ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో ఎక్స్ సిరీస్‌లో భాగంగా భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. వివో ఎక్స్70 , వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ భారత మార్కెట్‌లోకి ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వివో ఎక్స్70 ప్రో ప్లస్ 8జీబీ, 12జీబీ ర్యామ్ వేరియంట్స్‌తో రానున్నాయి. ఈ మోడళ్లు 128జీబీ, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు జీస్ టి సర్టిఫైడ్ కోటింగ్‌తో రానున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు రియల్ టైమ్ ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్, సూపర్ నైట్ వీడియో, ప్యూర్ నైట్ వ్యూ, ప్రో సినిమాటిక్ మోడ్ మరిన్ని కెమెరా ఫీచర్‌లను అందిస్తున్నాయి.
వివో ఎక్స్70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
- 6.78-అంగుళాల అమ్లోడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
- క్వాలకమ్ స్నాప్‌డ్రాగన్ 870
- 4500ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
- క్వాడ్ కెమెరా సెటప్ విత్ మైక్రో గింబల్ స్టెబిలైజేషన్
- 50 ఎమ్‌పీ ప్రైమరీ కెమెరా
- 8 ఎమ్‌పీ పెరిస్కోప్ జూమ్ లెన్స్
- 12 ఎమ్‌పీ టెలిఫోటో లెన్స్
- 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
- 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 11 సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment