వన్‌ప్లస్ కో ఫౌండర్ కార్ల్ పై వన్‌ప్లస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కార్ల్‌పై నథింగ్ అనే కంపెనీ స్థాపించాడు. నథింగ్ కేవలం టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. వీటితో పాటుగా స్మార్ట్‌ఫోన్ల తయారీపై కూడా నథింగ్ ఫోకస్ పెట్టింది. తాజాగా నథింగ్ స్మార్ట్‌ఫోన్లను కూడా త్వరలోనే లాంచ్‌చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..!
స్మార్ట్‌ఫోన్ల తయారీలో భాగంగా అమెరికన్ చిప్ మేకర్ క్వాల్‌కమ్‌తో నథింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నథింగ్ స్మార్ట్‌ఫోన్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30 వేల కంటే తక్కువగా ఉండనుంది.
నథింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్సే కాకుండా నథింగ్ పవర్(1) పేరుతో పవర్‌బ్యాంకునుకూడా లాంచ్ చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో కార్ల్‌పై వన్‌ప్లస్ సంస్థను వీడిపోయాడు.
We’re excited to be working with @Qualcomm to power our growing tech ecosystem.
— Nothing (@nothing) October 13, 2021
Over the last year, we’ve seen that there’s a space for a challenger in the tech world. This partnership will play a big role in achieving our vision.
Here’s to the future.
Comments
Please login to add a commentAdd a comment