వన్ ప్లస్ సంచలనం: 8 జీబీ ర్యామ్‌తో మొబైల్
వన్ ప్లస్ సంచలనం: 8 జీబీ ర్యామ్‌తో మొబైల్
Published Tue, Feb 28 2017 10:53 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వన్ ప్లస్ తక్కువ ధరలో హైఎండ్ ఫోన్లను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ 3 ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో ఫోన్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా 8 జీబీ ర్యామ్‌తో వన్ ప్లస్ 5ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది. అదేంటి వన్ ప్లస్ 4ని విడుదల చేయకుండానే వన్‌ప్లస్ 5కి కంపెనీ వెళ్లింది ఏంటా? అనుకుంటున్నారా.. చైనాలో నాలుగు అంకెను దురదృష్టంగా భావిస్తారు. సో.. వన్ ప్లస్ 5ని మార్కెట్లోకి రానుంది. ఏప్రిల్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.30 వేల వరకూ ఉండొచ్చు.
వన్‌ప్లస్ 5 ఫీచర్లు:
ర్యామ్: 8 జీబీ
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
64 జీబీ ఇంటర్నల్ మెమరీ
ఆండ్రాయిడ్ 7.0(నౌగాట్)
కెమెరా: 16 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సల్
వాటర్‌ప్రూఫ్
గోల్డ్, వైట్, బ్లాక్, సెరామిక్ రంగుల్లో మొబైల్
5.5 ఇంచుల హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్ప్లే
ఫింగర్ ప్రింట్ సెన్సార్
Advertisement