న్యూఢిల్లీ: చైనాకు చెందిన ట్రాన్సిషన్ హోల్డింగ్స్ తన బ్రాండ్ ఐటెల్ మొబైల్స్ ద్వారా బడ్జెట్ ధరలో ఓ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరా స్పెషల్ అట్రాక్షన్‌గా ఎస్ 21 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇండియాలో దీని ధరను రూ .5,990 గా నిర్ణయించింది. భారతదేశం అంతటా మూన్లైట్ సిల్వర్, షాంపైన్ గోల్డ్, బ్లాక్ కలర్ అప్షన్స్‌లో ఇది లభ్యం కానుంది.
ఎస్ 21 ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
క్వాడ్‌కోర్ మీడియా టెక్ చిప్‌సెట్
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
1జీబీ ర్యామ్
16 జీబి ఇంటర్నల్ మెమెరీ
32జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
2ఎంపీ+5ఎంపీ సెల్ఫీ కెమెరా
ఆటో-ఫోకస్, ఫేస్ రికగ్నిషన్ 8 ఎంపీ రియర్‌కెమెరా
2,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మార్కెట్లో విఘాతం కలిగించే టెక్నాలజీలను నిర్మించడంపై తాము విస్తృతంగా దృష్టి సారించామనీ, వినియోగదారులకు కావాల్సిన టెక్నాలజీ అందించే తమ ప్రయత్నానికి ఇదొక ఉదారహరణ అని ఐటెల్ మొబైల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఒక ప్రకటనలో చెప్పారు. ఆప్టిమైజేషన్ టెక్నాలజీ మద్దతుతో తమ బ్యాటరీ 350 గంటల సుదీర్ఘకాలంపాటు స్టాంబ్‌బై ఇస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment