
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో చాలా ఫోన్లలో పాత గేమ్స్ అన్నీ కనుమరుగయ్యాయి. ఇందులో ఒకటి.. ఒకప్పుడు అందరికీ ఇష్టమైన 'స్నేక్ గేమ్'. నోకియా ఫోన్ ఉపయోగించిన ఎవరికైనా ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. 4జీ, 5జీ ఫోన్లు రానప్పుడు ఎంతోమంది ఫేవరేట్ గేమ్ కూడా ఇదే. ఆ గేమ్ మళ్ళీ వచ్చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
బ్రిటీష్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ నథింగ్.. ఐకానిక్ స్నేక్ గేమ్‌ను నథింగ్ హోమ్ స్క్రీన్ విడ్జెట్‌గా తీసుకొచ్చింది. దీనిని నథింగ్ కొత్త కమ్యూనిటీ విడ్జెట్‌ల యాప్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ గేమ్ లేటెస్ట్ నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్‌తో సహా ప్రతి నథింగ్ హ్యాండ్‌సెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.
నిజానికి ఈ స్నేక్ గేమ్‌ను మొట్టమొదట నథింగ్ యూజర్ రాహుల్ జనార్ధనన్ ఒక కాన్సెప్ట్‌గా ప్రారభించారు. దీనితో పాటు మరో తొమ్మిది కాన్సెప్ట్‌లను రూపొందించి.. దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేశారు. జనార్దనన్ కాన్సెప్ట్‌లు కంపెనీ దృష్టిని ఆకర్షించింది. దీంతో రూపొందించడానికి నథింగ్స్ సాఫ్ట్‌వేర్ బృందం కమ్యూనిటీ డెవలపర్‌తో భాగమయ్యారు.
ఈ స్నేక్ గేమ్ 26 సంవత్సరాల క్రితం పరిచయమైంది. ఇప్పుడు మళ్ళీ నథింగ్ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో పామును కంట్రోల్ చేయడానికి నోకియా ఫోన్‌లో బటన్స్ ఉండేవి. ఇప్పుడు ఫోన్‌లలో బటన్స్ లేవు, కాబట్టి పాము కదలికను కంట్రోల్ చేయడానికి డైరెక్షనల్ వైపు టచ్ చేయాల్సి ఉంటుంది. స్కోర్ చూడటానికి విడ్జెట్‌పై రెండుసార్లు నొక్కాలి.
Snake just got a reboot.
Head to Google Playstore to get involved. pic.twitter.com/9MVKM1yKBc— Nothing (@nothing) December 4, 2024
Comments
Please login to add a commentAdd a comment