Nokia XR20 Launch In India: హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్ భారత మార్కెట్లలోకి త్వరలోనే నోకియా ఎక్స్‌ఆర్20 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల అక్టోబర్ 20 నుంచి ప్రీ బుకింగ్స్ ఆర్డర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూలైలో భారత్ మినహా మిగతా దేశాల్లో నోకియా ఎక్స్‌ఆర్20ను హెచ్‌ఎమ్‌డీ లాంచ్ చేసింది. నోకియా ఎక్స్‌ఆర్20 స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత టఫెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా అభివర్ణించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్‌తో రావడంతో సుమారు ఒక గంట లోపు నీటిలో ఉన్నకూడా పనిచేసే సామర్ద్యం నోకియా ఎక్స్‌ఆర్20 సొంతం. భారత మార్కెట్లలో నోకియా ఎక్స్ ఆర్20 స్మార్ట్‌ఫోన్ ధర 43 వేల నుంచి 50 వేల మధ్య ఉండనున్నుట్ల తెలుస్తోంది.
చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు
నోకియా XR20 ఫీచర్స్ (అంచనా)
- 6.67-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్
- 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 11
- 48+13 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా
- 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- 4,630 mAh బ్యాటరీ
- 18 W వైర్డ్ ఛార్జింగ్
- 5G సపోర్ట్
- NavIC ఇండియన్ జీపీఎస్ సపోర్ట్
- యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్
Brace yourselves to meet the toughest device you'll ever see. Nokia XR20 pre-booking starts on 20th October.#NokiaXR20 #LoveTrustKeep pic.twitter.com/S4PFknERoX
— Nokia Mobile India (@NokiamobileIN) October 15, 2021
Comments
Please login to add a commentAdd a comment