈడీ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్