nothing
-
అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా ఫోన్లలో పాత గేమ్స్ అన్నీ కనుమరుగయ్యాయి. ఇందులో ఒకటి.. ఒకప్పుడు అందరికీ ఇష్టమైన 'స్నేక్ గేమ్'. నోకియా ఫోన్ ఉపయోగించిన ఎవరికైనా ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. 4జీ, 5జీ ఫోన్లు రానప్పుడు ఎంతోమంది ఫేవరేట్ గేమ్ కూడా ఇదే. ఆ గేమ్ మళ్ళీ వచ్చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బ్రిటీష్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్.. ఐకానిక్ స్నేక్ గేమ్‌ను నథింగ్ హోమ్ స్క్రీన్ విడ్జెట్‌గా తీసుకొచ్చింది. దీనిని నథింగ్ కొత్త కమ్యూనిటీ విడ్జెట్ల యాప్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ లేటెస్ట్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్‌తో సహా ప్రతి నథింగ్ హ్యాండ్‌సెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.నిజానికి ఈ స్నేక్ గేమ్‌ను మొట్టమొదట నథింగ్ యూజర్ రాహుల్ జనార్ధనన్ ఒక కాన్సెప్ట్‌గా ప్రారభించారు. దీనితో పాటు మరో తొమ్మిది కాన్సెప్ట్‌లను రూపొందించి.. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. జనార్దనన్ కాన్సెప్ట్‌లు కంపెనీ దృష్టిని ఆకర్షించింది. దీంతో రూపొందించడానికి నథింగ్స్ సాఫ్ట్వేర్ బృందం కమ్యూనిటీ డెవలపర్‌తో భాగమయ్యారు.ఈ స్నేక్ గేమ్ 26 సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పామును కంట్రోల్ చేయడానికి నోకియా ఫోన్లో బటన్స్ ఉండేవి. ఇప్పుడు ఫోన్లలో బటన్స్ లేవు, కాబట్టి పాము కదలికను కంట్రోల్ చేయడానికి డైరెక్షనల్ వైపు టచ్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చూడటానికి విడ్జెట్‌పై రెండుసార్లు నొక్కాలి.Snake just got a reboot. Head to Google Playstore to get involved. pic.twitter.com/9MVKM1yKBc— Nothing (@nothing) December 4, 2024 -
వన్‌ప్లస్ కోఫౌండర్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్...! లాంచ్ ఎప్పుడంటే...!
వన్‌ప్లస్ కో ఫౌండర్ కార్ల్ పై వన్‌ప్లస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కార్ల్‌పై నథింగ్ అనే కంపెనీ స్థాపించాడు. నథింగ్ కేవలం టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. వీటితో పాటుగా స్మార్ట్ఫోన్ల తయారీపై కూడా నథింగ్ ఫోకస్ పెట్టింది. తాజాగా నథింగ్ స్మార్ట్ఫోన్లను కూడా త్వరలోనే లాంచ్‌చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్నెల్లలో తిరిగి మళ్లీ అదే స్థానం..! స్మార్ట్ఫోన్ల తయారీలో భాగంగా అమెరికన్ చిప్ మేకర్ క్వాల్కమ్తో నథింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నథింగ్ స్మార్ట్‌ఫోన్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. నథింగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 30 వేల కంటే తక్కువగా ఉండనుంది. నథింగ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్సే కాకుండా నథింగ్ పవర్(1) పేరుతో పవర్‌బ్యాంకునుకూడా లాంచ్ చేయనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో కార్ల్‌పై వన్‌ప్లస్ సంస్థను వీడిపోయాడు. We’re excited to be working with @Qualcomm to power our growing tech ecosystem. Over the last year, we’ve seen that there’s a space for a challenger in the tech world. This partnership will play a big role in achieving our vision. Here’s to the future. — Nothing (@nothing) October 13, 2021 చదవండి: హోండా కంపెనీ భారీ ప్లాన్.. ఇక తగ్గేదె లే! -
టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే!
ఈ కామర్స్ విధానానికి అలవాటు పడిన జనాలు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం సాధారణంగా జరగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక వస్తువు మాత్రం తప్పకుండా వస్తుంది. కానీ ఈసారి డెలివరీ చేసిన దాంట్లో ఏం లేకండా ఏకంగా ఖాళీ డబ్బానే వచ్చింది. ఇలాంటి సంఘటనలు సాధారణ ప్రజలకు మాత్రమే జరుగుతాయనుకుంటే పొరపాటే.. సెలబ్రిటీలు సైతం ఇందుకేం అతీతులు కాదు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ వివరాల్లోకి వెళితే.. టీవీ నటుడు, అనుపమ ఫేమ్ పరాస్ కల్వనాత్.. ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్( ఏమీ లేదు అని అర్థం) అనే బ్రాండ్‌కు చెందిన ఇయర్-1 ఇయర్ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. డెలీవరీ వచ్చాక దాన్ని ఓపెన్ చేసి చూసిన నటుడు షాక్ కు గురయ్యాడు. ఆయనకు వచ్చిన ఆర్డర్లో నిజంగానే ఏం లేదు. ఈ కామర్స్ డెలీవరీ తప్పిదాన్ని పరాస్ ట్విటర్లో పోస్టు చేస్లూ.. ఫ్లిప్‌కార్ట్ నుంచి తాను అందుకున్న ఫోటోలను షేర్ చేశాడు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ త్వరలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందనీ, సేవల్లో నాణ్యత తగ్గుతుందనీ కాప్షన్ చేశాడు. చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు ఇక నటుడి ట్వీట్‌పై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. తమ అధికారిక ట్విటర్ పేజ్ ద్వారా రిప్లై ఇచ్చింది. ‘జరిగిన దానికి చింతిస్తున్నాం. ఆర్డర్‌కి సంబంధించి మీకు ఎదురైన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మేము మీకు సాయం చేసేందుకే ఉన్నాం. దయచేసి ఆర్డర్ ఐడీని మాకు షేర్ చెయ్యండి. దీని ద్వారా మేము పరిశీలించి సాయం అందిస్తాం.. మీ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం.’అని పేర్కొంది. So Here I Have Received Nothing In @nothing box From @Flipkart ! Flipkart is actually getting worse with time and soon people are going to stop purchasing products from @Flipkart ! pic.twitter.com/wGnzU0MlNq — Paras Kalnawat (@paras_kalnawat) October 13, 2021 -
అదిగో అమరావతి.. అంతా అధోగతి
రాజధానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తి * అవసాన దశలోనే రాజధాని పల్లెలు * ప్రగల్భాలు ఘనం.. అభివృద్ధి శూన్యం * ఇదేనా రాజధాని ప్ర‘గతి’ * వెలగపూడి మినహా వెలిగిందేమీ లేదు ఆంధ్రుల కలల సౌధం అమరావతి అభివృద్ధి కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. పచ్చదనం కరువైన పల్లెలు.. మరుగున పడిన రోడ్లు.. అస్తవ్యస్త పారిశుధ్యం.. అవధుల్లేని పేదరికం.. అన్నదాతల ఆకలి వేదనతో రాజధాని ప్రాంతం నేడు అట్టడుగు స్థాయికి చేరింది. అదిగో సింగపూర్.. ఇదిగో కలల ప్రపంచం.. అని మభ్యపెట్టి రైతుల వద్ద నుంచి భూములు గుంజిన పాలకులు వెలగపూడిలో సచివాలయ నిర్మాణం తప్ప వెలగబెట్టిందేమీ లేదు. రాజధానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా అభివృద్ధిని బేరీజు వేస్తూ ‘సాక్షి’ పరిశీలన సాక్షి, అమరావతి బ్యూరో/ తుళ్లూరు రూరల్: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి రెండేళ్లయ్యింది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడాది అయ్యింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం మినహా మరెక్కడా అభివృద్ధి కనిపించలేదు. రాజధాని కోసం సమీకరించిన వేల ఎకరాల్లో ముళ్లచెట్లే దర్శనమిస్తున్నాయి. ఆ భూములను కూడా అక్రమార్కులు ముక్కముక్కలుగా చేసి మింగేస్తున్నారు. పోనీ.. గ్రామాలైనా అభివృద్ధయ్యాయా? అంటే మొండిగోడలతో మురికివాడలను తలపిస్తున్నాయి. పంటలు లేక... కౌలు రాక.. కూలీలకు పెన్షన్ అందక.. అల్లాడిపోతున్నారు. 2015 మేలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించగా, శంకుస్థాపన చేసి దసరాకు ఏడాదైంది. ఈ కాలంలో రాజధానిలో అద్భుతాలేవీ జరక్కపోగా, సగటు మనిషి జీవనం అంతంతమాత్రంగా మారింది. అన్నంపెట్టే భూమిని కోల్పోయిన రైతు.. పనుల్లేక కూలీలు.. ఉపాధి లేక యువత.. ఆసరాలేక పేదలు బిక్కుబిక్కుమంటున్నారు. మంగళగిరి, తాండికొండ నియోజకవర్గాల పరిధిలో 29 గ్రామాల్లో సుమారు 33వేల ఎకరాలను ల్యాండ్‌పూలింగ్ ద్వారా రైతుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. భూములిస్తే జీవితాలు మారిపోతాయని, గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. గుక్కెడు నీరూ కరువే.. రాజధాని గ్రామాల్లో మంచినీటికీ దిక్కులేదు. ఉన్న మంచినీటి గుంతలను కూడా బాగుచేసే వారు కరువయ్యారు. నిధులు లేక మురికి గుంత నుంచి వచ్చే నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఐనవోలు. ఈ గ్రామంలో మంచినీటి చెరువు ఉన్నా.. క్లోరినేషన్‌కు నిధులు లేవు. దీంతో ఆ నీటినే చిన్నపాటి ట్యాంక్‌కు పంపింగ్ చేస్తారు. ఆ నీరే గ్రామం మొత్తానికి దిక్కు. పైపులైన్లు పగిలిపోవడంతో వచ్చే నీరు కూడా వీధుల్లో వృథాగా పోతోంది. నేలపాడు, శాఖమూరు, పెద్దపరిమి, మందడం గ్రామాల ప్రజలు మంచినీరు లేక రోజూ రూ.20 వెచ్చించి వాటర్ క్యాన్ కొంటున్నారు. ఎన్టీఆర్ సృజల స్రవంతి పథకం ప్రారంభించినా.. ఏ ఒక్క గ్రామంలోనూ కనిపించలేదు. కౌలుతో పాట్లు.. ఎకరాకు పదిసెంట్ల చొప్పున తగ్గిస్తుండటంతో రైతులకు పరిహారం కింద ఇచ్చే ప్లాట్లు, కౌలులోనూ కోత పెడుతున్నారు. రైతులకు చెందాల్సిన ప్లాట్లు, కౌలు కొందరు అధికార పార్టీ నేతలు స్వాహా చేస్తున్నారు. ల్యాండ్‌పూలింగ్ ద్వారా ఎకరం పొలం ఇచ్చిన రైతులకు ఏడాదికి కౌలు కింద రూ.30వేల నుంచి రూ.50వేలు చెల్లించాలి. ఏటా పదిశాతం పెంచాలి. కొందరు అక్రమార్కులు కౌలును దారి మళ్లిస్తున్నారు. కాగా, అసైన్డ్ భూములకు ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడం గమనార్హం. పింఛనో రామ‘చంద్రా..’ రాజధానిలోని వ్యవసాయ భూములపై సుమారు 63వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇందులో 50వేలకు పైగా కూలీలు ఉన్నారు. రోజూ వ్యవసాయ పనులకు వెళ్లి జీవించేవారు. ప్రస్తుతం సాగు నిలిచిపోవడంతో కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. భూములు తీసుకునే సమయంలో కూలీలకు ఏడాది పొడవునా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, కేవలం 12 ప్రాంతాల్లో నర్సరీలు పెట్టి పదుల సంఖ్యలో ఉపాధి చూపించి చేతులు దులుపుకొన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే కూలీలకు నెలనెలా రూ.2,500 పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా మొదట 38వేల మంది కూలీలను గుర్తించింది. ఆ తరువాత రకరకాల కారణాలతోl20వేల మందికి కుదించింది. వారికి కూడా నెలనెలా పెన్షన్ ఇవ్వట్లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లేక.. పెన్షన్ రాక అనేక మంది కూలీలు విజయవాడ, గుంటూరుకు వెళ్తున్నారు. ఉచిత విద్య.. వైద్యం ఊసేది? భూములిచ్చిన గ్రామాల్లో నివసిస్తున్న రైతు, కూలి కుటుంబాల పిల్లలకు కేజీ టు పీజీ వరకూ ఉచితంగా విద్యను అందించడంతో పాటు ఉచిత వైద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు అది అమలుకాలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. లేనిపక్షంలో నిరుద్యోగ భృతి కింద అర్హుడైన ప్రతి యువకుడికీ రూ.2 వేలు ఇస్తామని వెల్లడించారు. ఇంతవరకు ఏ ఒక్కరికీ ఉద్యోగం లేదు.. భృతీ ఇవ్వలేదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు.. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు బనాయించి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అనంతవరంలోని భూమి రికార్డుల్లో మాయం కావడాన్ని ప్రశ్నించిన రైతులపై దాడిచేయడంతో పాటు ఎదురు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పడకేసిన పారిశుధ్యం.. స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దుతామన్న పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. తుళ్లూరు, ఐనవోలు, నేలపాడు, మల్కాపురం, నెక్కల్లు, వడ్డెమాను, పెద్దపరిమి తదితర గ్రామాల్లో మురికి కాలువలు లేవు. దీంతో నివాసాల్లోని వ్యర్థాలు వీధుల్లో ప్రవహిస్తున్నాయి. వర్షం వస్తే ఎక్కడి నీరు అక్కడే. ఈ నీటితో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు స్వైర విహారం చేయడంతో పల్లె జనం రోగాల బారిన పడుతున్నారు. -
వీడని అక్కాచెల్లెళ్ల మర్డర్ కేసు మిస్టరీ