బడ్జెట్‌లో ‘కోమియో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌ | COMIO Set To Launch New Smartphone In Hyderabad | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో ‘కోమియో’ కొత్త స్మార్ట్‌ఫోన్‌

Published Tue, May 15 2018 6:47 PM | Last Updated on Fri, May 25 2018 6:09 PM

COMIO Set To Launch New Smartphone In Hyderabad - Sakshi

కోమియో స్మార్ట్‌ఫోన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : చైనాకు చెందిన ‘కోమియో’ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ గతేడాదే భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పలు బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లను ఈ కంపెనీ దేశీయ కస్టమర్ల ముందుకు తెస్తోంది. ఉత్తర భారతంలో విజయవంతమైన ఈ కంపెనీ తాజాగా సౌత్‌, ఈస్ట్‌ ఇండియా మార్కెట్లపై దృష్టిపెట్టింది. తన తర్వాతి కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను జూన్‌ 4న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కోమియో ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన ఫీచర్లుగా ఎఫ్‌హెచ్‌డీ డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా, బెక్హ మోడ్ ఉండనున్నట్టు తెలుస్తోంది. 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి రాబోతుందని అంచనా. బడ్జెట్‌ ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న కోమియో, ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను కూడా 10వేల రూపాయల కంటే తక్కువగానే నిర్ణయించనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. జూన్‌ 4న హైదరాబాద్‌లో లాంచ్‌ కాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌, ప్యాన్ ఇండియా బేసిస్‌లో అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెప్పింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement