Dual Camera Phones
-
ఐఫోన్ ఎక్స్‌లో మరో ప్రాబ్లమ్, యూజర్లు గగ్గోలు
ఐఫోన్ ఎక్స్.. ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన 10వ ఐఫోన్ వార్షికోత్సవ సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. గత కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్‌కు అమర్చిన ఫేస్ఐడీలో లోపం ఉన్నట్టు యూజర్లు ఫిర్యాదులు చేస్తే.. తాజాగా వెనుక వైపు గల డ్యూయల్ కెమెరాకు అమర్చిన గ్లాస్ ప్రొటెక్షన్ అనుకోకుండా పగిలిపోతుందట. ఈ విషయంపై యూజర్లు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్రారంభమైంది. రెడ్డిట్, ఆపిల్ సపోర్టు ఫోరమ్స్ల్లో పలు రిపోర్టులు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు ఐఫోన్ యూజర్లు తమ కెమెరా గ్లాస్ పగిలిపోతుందని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఎందుకు ఈ గ్లాస్ పగిలిపోతుందో సరియైన కారణం మాత్రం తెలియడం లేదు. తమ ఫోన్లను కింద పడేయలేదని, దానికదే పగిలిపోతుందని యూజర్లు పేర్కొంటున్నారు. ‘నా ఐఫోన్ ఎక్స్ కెమెరా లెన్స్ పగిలిపోయినట్టు ఇప్పుడే చూశా. కానీ నేనసలు ఈ ఫోన్‌ను కిందనే పడేయలేదు’ అని ఒక యూజర్ రెడ్డిట్‌లో రిపోర్టు చేశాడు. చల్లని వాతావరణంతో మనిషి చేతులు, కాళ్లు పగిలినట్టు, ఫోన్ వెనుక వైపు కెమెరా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా చల్లని వాతావరణానికి దెబ్బతింటుందని పలువురు యూజర్లు విశ్వసిస్తున్నారు. అయితే చల్లని వాతావరణంలో ఉన్నందుకు వెనుక వైపు కెమెరా గ్లాస్ పగులుతుందని రిపోర్టులు వస్తున్నాయని, తాను మలేషియాలో ఉంటానని, ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉందని, అయితే ఇక్కడ ఏ కారణం చేత పగిలింది అని ఓ బాధిత యూజర్ ఆపిల్ సపోర్టు ఫోరమ్‌కు లేఖ రాశారు. తమ వద్ద 32-36 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఫోన్ ఎక్స్‌తో పాటు యూజర్లు తన పాకెట్లలో మరికొన్ని వస్తువులను పెట్టుకుని ఉంటుండటంతో, కెమెరా గ్లాస్ పగులుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 7 నుంచి ఆపిల్ తన ఐఫోన్ మోడల్స్‌కు సఫైర్ గ్లాస్ కవర్‌ను వాడుతోంది. ఇది చాలా స్వచ్ఛంగా ఉంటోంది. కానీ ఎందుకు పగులుతుందో మాత్రం సరియైన క్లారిటీ తెలియడం లేదు. అయితే పగిలిపోయిన ఈ కెమెరా గ్లాస్‌కు వారెంటీ కిందకి వస్తుందో రాదో కూడా అనుమానమే. -
బడ్జెట్లో ‘కోమియో’ కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, హైదరాబాద్ : చైనాకు చెందిన ‘కోమియో’ స్మార్ట్‌ఫోన్ కంపెనీ గతేడాదే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ఈ కంపెనీ దేశీయ కస్టమర్ల ముందుకు తెస్తోంది. ఉత్తర భారతంలో విజయవంతమైన ఈ కంపెనీ తాజాగా సౌత్, ఈస్ట్ ఇండియా మార్కెట్లపై దృష్టిపెట్టింది. తన తర్వాతి కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 4న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కోమియో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఫీచర్లుగా ఎఫ్‌హెచ్‌డీ డిస్ప్లే, డ్యూయల్ రియర్ కెమెరా, బెక్హ మోడ్ ఉండనున్నట్టు తెలుస్తోంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రాబోతుందని అంచనా. బడ్జెట్ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్న కోమియో, ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా 10వేల రూపాయల కంటే తక్కువగానే నిర్ణయించనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జూన్ 4న హైదరాబాద్‌లో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్, ప్యాన్ ఇండియా బేసిస్‌లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెప్పింది. -
కార్బన్ స్మార్ట్‌ఫోన్: ట్విన్‌ఫై కెమెరా, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: కార్బన్ మొబైల్స్ బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఫ్రేమ్స్ ఎస్ 9’ను దీన్ని విడుదల చేసింది. ‘ట్విన్‌ఫై కెమెరా’తో అనుసంధానించిన ఈ డివైస్ ధరను రూ. 6,790 గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు ఇతర మొబైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఎయిర్టెల్ ద్వారా రూ.2వేల క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకు ఎయిర్టెల్ కస్టమర్లు 18 నెలల్లో 3500 రూపాయల రీచార్జ్ చేసుకోవాల్సి ఉంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎయిర్టెల్ స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. 169 రూపాయల రీచార్జ్‌పై అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం. 28 రోజుల పాటు 1 జీబీ 3/4జీ డేటా ఉచితం. కార్బన్ ఫ్రేమ్స్ ఎస్ 9 ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే 1.25 గిగా హెడ్జ్ కార్డ్‌కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ 2900(లి-పోలీ) ఎంఏహెచ్ బ్యాటరీ -
వారికి బంపర్ ఆఫర్: రూ.2వేలకే స్మార్ట్‌ఫోన్
మొబైల్స్ తయారీదారు స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. కేవలం రూ.3,999 ధరకే ఈ ఎలైట్ డ్యుయల్‌ను తాజాగా విడుదల చేసింది. డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలిస్తున్నాయి. అంతేకాదు ఈ ఫోన్‌ను కొన్న యూజర్లకు రూ.2200 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అంటే వినియోగదారులు 1,799 రూపాయలకే (రూ .3,999 - రూ .2,200) వద్ద ఫోన్ కొనుగోలు చేసే అవకాశం అన్నమాట. అయితే జియో కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందనేది గమనార్హం. జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్న స్వైప్ టెక్నాలజీస్ జియో ఫుట్‌బాల్‌ఆఫర్ కింద జియో (పాత,కొత్త) ఈ ఆఫర్ అందిస్తోంది. బ్లాక్, వైట్, గోల్డ్ మూడు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా షాప్‌క్లూస్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. స్వైప్ ఎలైట్ డ్యుయల్ ఫీచర్లు 5 ఇంచ్ డిస్ప్లే 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 64జీబీ దాకా విస్తరించుకనే అవకాశం 8+ 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
డ్యూయల్ సెల్ఫీ కెమెరా, చౌక ధర: కొత్త మొబైల్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ట్రాన్సిషన్ హోల్డింగ్స్ తన బ్రాండ్ ఐటెల్ మొబైల్స్ ద్వారా బడ్జెట్ ధరలో ఓ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్‌గా ఎస్ 21 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇండియాలో దీని ధరను రూ .5,990 గా నిర్ణయించింది. భారతదేశం అంతటా మూన్లైట్ సిల్వర్, షాంపైన్ గోల్డ్, బ్లాక్ కలర్ అప్షన్స్లో ఇది లభ్యం కానుంది. ఎస్ 21 ఫీచర్లు 5 అంగుళాల డిస్ప్లే క్వాడ్‌కోర్ మీడియా టెక్ చిప్సెట్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ 1జీబీ ర్యామ్ 16 జీబి ఇంటర్నల్ మెమెరీ 32జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 2ఎంపీ+5ఎంపీ సెల్ఫీ కెమెరా ఆటో-ఫోకస్, ఫేస్ రికగ్నిషన్ 8 ఎంపీ రియర్‌కెమెరా 2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ మార్కెట్లో విఘాతం కలిగించే టెక్నాలజీలను నిర్మించడంపై తాము విస్తృతంగా దృష్టి సారించామనీ, వినియోగదారులకు కావాల్సిన టెక్నాలజీ అందించే తమ ప్రయత్నానికి ఇదొక ఉదారహరణ అని ఐటెల్ మొబైల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆప్టిమైజేషన్ టెక్నాలజీ మద్దతుతో తమ బ్యాటరీ 350 గంటల సుదీర్ఘకాలంపాటు స్టాంబ్‌బై ఇస్తుందని తెలిపారు. -
శాంసంగ్ గెలాక్సీ సీ 8 వచ్చేసింది..
సాక్షి, బీజింగ్: కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ సీరిస్ లో ‘గెలాక్సీ సీ 8’ పేరుతో దీన్ని చైనాలో విడుదల చేసింది. గెలాక్స్ ఎస్ 8, ఎస్ 8ప్లస్ విజయం తరువాత ముఖ్యంగా భారీ సెల్ఫీ కెమెరాతోపాటు, డ్యుయల్ రియర్ కెమెరాలతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అలాగే భారత్ లో ఎపుడు లాంచ్ చేసిది కూడా స్పష్టం కాలేదు. ఫింగర్ పింట్ సెన్సార్, ఫేషియల్ రికగ్నిషన్ తదితర ఫీచర్లతో రెండు వేరియంట్లలో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్, పింక్ కలర్స్‌లో ఇది అభ్యం కానుంది. శాంసంగ్ గెలాక్సీ సీ 8 ఫీచర్లు 5.5 అంగుళాల ఫుడ్ హెచ్డీ అమోలెడ్ డిస్ ప్లే ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 1080x1920 పిక్సెల్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 దాకా విస్తరించుకునే అవకాశం 13+5 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
శాంసంగ్ కొత్త గెలాక్సీ, ప్రత్యేకతలు అవే!
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ 'జే' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జే7ప్లస్‌ను ఆవిష్కరించింది. థాయ్‌లాండ్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. అధికారిక వెబ్సైట్లో దీని ధర 12,900 థాయ్ బట్(థాయ్‌లాండ్ కరెన్సీ) అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.24,800. సెప్టెంబర్ 15 నుంచి ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీఆర్డర్లను శాంసంగ్ ప్రారంభించింది. తన వెబ్సైట్లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌తో పాటు యూ ఫ్లెక్స్ వైర్లెస్ ఈయర్‌ఫోన్స్ ఉచితంగా కంపెనీ అందించనుంది. అయితే ఈ డీల్ సెప్టెంబర్ 17 వరకు మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ వెనుకవైపు రెండు కెమెరాలు. అంతేకాక ఒకేసమయంలో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకునే సామర్థ్యం. ఆపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్లకు పోటీగా ఉండే తీసుకొచ్చిన శాంసంగ్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ బిక్స్బీ సపోర్టు కూడా దీనికి ప్రత్యేకతగా నిలుస్తుంది. ఇప్పటికే బక్స్బీని శాంసంగ్ భారత్ మినహా 200 పైగా దేశాల్లో లాంచ్ చేసింది. శాంసంగ్ జే7 ప్లస్ ఫీచర్లు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్ 2.4గిగాహెడ్జ్ హిలియో పీ20 ఆక్టాకోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు 16 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఈ తరహా ఫస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఇదేనట!
బీజింగ్: కొరియా మొబైల్ శాంసంగ్ కూడా డబుల్ రియర్ కెమెరాల కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తోంది. తన తాజా 'గెలాక్సీ సి7' స్మార్ట్‌ఫోన్‌ను రెండు ప్రధాన కెమెరాలతో లాంచ్ చేయనుంది. గెలాక్సీ సీ 7 2017 వేరియెంట్‌ను త్వరలో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. శాంసంగ్ చైనా అధికారిక వెబ్సైట్ లో లైవ్ లో ఇది ప్రత్యక్షమైంది. దీని సమాచారం ప్రకారం ఇది సమీప భవిష్యత్తులో ప్రారంభమవుతుంది. శాంసంగ్ గెలాక్సీ సి 7 (2017), బ్లూటూత్ సర్టిఫికేషన్ , టెనా సర్టిఫికేషన్ పొందిన శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే సంస్థ విడుదల చేస్తుందని వెబ్ సైట్ సూచించింది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్, 32 జీబీ మొమరీ, 4 జీబీ, 64జీబీ మొమరీ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. శాంసంగ్ గెలాక్సీ సి7 (2017) ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.39 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నూగట్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13, 5 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరాలు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2850 ఎంఏహెచ్ బ్యాటరీ, -
షావోమి ఎంఐ 5ఎక్స్ లాంచ్, స్పెషల్ ఏంటి?
ఛైనీస్ మొబైల్ మేకర్ షావోమి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆధారిత ‘ఎంఐ 5 ఎక్స్’ ను మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 12 ఎంపీవైడ్యాంగిల్ 1.25మైక్రాన్ పిక్సెల్ సెన్సర్, f/2.2 అపెర్చర్ 12-మెగాపిక్సెల్ టెలిఫోటో ద్వంద్వ కెమెరాలను జోడించడం స్పెషల్ ఫీచర్‌గా నిలవనుంది. దీని ధర సుమారుగా రూ. 14,200లు. బ్లాక్, గోల్డ్, పింక్ కలర్ ఆప్షన్స్‌లో ఆగస్టు 1 నుంచి చైనాలో విక్రయాలు ప్రారంభం. రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. కాగా దాదాపు ఎంఐ 6 ను పోలిన ఫీచర్లతో ఐఫోన్ 7 ప్లస్ , వన్‌ప్లస్ 5 లకు గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా. షావోమి ఎంఐ 5ఎక్స్ ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 మెగాపిక్సల్ డబుల్ బ్యాక్ కెమెరాలు, 5మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ చార్జ్ 3.0. -
జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5: డబుల్ రియర్ కెమెరాలు
బీజింగ్: జెడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'స్మాల్ ఫ్రెష్ 5'ను చైనాలో విడుదల చేసింది. గత సంవత్సరం ఫ్రెష్ 4 లాంచ్ చేసిన మరియు సంస్థ తాజాగా ఫ్రెష్ 5 పేరుతో దీన్ని ప్రారంభించింది. 3జీబీ ర్యామ్/ 16 స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, /32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు రెండు రియర్ కెమెరాలను పొందుపర్చడం ఇందులోని ప్రత్యేకత వీటి ధరలను వరుసగా సుమారు రూ.9,400, రూ.13,200 గా నిర్ణయించింది. వినియోగదారులకు జూలై 5 నుంచి లభ్యం కానుంది. డార్క్ గ్రే, గ్రాస్ గ్రీన్, సొగెగ్ గోల్డ్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది. జెడ్‌టీఈ స్మాల్ ఫ్రెష్ 5 ఫీచర్లు... 5 అంగుళాల హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 16/32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ , -
అదిరిపోయే ఫీచర్లతో వన్ ప్లస్5 లాంచ్
ఎంతో కాలంగా వేచిచూసిన వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మంగళవారం గ్లోబల్ గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఇప్పటివరకు ఎన్నో రూమర్లు మార్కెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. అయితే అంతా కొత్తదనంతో కూడిన డిజైన్, తాజా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లతో కంపెనీ ఈ ఫోన్ ను కస్టమర్లకు ముందుకు ప్రవేశపెట్టింది. కేవలం డిజైన్, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లు మాత్రమేకాక, కెమెరా కూడా ఎంతో అద్భుతమైనదిగా అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అమెరికాలో ఈ ఫోన్ ప్రారంభ ధర 479 డాలర్లు, అంటే దేశీయ కరెన్సీ లెక్కల ప్రకారం 30,958.97రూపాయలు. గ్లోబల్ గా జూన్ 27వ తేదీ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చని ఈ చైనీస్ కంపెనీ చెప్పింది. గ్లోబల్ గా మంగళవారం లాంచ్ అయిన ఈ ఫోన్ ను భారత్ మార్కెట్లో జూన్ 22న ప్రవేశపెట్టబోతున్నారు. భారత్ లో దీన్ని ప్రారంభ ధర రూ.32,999గా ఉండబోతుందని తెలుస్తోంది. టాప్ ఎండ్ మోడల్ రూ.37,999గా నిర్ణయించనున్నారని తెలుస్తోంది. భారత్ లో మాత్రం లాంచ్ అయిన రోజు నుంచే తమ ప్లాట్ ఫామ్ పై విక్రయానికి రాబోతుందని అమెజాన్ ఇండియా ధృవీకరించింది. ముంబైలో ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ బ్రాండు అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకున్న వన్ ప్లస్ ఫోన్లలో పలుచనైన ఫోన్ ఇదేనని, అంతేకాక అత్యంత పవర్ ఫుల్ ఫోన్ కూడా ఇదేనని లాంచింగ్ సందర్భంగా కంపెనీ తెలిపింది. గ్లోబల్ గా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.... 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ ప్లే 1920x1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ 2.5డీ కార్నింగ్ గ్లాస్ 5 2.45గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ ఆప్షన్లు 128జీబీ, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు(నాన్-ఎక్స్ పాండబుల్) ఆండ్రాయిడ్ 7.1.1 నుగట్ ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్ 16మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 20 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా(డ్యూయల్ రియర్ కెమెరాలు) సెల్ఫీ కోసం ముందు వైపు 16మెగాపిక్సెల్ కెమెరా 3,300ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్-రిమూవబుల్) డ్యాష్ ఛార్జర్(కేవలం 30నిమిషాల్లో 60శాతం ఛార్జింగ్) ఫుల్-మెటల్ యూనిబాడీ డిజైన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వన్ ప్లస్ 3టీ కంటే 20 శాతం పొడవైనది -
ఒప్పో కొత్త ఫోన్: ఫ్రంట్ కెమెరా ఎంతో తెలుసా?
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో మరో కొత్త సెల్ఫీ ఫోకస్డ్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎన్నో లీకేజీల అనంతరం ఒప్పో ఆర్11 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో అతిపెద్ద ఆకర్షణ. వెనుకవైపు రెండు కెమెరాలు ఉండటంతో పాటు, ముందు వైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉండటం. జూన్ 10 నుంచి ఒప్పో ఆర్11 స్మార్ట్ ఫోన్ చైనాలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ చెప్పింది. ఈ ఫోన్ లాంచ్ చేసినప్పటికీ, ఇంకా అధికారిక ధరను కంపెనీ ప్రకటించలేదు. మార్కెట్లో వస్తున్న రూమర్ల ప్రకారం ఈ ఫోన్ ధర 485 డాలర్లు ఉండొచ్చని అంటే రూ.31,200గా పేర్కొంటున్నాయి. మూడు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ వేరియంట్లలో ఇది మార్కెట్లో లభ్యమవుతోంది. వెనుకవైపు అమర్చిన కెమెరా దగ్గర్నే సెంటర్ లో ఒప్పో లోగో ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ ఒకటి 20 మెగాపిక్సెల్, మరొకిటి 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 7.1 నోగట్ 2900ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ ఎల్టీఈ, జీపీఎస్, వై-ఫై, బ్లూటూత్ -
టాప్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్ లివే!
డ్యూయల్ కెమెరా.. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. కస్టమర్లను ఆకట్టుకోవడానికి కచ్చితంగా వెనుకవైపు రెండు కెమెరాలను అందించడానికే మొబైల్ తయారీదారులు మొగ్గుచూపుతున్నారు . ఇన్నిరోజులు హై-ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితమైన ఈ డ్యూయల్ కెమెరా సెటప్, తక్కువ ధరతో మార్కెట్లోకి వచ్చే ఫోన్లకు అందుబాటులోకి వస్తున్నాయి.. దీంతో ప్రస్తుతం అన్ని ధరల రేంజ్ లో స్మార్ట్ ఫోన్లలో ఈ డ్యూయల్ కెమెరా దర్శనమిస్తోంది. అయితే మార్కెట్లో ఉన్న టాప్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్లేమిటో ఓ సారి చూద్దాం... ఐఫోన్ 7 ప్లస్... ఇమేజింగ్ విషయంలో ఐఫోన్ 7 ప్లస్ మార్కెట్లో ఉన్న ఒకానొక బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇదీ ఒకటి. ఈ ఫోన్ కు వెనుకవైపు రెండు కెమెరాలున్నాయి. 12మెగాపిక్సెల్ తో రెండు కెమెరాలను ఆపిల్ ఈ ఫోన్ ను గతేడాదే మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉండగా... సెకండరీ టెలిఫోటో లెన్స్ ను కలిగిఉంది. ఎక్కువదూరంలో ఉండే ఫోటోలను జూమ్ మోడ్ లో కూడా అత్యంత స్పష్టంగా క్య్యాప్చర్ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఎల్జీ జీ6... అద్భుతమైన ఇమేజ్ లను అందించడానికి ఎల్ జీ తన జీ6 స్మార్ట్ ఫోన్ కు వెనుకవైపు రెండు కెమెరాలను అందించింది. అంతేకాక మార్కెట్లో ఉన్న గూగుల్ పిక్సెల్, శాంసంగ్ ఎస్ 8 స్మార్ట్ ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వడానికి సహకరిస్తున్నాయట. ప్రైమరీ లెన్స్ ను, 125 డిగ్రీల్లో వైడ్-యాంగిల్ లెన్స్ లో ఈ ఫోన్ రెండు 13మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉంది. ఎల్జీ జీ5 స్మార్ట్ ఫోన్ కెమెరాను మెరుగుపరుస్తూ జీ6 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ కెమెరాను కంపెనీ ఆఫర్ చేసింది. తక్కువ వెలుగున్న సమయంలో అద్భుతంగా ఫోటోలు తీయడానికి మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదేనట. ఎల్జీ వీ20... ఎల్జీ వీ20 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ గా మార్కెట్లో పేరుంది. ఈ ఫోన్ కు కూడా 16ఎంపీ ప్రైమరీ 75 డిగ్రీల లెన్స్, సెకండరీ వైడ్-యాంగిల్ 135 డిగ్రీల 8ఎంపీ లెన్స్ తో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి... సెకండరీ వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా విస్తృత పరిధిలో ఉన్న దృశ్యాలను ఇట్టే క్యాప్చర్ చేస్తుంది. అదనంగా ఫోటోలకు ఫిష్ ఐ అపీయరెన్స్ ను కూడా ఇది అందిస్తోంది. గెలాక్సీ ఎస్7 లేదా ఐఫోన్ 7 ప్లస్ ల కంటే మెరుగైన, అద్భుతమైన ఫోటో క్వాలిటీని ఈ 16ఎంపీ సెన్సార్ కలిగి ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. హువావే హానర్ 8... ఆపిల్, ఎల్జీ స్మార్ట్ ఫోన్లకు విభిన్నంగా హానర్ 8 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ కెమెరాను హువావే సెట్ చేసింది. రెండు లెన్స్ ద్వారా ఇన్ ఫుట్స్ ను సేకరించి, ఆ రెండింటి ఇమేజ్ లను ఒకదాని తర్వాత ఒకటి కలిపి ఫైనల్ ప్రొడక్ట్ లను మనకు అందించే సాఫ్ట్ వేర్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. హువావే పీ9 మాదిరిగానే ఈ ఫోన్ కు వెనుకవైపు 12ఎంపీ ఆర్జీబీ సెన్సార్, 12ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. రెగ్యులర్ కలర్ సెన్సార్స్ కంటే 200 శాతం ఎక్కువ లైట్, 50 శాతం ఎక్కువ కాంట్రాస్ట్ ను ఈ ఫోన్ లో అందించిన మోనో క్రోమ్ సెన్సార్ యూజర్లకు అందిస్తోంది. ఎక్కువ మొత్తంలో డేటాను కూడా ఈ మోనోక్రోమ్ సెన్సార్ క్యాప్చర్ చేస్తోంది. హానర్ 8 మొబైల్ క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉందని తమ రివ్యూలో తేలినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. హానర్ 6ఎక్స్.... డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్లలో హానర్ 6ఎక్స్ కు మార్కెట్లో మంచి పేరే ఉంది. 12మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ను ఈ ఫోన్ కు అమర్చారు. ఈ ఫోన్ ధర కూడా అందుబాటులోనే 12,999గా నిర్ణయించినట్టు కంపెనీ చెప్పింది. -
కూల్ ప్యాడ్ కొత్త ఫోన్, ఫీచర్లెలా ఉన్నాయంటే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ కూల్ ప్యాడ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్లోకి లాంచ్ చేసింది. కూల్ ప్యాడ్ కూల్ ప్లే6 పేరుతో బుధవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర సీఎన్‌వై 1,499గా కంపెనీ ప్రకటించింది. అంటే భారత్ కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు 8900రూపాయలు ఉండొచ్చు. చైనాలో రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కంపెనీ, ఈ ఫోన్ ను మే 16నుంచి విక్రయానికి తీసుకొస్తోంది. మెటల్ ఫ్రేమ్ విత్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ రియర్ కెమెరా, 4060 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో స్పెషల్ ఫీచర్లు. సాఫ్ట్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ స్పీకర్ గ్రిల్స్ ను స్మార్ట్ ఫోన్ కింద భాగంలో కంపెనీ ఉంచింది. 5.5 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ తో రన్ అవుతుంది. 64బిట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 653 చిప్ సెట్, 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం, రెండు 13మెగాపిక్సెల్ సోనీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా, సెల్ఫీ కోసం ముందు భాగాన 8 మెగాపిక్సెల్ కెమెరా ఈ ఫోన్ లో ఉన్నాయి..