అదిరిపోయే ఫీచర్లతో వన్ ప్లస్5 లాంచ్
అదిరిపోయే ఫీచర్లతో వన్ ప్లస్5 లాంచ్
Published Wed, Jun 21 2017 2:31 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM
ఎంతో కాలంగా వేచిచూసిన వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మంగళవారం గ్లోబల్ గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇప్పటివరకు ఎన్నో రూమర్లు మార్కెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే అంతా కొత్తదనంతో కూడిన డిజైన్, తాజా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లతో కంపెనీ ఈ ఫోన్ ను కస్టమర్లకు ముందుకు ప్రవేశపెట్టింది. కేవలం డిజైన్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లు మాత్రమేకాక, కెమెరా కూడా ఎంతో అద్భుతమైనదిగా అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 479 డాలర్లు, అంటే దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం 30,958.97రూపాయలు. గ్లోబల్ గా జూన్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని ఈ చైనీస్ కంపెనీ చెప్పింది.
గ్లోబల్ గా మంగళవారం లాంచ్ అయిన ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లో జూన్ 22న ప్రవేశపెట్టబోతున్నారు. భారత్ లో దీన్ని ప్రారంభ ధర రూ.32,999గా ఉండబోతుందని తెలుస్తోంది. టాప్ ఎండ్ మోడల్ రూ.37,999గా నిర్ణయించనున్నారని తెలుస్తోంది. భారత్ లో మాత్రం లాంచ్ అయిన రోజు నుంచే తమ ప్లాట్ ఫామ్ పై విక్రయానికి రాబోతుందని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. ముంబైలో ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ బ్రాండు అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకున్న వన్ ప్లస్ ఫోన్లలో పలుచనైన ఫోన్ ఇదేనని, అంతేకాక అత్యంత పవర్ ఫుల్ ఫోన్ కూడా ఇదేనని లాంచింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది.
గ్లోబల్ గా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ ప్లే
1920x1080 పిక్సెల్స్ రెజుల్యూషన్
2.5డీ కార్నింగ్ గ్లాస్ 5
2.45గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్
8జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ ఆప్షన్లు
128జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు(నాన్-ఎక్స్ పాండబుల్)
ఆండ్రాయిడ్ 7.1.1 నుగట్ ఆధారిత ఆక్సీజెన్ఓఎస్
16మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 20 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా(డ్యూయల్ రియర్ కెమెరాలు)
సెల్ఫీ కోసం ముందు వైపు 16మెగాపిక్సెల్ కెమెరా
3,300ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్)
డ్యాష్ ఛార్జర్(కేవలం 30నిమిషాల్లో 60శాతం ఛార్జింగ్)
ఫుల్-మెటల్ యూనిబాడీ డిజైన్
ఫింగర్ ప్రింట్ స్కానర్
వన్ ప్లస్ 3టీ కంటే 20 శాతం పొడవైనది
Advertisement